Ashu Reddy | హైకోర్టును తలుపుతట్టిన అషురెడ్డి.. కేసును కొట్టేయాలని పిటిషన్..!
Ashu Reddy | హనీ ట్రాప్, చీటింగ్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని సినీ నటి అషు రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. లండన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు కాగా, భారీ మొత్తంలో నగదు, బంగారం తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి.
Entertainment | Published On Apr 28, 2026, 8.15 pm IST
Ashu Reddy | హనీ ట్రాప్, చీటింగ్ ఆరోపణల కేసులో సినీ నటి అషు రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని, తన వివరణ తీసుకోకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆమె పిటిషన్‌లో ఆరోపించారు. లండన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వైవీ ధర్మేంద్ర ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేశారని, అయితే తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని అషు రెడ్డి పేర్కొన్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తన వాదనలు వినకుండానే పోలీసులు చర్యలు తీసుకున్నారని, ధర్మేంద్ర తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాత్రమే కేసు నమోదు చేయడం అన్యాయమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే..
ఈ వ్యవహారం లండన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. 2018లో భారత్‌కు వచ్చిన సమయంలో అషు రెడ్డితో తనకు పరిచయం ఏర్పడిందని, అది క్రమంగా ప్రేమ సంబంధంగా మారిందని ఆయన ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తన నుంచి భారీగా నగదు, బంగారం తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటు తన డబ్బుతో ఫ్లాట్లు, కార్లు కొనుగోలు చేయించి వాటిని తన పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించుకుందని ఆరోపించారు. 2025 వరకు సుమారు రూ.9.35 కోట్లు, 5 కిలోల బంగారం తీసుకున్నట్లు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. అషు రెడ్డి సోదరి కూడా అదనంగా రూ.50 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు అషు రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కేసు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు




