Break Darshan Cancelled | తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. పది బ్రేక్ దర్శనాలు రద్దు
Break Darshan Cancelled | శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసింది.
Devotional | Published On Oct 6, 2026, 4.17 pm IST
- అక్టోబర్ 11 నుంచి 20 వరకు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ దర్శనాలు నిలిపివేత
- 7న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల రిలీజ్
Break Darshan Cancelled | శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసింది. ఈ పది రోజులపాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐలు, డిఫెన్స్ సిబ్బంది దర్శనాలను కూడా నిలిపివేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరగనుండటం, అదే సమయంలో పెరటాసి మాసం చివరి వారం కావడంతో తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రద్దీని నియంత్రించడం, భక్తులకు దర్శన ఏర్పాట్లను సజావుగా నిర్వహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.
అక్టోబర్ 7న రూ.300 టికెట్లు
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20 తేదీలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అక్టోబర్ 7న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ టికెట్లను టీటీడీ అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే బుక్ చేసుకోవాలని సూచించింది. టికెట్ల కోసం ఇతర అనధికారిక వెబ్‌సైట్లు, వ్యక్తులను ఆశ్రయించకుండా జాగ్రత్త వహించాలని టీటీడీ కోరింది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి కూడా టీటీడీ మరో కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 10 నుంచి 19వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను స్వీకరించబోమని తెలిపింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రం మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. బ్రహ్మోత్సవాలు, పెరటాసి మాసం నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున భక్తులు తిరుమల యాత్రనే ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ సూచించింది. దర్శనం, వసతి తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణ ప్రణాళిక రూపొందించుకోవాలని కోరింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nobel Prize 2026 | భౌతికశాస్త్రంలో ఫ్రాన్సిస్ హాల్జన్‌కు నోబెల్
- ●Jupally Krishna Rao | ఎల్‌నినో ఎఫెక్ట్.. బీర్ల ఉత్పత్తిపై లేనే లేదు
- ●Stock Markets | పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●Rahul Ramakrishna | రాహుల్ రామకృష్ణ సూపర్ హిట్ కామెడీ మూవీకి సీక్వెల్ - హీరోగా మహేష్‌బాబు మేనల్లుడు
- ●Man Remanded to Judicial Custody | అకారణంగా ఆర్టీసీ సిబ్బందిపై దాడి.. వ్యక్తికి రిమాండ్ విధించిన కోర్టు
- ●Bhatti Vikramarka | 8 వేల మెగావాట్ల అదనపు భారం.. అయినా విద్యుత్ కోతలు లేవు

Nobel Prize 2026 | భౌతికశాస్త్రంలో ఫ్రాన్సిస్ హాల్జన్‌కు నోబెల్

Jupally Krishna Rao | ఎల్‌నినో ఎఫెక్ట్.. బీర్ల ఉత్పత్తిపై లేనే లేదు

Stock Markets | పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..

Rahul Ramakrishna | రాహుల్ రామకృష్ణ సూపర్ హిట్ కామెడీ మూవీకి సీక్వెల్ - హీరోగా మహేష్‌బాబు మేనల్లుడు






