Navaratri Brahmotsavam | వేడుకగా బంగారు తిరుచ్చి ఉత్సవం.. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి దర్శనం
Navaratri Brahmotsavam | తిరుమల వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం బంగారు తిరుచ్చి ఉత్సవంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి బంగారు తిరుచ్చిపై కొలువుదీర్చారు.
Devotional | Published On Oct 12, 2026, 6.00 pm IST
Navaratri Brahmotsavam | తిరుమల వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం బంగారు తిరుచ్చి ఉత్సవంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి బంగారు తిరుచ్చిపై కొలువుదీర్చారు. అనంతరం మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపు సాగుతున్నంతసేపు భక్తులు గోవింద నామస్మరణతో పరిసరాలను మార్మోగాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహన సేవలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తారు. బంగారు తిరుచ్చి ఉత్సవంతో ప్రారంభమైన వేడుకల్లో భాగంగా తిరుమలలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చినజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Keerthy Suresh | పన్నెండేళ్ల తర్వాత ఊటీలో కీర్తి సురేష్ సినిమా షూటింగ్ - వెంకటేష్‌తో రొమాంటిక్ డ్యూయెట్
- ●Free Training for Police Jobs | ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 60 రోజుల పాటు ఉచిత శిక్షణ
- ●Rahul Gandhi vs Election Commission | 'రాహుల్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్': సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు.. రేపే సీజేఐ బెంచ్ విచారణ
- ●TCS | ఏఐ నైపుణ్యాలున్న ఫ్రెషర్లకు టీసీఎస్‌లో భారీగా ఉద్యోగాలు.. 6 నెలల్లో 24 వేల నియామకాలు..
- ●Revanth Reddy | ఓటిచ్చేందుకు అప్పుడు సర్ తీసుకొస్తే.. ఇప్పుడు బీజేపీ తెంచేస్తుంది
- ●KTR | నాంపల్లి ఏసీబీ కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్..!

Keerthy Suresh | పన్నెండేళ్ల తర్వాత ఊటీలో కీర్తి సురేష్ సినిమా షూటింగ్ - వెంకటేష్‌తో రొమాంటిక్ డ్యూయెట్

Free Training for Police Jobs | ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 60 రోజుల పాటు ఉచిత శిక్షణ

Rahul Gandhi vs Election Commission | 'రాహుల్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్': సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు.. రేపే సీజేఐ బెంచ్ విచారణ

TCS | ఏఐ నైపుణ్యాలున్న ఫ్రెషర్లకు టీసీఎస్‌లో భారీగా ఉద్యోగాలు.. 6 నెలల్లో 24 వేల నియామకాలు..






