Mamitha Baiju | ఆసుపత్రిలో చేరిన హీరోయిన్ మమితా బైజు.. ఆస్ట్రేలియా పర్యటన రద్దు..
Mamitha Baiju | యంగ్ హీరోయిన్ మమితా బైజు తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో ఆసుపత్రిలో చేరారు. దాంతో ఈ వారం ఆస్ట్రేలియా వెళ్లాల్సిన పర్యటన రద్దయింది. సెప్టెంబరు 5న జరగాల్సిన ‘లెండాక్సిస్ క్లైడ్ ఓనం 2026’ వేడుకలకు మమితా ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. ఆమె అనారోగ్యం నేపథ్యంలో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు క్లైడ్ మలయాళీ అసోసియేషన్ ప్రకటించింది.
Entertainment | Published On Sep 2, 2026, 1.43 pm IST
Mamitha Baiju | యంగ్ హీరోయిన్ మమితా బైజు తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో ఆసుపత్రిలో చేరారు. దాంతో ఈ వారం ఆస్ట్రేలియా వెళ్లాల్సిన పర్యటన రద్దయింది. సెప్టెంబరు 5న జరగాల్సిన ‘లెండాక్సిస్ క్లైడ్ ఓనం 2026’ వేడుకలకు మమితా ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. ఆమె అనారోగ్యం నేపథ్యంలో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు క్లైడ్ మలయాళీ అసోసియేషన్ ప్రకటించింది. మమితా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని నిర్వాహకులు సామాజిక మీడియా వేదికగా వెల్లడించారు. ఆమెతో పాటు నిర్వాహకులు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా. వైద్యులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. వీలుంటే తప్పకుండా వచ్చేదాన్ని. కానీ, పరిస్థితుల కారణంగా ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది’’ అని మమితా పేర్కొంది.
ఆస్ట్రేలియాలోని మలయాళీ సమాజాన్ని కలుసుకోవాలన్న తన కోరిక నెరవేరకపోవడంపై మమిత విచారం వ్యక్తం చేసింది. కార్యక్రమానికి హాజరుకావాల్సిన వారందరికీ, నిర్వాహకులకు క్షమాపణలు చెబుతూ.. మరోసారి క్లైడ్ కుటుంబాన్ని కలిసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. మమితా బైజు బృందం, కార్యక్రమ వేదిక నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతున్నామని క్లైడ్ మలయాళీ అసోసియేషన్ తెలిపింది. కొత్త తేదీ ఖరారైన వెంటనే ప్రకటిస్తామని వెల్లడించింది. ఇక మమిత సినిమాల విషయానికి వస్తే ఇటీవల ‘బెత్లహెమ్ ఫ్యామిలీ యూనిట్’ రిలీజ్ అయ్యింది. విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. అలాగే, సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లోనూ నటించింది. రెండు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రూ.100కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
View this post on Instagram
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kayadu Lohar | ‘ఆ ప్రశ్న’ అడిగినప్పుడే.. సమాజం అసలు రూపం బయటపడుతుంది..! కయదు లోహర్ ఆసక్తికర పోస్ట్..!
సెప్టెంబర్ 9, 2026

Irumudi | ఓటీటీలోకి ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడో తెలుసా?
సెప్టెంబర్ 9, 2026

Mookuthi Amman 2 | దీపావళి బరిలో బిగ్ క్లాష్..! రామాయణానికి పోటీగా మూకుత్తి అమ్మన్..!
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Irumudi | ఓటీటీలోకి ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడో తెలుసా?
- ●Vijay Mallya | బ్రిటన్ నుంచి బయటకు రాలేను.. మాల్యా సంచలన వ్యాఖ్యలు..
- ●oxygen cylinder explodes | పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ఒకరు మృతి
- ●Balmoor Venkat | బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏలోనే దళిత వ్యతిరేక విధానం: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
- ●Surat textile market | సూరత్ టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. దుకాణాలు ధ్వంసం
- ●Addanki Dayakar | మేము అప్డేటెడ్ వర్షన్ దళితులం

Irumudi | ఓటీటీలోకి ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడో తెలుసా?

Vijay Mallya | బ్రిటన్ నుంచి బయటకు రాలేను.. మాల్యా సంచలన వ్యాఖ్యలు..

oxygen cylinder explodes | పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ఒకరు మృతి

Balmoor Venkat | బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏలోనే దళిత వ్యతిరేక విధానం: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్



