Brahmotsavam 2026 | వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం.. సుదర్శన చక్ర స్పర్శతో పావనమైన పుష్కరిణి జలాలు
Brahmotsavam 2026 | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. తొమ్మిదిరోజుల బ్రహ్మోత్సవాలకు ముగింపుగా శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం (అవభృథం) అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సుదర్శన చక్రత్తాళ్వార్లకు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించగా.. వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
Devotional | Published On Sep 23, 2026, 3.47 pm IST
Brahmotsavam 2026 | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. తొమ్మిదిరోజుల బ్రహ్మోత్సవాలకు ముగింపుగా శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం (అవభృథం) అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సుదర్శన చక్రత్తాళ్వార్లకు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించగా.. వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో శ్రీవారి పుష్కరిణి భక్తజన సందోహంతో పులకించింది. అంతకుముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య శ్రీ భూవరాహస్వామివారి ఆలయ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్రచామరాది రాజోపచారాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణల ద్వారా అభిషేకం చేశారు.
ఆధ్యాత్మిక పరిమళం

స్నపన తిరుమంజనం సందర్భంగా టీటీడీ వేదపారాయణదారులు ఉపనిషత్తు, దశశాంతి, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం తదితర మంత్రాలను ఘనంగా పారాయణం చేశారు. అభిషేకానంతరం పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి దివ్య ప్రబంధ పాశురాలను పఠించారు. తొమ్మిదిరోజుల బ్రహ్మోత్సవాల్లో నిర్వహించిన సమస్త సేవలు సఫలమై, లోకక్షేమం, భక్తుల సుఖశాంతులు కలగాలని చక్రస్నానం నిర్వహించడం సంప్రదాయం. బ్రహ్మోత్సవాలను యజ్ఞస్వరూపంగా భావిస్తారు. యజ్ఞాంతంలో నిర్వహించే అవభృథస్నానం ద్వారా ఉత్సవ నిర్వహణలో జరిగిన లోపదోషాలు తొలగి సంపూర్ణ ఫలితాలు చేకూరుతాయని ఆగమ సంప్రదాయం.
పులకించిన భక్తజనం..

స్నపన తిరుమంజనం అనంతరం సుదర్శన చక్రత్తాళ్వార్లను శ్రీవారి పుష్కరిణికి తీసుకువచ్చి పవిత్ర జలాల్లో స్నానం చేయించారు. సుదర్శన చక్ర స్పర్శతో పుష్కరిణి జలాలు మరింత పావనమయ్యాయని విశ్వసిస్తూ.. అదే సమయంలో వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరించారు. చక్రస్నానాన్ని దర్శించిన, నిర్వహించిన, సహకరించిన భక్తులందరికీ బ్రహ్మోత్సవ యజ్ఞఫలం లభించాలని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ప్రార్థించారు. కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు శరత్, ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, టీటీడీ సీఈ మనోహరం, ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్, శ్రీవారి సేవకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
సెప్టెంబర్ 22, 2026

Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..
సెప్టెంబర్ 22, 2026

Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Telangana Employees | ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. రెండు డీఏలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్
- ●Karnataka man murdered | యూఏఈలో భారతీయ వ్యక్తి దారుణ హత్య.. మృతదేహాన్ని తొమ్మిది ముక్కలు చేసి
- ●BJP State In-Charges 2026 | బీజేపీ భారీ ప్రక్షాళన: తెలంగాణ ఇన్చార్జ్గా సునీల్ బన్సల్.. తమిళనాడు సహ ఇన్చార్జ్గా డీకే అరుణ
- ●KTR | తెలంగాణలో 1980 రోజులు.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ విమర్శ
- ●KTR | జెన్కోకు థర్డ్ గ్రేడ్ కోల్ : కేటీఆర్
- ●Clean Max | క్లీన్ మ్యాక్స్ షేర్లలో జోష్.. భారీ లాభాలకు చాన్స్..

Telangana Employees | ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. రెండు డీఏలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్

Karnataka man murdered | యూఏఈలో భారతీయ వ్యక్తి దారుణ హత్య.. మృతదేహాన్ని తొమ్మిది ముక్కలు చేసి

BJP State In-Charges 2026 | బీజేపీ భారీ ప్రక్షాళన: తెలంగాణ ఇన్చార్జ్గా సునీల్ బన్సల్.. తమిళనాడు సహ ఇన్చార్జ్గా డీకే అరుణ

KTR | తెలంగాణలో 1980 రోజులు.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ విమర్శ



