త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TTD | తిరుమ‌ల శ్రీ‌వారి భ‌క్తుల‌కు అలర్ట్‌.. మే నెల ఆర్జిత సేవ‌, ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టికెట్ల కోటాపై కీల‌క అప్‌డేట్‌..

TTD | శ్రీ‌వారి భ‌క్తుల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది మే మాసానికి సంబంధించి ఆర్జిత సేవ‌ల టికెట్లు, ప్ర‌త్యేక ద‌ర్శ‌నం, గ‌దుల కోటా వివ‌రాల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ప్ర‌క‌టించింది.

P

Devotional | Published On Feb 16, 2026, 8.12 pm IST

TTD | తిరుమ‌ల శ్రీ‌వారి భ‌క్తుల‌కు అలర్ట్‌.. మే నెల ఆర్జిత సేవ‌, ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టికెట్ల కోటాపై కీల‌క అప్‌డేట్‌..
Advertisement

TTD | శ్రీ‌వారి భ‌క్తుల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది మే మాసానికి సంబంధించి ఆర్జిత సేవ‌ల టికెట్లు, ప్ర‌త్యేక ద‌ర్శ‌నం, గ‌దుల కోటా వివ‌రాల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ప్ర‌క‌టించింది. ఆర్జిత సేవ‌లైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ టికెట్ల కోటాను 18న ఉద‌యం 10 గంట‌ల‌కు అందుబాటులో ఉంచ‌నున్న‌ది. ఎల‌క్ట్రిక్ డిప్‌లో కేటాయించ‌నున్న టికెట్ల కోసం భ‌క్తులు 20వ తేదీ ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో పేర్లు న‌మోదు చేసుకోవ‌చ్చ‌ని టీటీడీ పేర్కొంది. టికెట్లు పొందిన భ‌క్తులు 20 నుంచి 22 మ‌ధ్యాహ్నం 12 గంట‌ల్లోగా డ‌బ్బులు చెల్లించాల్సి ఉంటుంద‌ని చెప్పింది. 21న క‌ల్యాణం ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పేర్కొంది.

అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్న‌ట్లు పేర్కొంది. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుద‌ల‌వుతాయ‌ని చెప్పింది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారు శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచితంగా టోకెన్లు జారీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ టోకెన్ల కోసం 23న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు చెప్పింది.

24న ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు..

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు టీటీడీ పేర్కొంది. తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్నారు. 27న శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటా, ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటాను 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయ‌నున్న‌ట్లు టీటీడీ పేర్కొంది. భ‌క్తులంతా ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోరింది.

Advertisement
Advertisement