Shani Jayanti 2026 | శని జయంతి విశిష్టత.. కర్మఫలదాత ఆరాధన వెనుక రహస్యమేంటో తెలుసా..?
Shani Jayanti 2026 | శని పేరు వినగానే చాలామందిలో ఏదో ఓ తెలియని భయం మొదలవుతుంది. ఆయన ప్రభావం కఠినంగా ఉంటుందనే భావన సమాజంలో బలంగా నాటుకుపోయింది. అయితే, జ్యోతిష శాస్త్రం చెబుతున్నది ఏమిటంటే.. నవగ్రహాల్లో ప్రతి గ్రహానికీ ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.
Devotional | Published On May 16, 2026, 6.15 am IST
Shani Jayanti 2026 | శని పేరు వినగానే చాలామందిలో ఏదో ఓ తెలియని భయం మొదలవుతుంది. ఆయన ప్రభావం కఠినంగా ఉంటుందనే భావన సమాజంలో బలంగా నాటుకుపోయింది. అయితే, జ్యోతిష శాస్త్రం చెబుతున్నది ఏమిటంటే.. నవగ్రహాల్లో ప్రతి గ్రహానికీ ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఆయా గ్రహాల సంచారాలు, గమన మార్పులు ప్రకృతి నుంచి మనుషుల జీవితాల వరకూ అనేక ప్రభావాలు చూపుతాయని నమ్మకం. ఆ నవగ్రహాల్లో శనిదేవుడు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. జ్యోతిషం, ఖగోళం, ఆధ్యాత్మికత ఈ మూడింటికీ శని ఒక ముఖ్య కేంద్రంగా భావిస్తారు. వైశాఖ అమావాస్య రోజునే శని జయంతి నిర్వహిస్తారు. ఈ నెల 16(మే)న జయంతి జయంతి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..
మందగమనుడిగా పేరు..
శనైశ్చరుడికి ‘మందుడు’, ‘స్థిరుడు’ ఇలా చాలా పేర్లు ఉన్నాయి. ఇతర గ్రహాలతో పోలిస్తే చాలా నెమ్మదిగా సంచరించే స్వభావం ఉండడంతో ఆయనను ‘మందుడు’ అని పిలుస్తుంటారు. శని తన కక్ష్యలో ఒక ప్రదక్షిణ పూర్తి చేయడానికి దాదాపు 30 ఏళ్లు పడుతుందని పండితులు పేర్కొంటున్నారు. అదే కారణంగా ఆయన గమనాన్ని మందగమనంగా అభివర్ణిస్తారు. అలాగే ఒక రాశిలో ఎక్కువకాలం ఉండడంతో ‘స్థిరుడు’ అనే పేరు వచ్చినట్లు పురాణాలు వివరిస్తాయి. వారంలో ఉన్న ఏడు రోజుల పేర్లు కూడా గ్రహాల ఆధారంగానే ఏర్పడ్డాయి. అందులో చివరి రోజు శనివారం. దీన్ని కొందరు మందవారం, స్థిరవారంగా వ్యవహరిస్తారు. ఖగోళశాస్త్రపరంగా చూస్తే.. సౌర కుటుంబంలో గురుగ్రహం తర్వాత అతిపెద్ద గ్రహం శనిగ్రహమే. సూర్యుడికి దూరం పరంగా లెక్కిస్తే ఇది ఆరో గ్రహంగా గుర్తించారు.
జన్మ రహస్యం..
పురాణ ప్రకారం శని తల్లిదండ్రులు సూర్యుడు, ఛాయాదేవి. శనైశ్చరుడిని న్యాయాధిపతి, కర్మఫలదాతగా పేర్కొంటారు. శనైశ్చరుడి జన్మవృతాంతం స్కాంద పురాణంలో ఉన్నది. ఆయన పుట్టుకలో అసాధారణ మలుపులున్నాయి. సూర్యుడి భార్య పేరు సంధ్య. తన భర్తలోని దివ్య తేజస్సును, వేడిని తట్టుకోలేకపోయేది. కాలక్రమేణా ఆ తట్టుకోలేని స్థితి భరించలేని స్థితికి చేరుకుంది. దాంతో శాంతి కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. అయితే భార్యగా, తల్లిగా తన బాధ్యతలు విస్మరించకూడదనే భావనతో ఒక యోచన చేసింది. తన ప్రతిరూపాన్ని సృష్టించి దానికి ‘ఛాయ’ అని పేరు పెట్టింది. తన పిల్లల సంరక్షణ బాధ్యతలను ఛాయకు అప్పగించి సంధ్య తపస్సు కోసం వెళ్లిపోయింది. ఈ విషయం తెలియని సూర్యుడు ఛాయనే సంధ్యగా భావించి జీవితం కొనసాగించాడు. వారిద్దరికీ సావర్ణి మనువు, శని, తపతి అనే ముగ్గురు సంతానం కలిగినట్లుగా పూరాణాలు పేర్కొంటున్నాయి.
శనిపూజ ప్రాధాన్యం
శని జయంతి రోజున శనిదేవుని ఆరాధిస్తే శని ప్రభావంతో కలిగే ఇబ్బందులు తగ్గి, జీవితం స్థిరంగా మారుతుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావం ఎదుర్కొంటున్నవారు ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అలాగే, జాతకంలో శని మహాదశ, అంతర్దశ నడుస్తున్నవారు కూడా శని ఆరాధన చేయడం మంచిదని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు. శనిపూజలో నలుపు రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంటుంది. నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్ల వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, అదే నూనెతో అభిషేకం చేయడం శుభప్రదంగా భావిస్తారు. నీలిరంగు పుష్పాలతో పూజ నిర్వహించి, నల్ల నువ్వులు-బెల్లంతో చేసిన చిమ్మిలిని నైవేద్యంగా సమర్పిస్తారు. అవకాశం ఉన్నవారు నల్ల నువ్వులు, బియ్యం దానం చేయడం కూడా చేస్తుంటారు. త్రయోదశి తిథి శనిదేవునికి ప్రీతికరమైనదిగా భావిస్తారు. శనివారం రోజున త్రయోదశి కలిసివస్తే దాన్ని ‘శని త్రయోదశి’గా పరిగణిస్తారు. ఇది ఏ నెలలోనైనా రావచ్చు. శనిని ‘పేదల పక్షపాతి’గా కూడా పురాణాలు పేర్కొంటాయి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, పేదలకు సేవ చేయడం ద్వారా శనిదేవుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
శనైశ్చరుడి ధ్యాన శ్లోకం
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

HD Kumaraswamy | కర్నాటకలో సర్ కార్యక్రమం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కేంద్రమంత్రి కుమారస్వామి
జులై 4, 2026

Vaibhav Suryavanshi | 15 ఏళ్లకే టీమిండియా క్యాప్.. సచిన్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ
జులై 4, 2026

CS Review | స్పెషల్ కాంటింజెన్సీ పంట ప్రణాళికలు సిద్ధం చేయాలి.. కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
జులై 4, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



