Horror OTT | ఎట్టకేలకు ఓటీటీలోకి ఆది పినిశెట్టి హారర్ మూవీ – క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్
ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ మూవీ శబ్దం థియేటర్లలో ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది. మంగళవారం నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. లక్ష్మీమీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో సిమ్రాన్, లైలా కీలక పాత్రలు పోషించారు.
Entertainment | Published On Mar 24, 2026, 10.49 am IST
Horror OTT | ఆది పినిశెట్టి హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ శబ్దం థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాకు అరివళగన్ దర్శకత్వం వహించాడు. ఇందులో లక్ష్మీ మీనన్ హీరోయిన్‌గా నటించింది. సీనియర్ హీరోయిన్లు లైలా, సిమ్రాన్ కీలక పాత్రల్లో కనిపించారు. మంగళవారం శబ్దం మూవీ ఓటీటీలోకి వచ్చింది. జీ5 ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం తమిళ వెర్షన్ మాత్రమే రిలీజైంది. తెలుగు వెర్షన్‌పై జీ5 ఓటీటీ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.
వైశాలి తర్వాత....
ఆది పినిశెట్టి, డైరెక్టర్ అరివళగన్ కాంబినేషన్‌లో వచ్చిన సెకండ్ మూవీ ఇది. గతంలో వీరిద్దరు కలయికలో వచ్చిన వైశాలి పెద్ద హిట్టయ్యింది. దాంతో శబ్దంపై తమిళంతో పాటు తెలుగులోనూ మంచి హైప్ ఏర్పడింది. టెక్నికల్‌గా బ్రిలియంగ్ మూవీ అని పేరొచ్చిన కమర్షియల్‌గా మాత్రం విజయాన్ని సాధించలేకపోయింది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా అర్థవంతంగా ప్రేక్షకులకు చెప్పడంలో తడబడిపోయారు.
శబ్దం సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు.
మెడికల్ కాలేజీ మిస్టరీ...
మున్నార్‌లోని ఓ మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ వరుసగా చనిపోతుంటారు. కాలేజీలో ఆత్మలు ఉన్నాయని ప్రచారం జరగడంతో స్టూడెంట్స్ కాలేజీకి రావడానికే భయపడుతుంటారు. ఈ సమస్య పరిష్కారం కోసం పారానార్మల్ ఇన్వేస్టిగేటర్ వైద్యలింగం రప్పిస్తారు కాలేజీ మేనేజ్‌మెంట్. కాలేజీలోని లైబ్రరీలో ఓ 42 ఆత్మలు ఉన్నట్లుగా వైద్యలింగం గుర్తిస్తాడు. ఆ ఆత్మలు ఎవరివి? వారంతా ఎలా చనిపోయారు? ఈ హత్యలకు అవంతికతో పాటు డయానా, నాన్సీ డేనియల్‌కు ఉన్న సంబంధం ఏమిటి అన్నదే ఈ మూవీ కథ.
తెలుగు, తమిళ భాషల్లో మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు ఆది పినిశెట్టి. ఏడాది బాలకృష్ణ అఖండ 2 మూవీలో విలన్‌గా కనిపించాడు ఆది పినిశెట్టి. ప్రస్తుతం హీరోగా మరకతమణి 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి భార్య నిక్కీ గల్రానీ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్




