Bhadohi Train Accident | విషాదం.. రూ.100 ఇవ్వలేదని రైలు కింద పడేందుకు పరుగెత్తిన కొడుకు.. కాపాడబోయి తల్లి మృతి
ఉత్తరప్రదేశ్‌లోని భదోహీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేవలం రూ.100 ఇవ్వలేదని రైలు కింద పడేందుకు పరుగెత్తిన కొడుకును కాపాడబోయి ఓ తల్లి ప్రాణాలు కోల్పోయింది.
- యూపీలోని భదోహీలో వంద రూపాయల కోసం తల్లీకొడుకుల మధ్య చిన్నపాటి గొడవ
- తన వద్ద డబ్బుల్లేవని తల్లి చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై రైల్వే ట్రాక్ వైపు పరుగెత్తిన కొడుకు
- కొడుకును రక్షించే క్రమంలో ట్రైన్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన తల్లి శివకుమారి దేవి
- తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న కుమారుడు
Bhadohi Train Accident | ఉత్తరప్రదేశ్‌లోని భదోహీ (Bhadohi) జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన వెలుగుచూసింది. కేవలం వంద రూపాయల కోసం జరిగిన ఓ చిన్న గొడవ ఏకంగా ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు పరుగెత్తిన కన్న కొడుకును రక్షించుకునే ప్రయత్నంలో.. ఓ తల్లి ట్రైన్ కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.
పరుగెత్తిన కొడుకు.. వెనకాలే ఆ తల్లి
అసలేం జరిగిందంటే.. ఆరోగ్య శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న శివకుమారి దేవిని ఆమె కుమారుడు వంద రూపాయలు అడిగాడు. అయితే, ఆ సమయంలో తన దగ్గర డబ్బులు లేవని ఆమె సున్నితంగా మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు, అలిగి వేగంగా సమీపంలోని రైల్వే ట్రాక్ వైపు పరుగెత్తాడు. ఇది గమనించిన ఆ తల్లి.. కొడుకు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతాడేమో అన్న భయంతో, టెన్షన్ పడుతూ అతడిని ఆపేందుకు వెనకాలే పరుగెత్తింది.
స్పాట్‌లోనే మృతి.. ఐఫోన్ ఘటన మరువక ముందే..
కొడుకును రక్షించే క్రమంలో శివకుమారి దేవి అటుగా వేగంగా వస్తున్న రైలును గమనించలేకపోయింది. ట్రైన్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కొడుకు ప్రస్తుతం చావుబతుకుల మధ్య హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. శివకుమారి దేవి భర్త రామ్‌సాగర్ రాజ్‌భర్ ఈ ఘటనతో తీవ్ర షాక్‌లో ఉన్నాడు. సరిగ్గా నిన్ననే మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో కూడా ఓ 19 ఏళ్ల యువకుడు ఐఫోన్ ఈఎంఐ కట్టే విషయంలో గొడవ జరిగి ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం మరువక ముందే.. ఈ తాజా ఘటన జరగడం యువత క్షణికావేశాలకు అద్దం పడుతోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●New EHS Scheme | అమల్లోకి కొత్త ఈహెచ్ఎస్ పథకం
- ●Indiramma Indlu Scheme | జిల్లాల్లోనూ 'ఇందిరమ్మ' టవర్స్.. పేదలకు కేవలం రూ.230కే సిమెంట్ బస్తా
- ●MP Mallu Ravi | కొండా సురేఖ కనీసం మంత్రిగా ఖండించాల్సి ఉండే : ఎంపీ మల్లు రవి
- ●Chinna Reddy | నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలే.. నాపై వచ్చే ఆరోపణలు అబద్దం
- ●TFCC | తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజుకున్న వివాదం.. సెప్టెంబర్ నుంచి సినిమాల రిలీజ్ బంద్..!
- ●Cambridge University | హైదరాబాద్‌ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు మేం రెడీ.. మాటిచ్చిన కేంబ్రిడ్జ్

New EHS Scheme | అమల్లోకి కొత్త ఈహెచ్ఎస్ పథకం

Indiramma Indlu Scheme | జిల్లాల్లోనూ 'ఇందిరమ్మ' టవర్స్.. పేదలకు కేవలం రూ.230కే సిమెంట్ బస్తా

MP Mallu Ravi | కొండా సురేఖ కనీసం మంత్రిగా ఖండించాల్సి ఉండే : ఎంపీ మల్లు రవి

Chinna Reddy | నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలే.. నాపై వచ్చే ఆరోపణలు అబద్దం




