త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Cabinet Meeting | ఫిబ్ర‌వ‌రిలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. తెలంగాణ కేబినెట్ ఆమోదం..!

TG Cabinet Meeting | ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న మేడారంలో రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభ‌మైంది. చ‌రిత్ర‌లో తొలిసారిగా స‌చివాల‌యం, హైద‌రాబాద్ వెలుప‌ల కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించ‌డం విశేషం.

P

Telangana | Published On Jan 18, 2026, 9.10 pm IST

TG Cabinet Meeting | ఫిబ్ర‌వ‌రిలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. తెలంగాణ కేబినెట్ ఆమోదం..!
Advertisement

TG Cabinet Meeting | ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న మేడారంలో రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభ‌మైంది. చ‌రిత్ర‌లో తొలిసారిగా స‌చివాల‌యం, హైద‌రాబాద్ వెలుప‌ల కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించ‌డం విశేషం. ఇటీవ‌ల రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌లు విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. మున్సిప‌ల్ ఎన్నిక‌ల కోసం రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఓట‌రు జాబితాను సిద్ధం చేయ‌డంతో పాటు రిజ‌ర్వేష‌న్లు ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో పుర పోరును ఫిబ్ర‌వ‌రిలో నిర్వ‌హించేందుకు కేబినెట్ సూత్ర‌ప్రాయంగా ఆమోద‌ముద్ర వేసింది. రెండోవారంలో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఇక మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికకు సైతం మంత్రివర్గం ఆమోదముద్ర వేయ‌నున్న‌ది.

అలాగే, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై రిటైర్డ్‌ జడ్జితో కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ప్ర‌స్తుతం కేబినెట్ స‌మావేశం స‌మావేశం కొన‌సాగుతుండ‌గా.. 22 అంశాల‌పై మంత్రులు చ‌ర్చిస్తున్నారు. మేడారం జాత‌ర‌ను రాష్ట్ర పండుగ‌గా ప్ర‌క‌టించిన స‌ర్కారు.. సెల‌వులు మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. ఈ అంశంపై సైతం నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. ములుగు నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి కీల‌క నిర్ణ‌యం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండ‌గా.. మేడారంలో ఏర్పాటు చేసిన క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ను సీఎం, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్కతో పాటు మంత్రులు ప‌రిశీలించారు. జాత‌ర ఏర్పాట్ల‌పై ఆరా తీశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement