Ghaziabad Sisters Suicide : ఘజియాబాద్ అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు.. వెలుగులోకి సంచలన వాస్తవాలు
చేతన్ కుమార్ ఒక స్టాక్ బ్రోకర్. 2 కోట్ల అప్పు ఉంది. తన కూతుళ్ల దగ్గర్నుంచి ఫోన్లు లాక్కొని వాటిని అమ్మి కరెంట్ బిల్ కట్టాడు. కరోనా టైమ్ నుంచి కూతుళ్లను స్కూల్‌కి పంపించలేదు.
Ghaziabad Sisters Suicide : గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఘజియాబాద్ అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య గురించే చర్చ నడుస్తోంది. ముగ్గురు మైనర్ బాలికలు కొరియన్ ఆన్‌లైన్ గేమ్‌కి బానిన అవడంతో వాళ్ల దగ్గర ఉన్న ఫోన్లను తల్లిదండ్రులు లాగేసుకోవడంతో మనస్థాపం చెంది వాళ్లు నివాసం ఉంటున్న బిల్డింగ్‌లోని తొమ్మిదో అంతస్థు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 12 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయసు లోపు ఉన్న ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒక గేమ్‌కి బానిసలవ్వడం, పేరెంట్స్ గేమ్ ఆడనివ్వడం లేదని ఆత్మహత్య చేసుకోవడంతో ప్రస్తుతం జెన్‌జెడ్ పిల్లల ఆలోచన విధానం ఎలా ఉందో ఈ ఘటనే అద్దం పడుతోంది. అయితే.. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య విషయంలో వాళ్ల ఫ్యామిలీలో జరిగిన పలు ఇతర ఘటనలు కూడా కారణంగా మారాయని తెలుస్తోంది.
సొంత అక్కాచెల్లెళ్లు కాదు
ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు కూడా సొంత వాళ్లు కాదు. అందులో ఇద్దరు పాఖీ(12), ప్రాచీ(14) మాత్రమే సొంత అక్కాచెల్లెళ్లు, నిషిక(16) పాఖీ, ప్రాచీ పెద్దమ్మ కూతురు. వీళ్ల తండ్రి చేతన్ కుమార్‌కు ముగ్గురు భార్యలు. సుజాత, హీనా, టీనా. వీళ్లందరికీ ఐదుగురు పిల్లలు. అందులో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. సుజాత, హీనా ఇద్దరు సొంత అక్కాచెల్లెళ్లు. సుజాతకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. సుజాత కొడుక్కి మతిస్థిమితం సరిగ్గా ఉండదు. సుజాతకి పిల్లలు పుట్టరు అని డాక్టర్లు చెప్పడంతో సుజాత చెల్లి హీనాను కుమార్ పెళ్లి చేసుకున్నాడు. 2010లో సుజాతతో పెళ్లయింది. 2013లో టీనానె పెళ్లి చేసుకున్నాడు. హీనాను పెళ్లి చేసుకున్న విషయం సుజాతకు కుమార్ చెప్పలేదని తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లలో నిషిక.. సుజాత కూతురే. మిగిలిన ఇద్దరు పాఖీ, ప్రాచీ.. హీనా కూతుళ్లు. ఎవ్వరికీ విడాకులు ఇవ్వకుండానే ముగ్గురు మహిళలను కుమార్ పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సుజాత, హీనాకు తెలియకుండా టీనాను కూడా పెళ్లి చేసుకున్నాడని పోలీసులు స్పష్టం చేశారు.
కొరియన్ గేమ్స్‌కి బానిసలయినందుకే
తన ముగ్గురు కూతుళ్లు కొరియన్ గేమ్స్‌కి బానిసలయినందుకే తాను వాళ్ల దగ్గర్నుంచి ఫోన్ లాక్కున్నానని కుమార్ పోలీసులకు తెలిపాడు. వాళ్ల దగ్గర్నుంచి ఫోన్లు లాక్కున్నాక ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఓ డైరీలో 30 పేజీల లేఖ రాశారు. ఆ డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అదే బిల్డింగ్ నుంచి కింద పడి సుజాత సోదరి మృతి
2018లో అదే బిల్డింగ్ మీది నుంచి కింద పడి సుజాత, హీనా సోదరి మృతి చెందింది. వాళ్లను చూడటానికి వచ్చిన ఆమె.. ప్రమాదవశాత్తు బిల్డింగ్ మీది నుంచి కింద పడి మృతి చెందింది.
2 కోట్ల అప్పు
చేతన్ కుమార్ ఒక స్టాక్ బ్రోకర్. 2 కోట్ల అప్పు ఉంది. తన కూతుళ్ల దగ్గర్నుంచి ఫోన్లు లాక్కొని వాటిని అమ్మి కరెంట్ బిల్ కట్టాడు. కరోనా టైమ్ నుంచి కూతుళ్లను స్కూల్‌కి పంపించలేదు. భారీగా అప్పులు చేయడం వల్ల పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక వాళ్లను ఇంటి వద్దనే ఉంచడం వల్ల వాళ్లు మొబైల్ ఫోన్స్‌లో గేమ్స్‌కి అలవాటు పడి చివరకు తనువు చాలించుకునే వరకు వచ్చారని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్




