Chinna Reddy | నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలే.. నాపై వచ్చే ఆరోపణలు అబద్దం
Chinna Reddy | నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలేదని.. నాపై వచ్చే ఆరోపణలు అబద్దమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తీరు నచ్చకనే, 40 ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల ఆవేదనను మాత్రమే మాట్లాడానని పేర్కొన్నారు.
- వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తీరు నచ్చలేదు.. కార్యకర్తల ఆవేదననే చెప్పా
- నోటీసును ఉపసంహరించుకోండి
- కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి వివరణ లేఖ రాసిన చిన్నారెడ్డి
Chinna Reddy | త్రినేత్ర.న్యూస్: నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలేదని.. నాపై వచ్చే ఆరోపణలు అబద్దమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తీరు నచ్చకనే, 40 ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల ఆవేదనను మాత్రమే మాట్లాడానని పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలనే ఉద్దేశం లేదని.. కేవలం పార్టీకి నష్టం కలిగించేవారిని ప్రశ్నించడమే తన ఉద్దేశమన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులపై స్పందిస్తూ ఆయన శనివారం కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి వివరణ లేఖ రాశారు.
ఆ లేఖలో ఇంకా ఏముందంటే..
1978లో ఇందిరా గాంధీ కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పుడు పార్టీలో సభ్యత్వం తీసుకొని ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నా. ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలే. ఢిల్లీలోని ఇందిరా భవన్, హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ను పవిత్ర దేవాలయాలుగా భావించాను. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్లు నాకు దేవుళ్లతో సమానం. అలాంటి వారికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడే పరిస్థితి కూడా రాదు.
నేను పార్టీకి వ్యతిరేకంగా ఏ రోజూ మాట్లాడలేదు. ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే వ్యవహారం ఒంటెద్దు పోకడలా ఉంది. రెండున్నరేళ్లుగా కార్యకర్తల ఆవేదనను మాత్రమే మాట్లాడాను. ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేసే అలవాటు నాకు లేదు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలి. నాకు ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకోవాలి అని చిన్నారెడ్డి విజ్ఞప్తి చేశారు.
సంబంధిత వార్తలు

Minister Komatireddy | రోడ్ల పనుల్లో జాప్యం వద్దు.. వేగం పెంచాలి: కోమటిరెడ్డి
ఆగస్టు 22, 2026

కొండా ఫ్యామిలీకి ఒకలా?… కోమటిరెడ్డి ఫ్యామిలీకి మరోలా? తెలంగాణ కాంగ్రెస్‌లో డబుల్ స్టాండర్డ్స్ రచ్చ!!
ఆగస్టు 22, 2026

Adluri Laxman Kumar | ఆశ్రమ పాఠశాలల్లోని సీఆర్టీ సిబ్బంది సమస్యలు పరిష్కారిస్తాం : మంత్రి అడ్లూరి
ఆగస్టు 22, 2026
తాజావార్తలు
- ●Job Mela | ఆగస్టు 24న హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా
- ●Minister Komatireddy | రోడ్ల పనుల్లో జాప్యం వద్దు.. వేగం పెంచాలి: కోమటిరెడ్డి
- ●కొండా ఫ్యామిలీకి ఒకలా?… కోమటిరెడ్డి ఫ్యామిలీకి మరోలా? తెలంగాణ కాంగ్రెస్‌లో డబుల్ స్టాండర్డ్స్ రచ్చ!!
- ●Adluri Laxman Kumar | ఆశ్రమ పాఠశాలల్లోని సీఆర్టీ సిబ్బంది సమస్యలు పరిష్కారిస్తాం : మంత్రి అడ్లూరి
- ●Bhadohi Train Accident | విషాదం.. రూ.100 ఇవ్వలేదని రైలు కింద పడేందుకు పరుగెత్తిన కొడుకు.. కాపాడబోయి తల్లి మృతి
- ●New EHS Scheme | అమల్లోకి కొత్త ఈహెచ్ఎస్ పథకం

Job Mela | ఆగస్టు 24న హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా

Minister Komatireddy | రోడ్ల పనుల్లో జాప్యం వద్దు.. వేగం పెంచాలి: కోమటిరెడ్డి

కొండా ఫ్యామిలీకి ఒకలా?… కోమటిరెడ్డి ఫ్యామిలీకి మరోలా? తెలంగాణ కాంగ్రెస్‌లో డబుల్ స్టాండర్డ్స్ రచ్చ!!

Adluri Laxman Kumar | ఆశ్రమ పాఠశాలల్లోని సీఆర్టీ సిబ్బంది సమస్యలు పరిష్కారిస్తాం : మంత్రి అడ్లూరి




