త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Youtube | యూట్యూబ్‌లో వ్యూస్ రావ‌డం లేద‌ని.. ల‌క్ష‌లు విలువ చేసే స్టూడియోకు నిప్పు పెట్టాడు..

Youtube | జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో 27 ఏళ్ల యూట్యూబర్ తన ఇంట్లో ఏర్పాటు చేసిన స్టూడియోకు నిప్పు పెట్టిన సంఘటన క‌ల‌క‌లం రేపింది. పోలీసులు, స్థానికులు సమయానికి స్పందించి అతని కుటుంబాన్ని రక్షించగలిగినప్పటికీ ఈ ప్ర‌మాదంలో రూ.10 లక్షలకు పైగా విలువైన పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి.

S

Crime | Published On Feb 13, 2026, 9.59 am IST

Youtube | యూట్యూబ్‌లో వ్యూస్ రావ‌డం లేద‌ని.. ల‌క్ష‌లు విలువ చేసే స్టూడియోకు నిప్పు పెట్టాడు..
Advertisement

Youtube | జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో 27 ఏళ్ల యూట్యూబర్ తన ఇంట్లో ఏర్పాటు చేసిన స్టూడియోకు నిప్పు పెట్టిన సంఘటన క‌ల‌క‌లం రేపింది. పోలీసులు, స్థానికులు సమయానికి స్పందించి అతని కుటుంబాన్ని రక్షించగలిగినప్పటికీ ఈ ప్ర‌మాదంలో రూ.10 లక్షలకు పైగా విలువైన పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. విధాయక్ ప్రజాపతి అనే వ్య‌క్తి తన నివాసంలోనే ఫిల్మ్ ఎడిటింగ్, డిజిటల్ వర్క్ స్టూడియోను నిర్వహిస్తున్నాడు. ఆధునిక సదుపాయాలతో స్టూడియో నిర్మించేందుకు అత‌ను త‌న‌కు త‌న పూర్వీకుల నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చిన‌ భూమిని విక్ర‌యించాడ‌ని స్థానికులు తెలిపారు. యూట్యూబ్‌లో గుర్తింపు పొందాలన్న ఆశతో ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిపారు. అయితే నెలల తరబడి శ్ర‌మించినా సరైన ఫ‌లితం రాలేదు. యూట్యూబ్ చాన‌ల్‌కు స‌బ్ స్క్రైబ‌ర్లు పెర‌గ‌లేదు. దీంతో అత‌ను తీవ్ర నిరాశతో మ‌న‌స్థాపానికి గుర‌య్యాడు.

ర‌క్షించిన పోలీసులు..

కాగా గ్రామ మాజీ సర్పంచ్ ప్రకాశ్ కుమార్ అరుణ్ తెలిపిన వివరాల ప్రకారం, గత వారం రోజులుగా ప్రజాపతి ఇంటికే పరిమితమై ఒంటరిగా ఉంటున్నాడు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో స్టూడియోలోకి వెళ్లి లోపల నుంచి తలుపు వేసుకుని నిప్పు పెట్టుకున్నాడు. ఇల్లంతా పొగతో నిండిపోవడంతో కుటుంబ సభ్యులు లోపలే ఇరుక్కుపోయారు. లోపల నుంచి తాళం వేసిన ఇనుప తలుపు కారణంగా వారు బయటకు రాలేకపోయారు. వారి అరుపులు విని స్థానికులు మెరాల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి పక్క గోడను పగలగొట్టి లోపలికి ప్రవేశించి కుటుంబ సభ్యులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

మాన‌సిక వైద్య చికిత్స‌..

కుటుంబ సభ్యులు ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ, స్టూడియోలోని ఖరీదైన కంప్యూటర్లు, కెమెరాలు, సౌండ్ సిస్టమ్‌లు, లైటింగ్ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అతను ఎంతో కష్టపడే యువకుడు. కానీ విజయం సాధించాలనే ఒత్తిడి అతన్ని మానసికంగా కుంగదీసిందని ప్రకాశ్ కుమార్ తెలిపారు. కాగా ప్ర‌జాప‌తి త‌మ‌కు ఉన్న ఒక్క ఆధారం ఆ భూమిని అమ్మేయ‌డం, ఇప్పుడు స్టూడియోను ధ్వంసం చేయ‌డంతో ప్రస్తుతం అత‌ని కుటుంబం తీవ్ర ఆర్థిక స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంది. దీంతో త‌మ‌కు స‌హాయం చేయాల‌ని వారు ప్ర‌భుత్వాన్ని, అధికారుల‌ను వేడుకుంటున్నారు. కాగా పోలీసులు అత‌ని కుటుంబ స‌భ్యుల‌ను ర‌క్షించే క్ర‌మంలో అత‌ను ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ త‌రువాత అత‌న్ని బంధువులు మాన‌సిక వైద్య చికిత్స నిమిత్తం రాంచీలోని హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు.

Advertisement
Advertisement