Adah Sharma | నిర్మాత తీరుతో ఇబ్బందులు పడ్డా..! అల్లు అర్జున్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..
Adah Sharma | బాలీవుడ్ నటి ఆదా శర్మ ఇటీవల తనకు సినీ రంగంలో ఎదురైన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. షూటింగ్ డేట్లు సర్దుబాటు చేసే సమయంలో ఒక నిర్మాత తన మేనేజర్‌పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్య పదజాలంతో దూషించినట్లుగా వాపోయింది.
Entertainment | Published On Mar 9, 2026, 10.15 pm IST
Adah Sharma | బాలీవుడ్ నటి ఆదా శర్మ ఇటీవల తనకు సినీ రంగంలో ఎదురైన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. షూటింగ్ డేట్లు సర్దుబాటు చేసే సమయంలో ఒక నిర్మాత తన మేనేజర్‌పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్య పదజాలంతో దూషించినట్లుగా వాపోయింది. దాన్ని నుంచి బయటపడేందుకు నెలరోజులు ఇంటికే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్‌స్టా వీడియోతో అభిమానులతో ఈ విషయాలను షేర్ చేసుకుంది.
ఆదా చెప్పిన వివరాల ప్రకారం.. ఒకేసారి మూడు సినిమాలకు అంగీకరించానని, తొలి ప్రాజెక్ట్‌కు సంబంధించిన షూటింగ్ తేదీలు పదే పదే మారడం వల్ల మిగతా రెండు సినిమాల షెడ్యూల్స్‌కు ఇబ్బంది కలిగిందని తెలిపింది. అయినా ఆ సినిమా నిర్మాత మాత్రం తనకు చెప్పిన తేదీలకే షూటింగ్ జరగాలంటూ పట్టుబట్టారని చెప్పారు. ఈ నేపథ్యంలో జరిగిన చర్చల్లో సదరు నిర్మాత తన మేనేజర్‌ను దూషించారని ఆదా వివరించింది. అయితే, మిగతా రెండు చిత్రాల దర్శకులు మాత్రం ఎంతో సహనంగా వ్యవహరించి షూటింగ్ తేదీలను మార్చి సహకరించారని చెప్పింది. మూడో సినిమా నిర్మాత అయితే తన కోసం ఇతర నటీనటుల డేట్లను కూడా సర్దుబాటు చేసినట్టు వెల్లడించింది.
“సినిమా ఇండస్ట్రీలో చెడ్డవాళ్లు మాత్రమే కాదు, మంచి మనుషులు కూడా ఉన్నారని చెప్పడానికే ఈ విషయం చెబుతున్నా” అని ఆదా చెప్పుకొచ్చింది. కానీ, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక, మొదటి సినిమా నిర్మాత మాత్రం చివరికి ఆ తేదీలు అవసరం లేదని చెప్పడంతో తాను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె వాపోయింది. ఇదే సందర్భంలో ‘ది కేరళ స్టోరీ’ సీక్వెల్‌లో ఎందుకు కనిపించడంలేదన్న ప్రశ్నకు ఆదా స్పందించింది. తాను నటించని ప్రాజెక్ట్ గురించి మాట్లాడటం సరైంది కాదని, సీక్వెల్‌లో తాను నటిస్తానా లేదా అన్నది మేకర్స్‌కు తన మధ్య ఉండాల్సిన విషయం స్పష్టం చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా - రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్
- ●TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఈ నెల 27 దాకా అతిభారీ వర్షాలు..
- ●DoT SIM Card Misuse Fine | మీ సిమ్ కార్డు వేరేవాళ్లు వాడుతున్నారా? రూ.50 లక్షల ఫైన్, జైలు శిక్ష తప్పదు
- ●Heroine Radha | 50 కోట్లు దొంగతనానికి స్కెచ్ - సోదరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కంప్లైంట్
- ●UP Teacher Shot Dead | దారుణం.. విద్యార్థుల ఎదుటే టీచర్‌ను కాల్చి చంపాడు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా - రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్

TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఈ నెల 27 దాకా అతిభారీ వర్షాలు..

DoT SIM Card Misuse Fine | మీ సిమ్ కార్డు వేరేవాళ్లు వాడుతున్నారా? రూ.50 లక్షల ఫైన్, జైలు శిక్ష తప్పదు

Heroine Radha | 50 కోట్లు దొంగతనానికి స్కెచ్ - సోదరిపై టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కంప్లైంట్





