త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyber Crime | ఒకేసారి 200 ఎస్ఎంఎస్‌లు.. బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. అస‌లేం జ‌రిగింది..?

Cyber Crime | బెంగళూరులోని హెచ్ఆర్‌బీఆర్ లేఔట్‌కు చెందిన 56 ఏళ్ల వ్యాపారవేత్తకు ఇటీవల ఊహించని షాక్ ఎదురైంది. ఒక్కసారిగా అత‌ని ఫోన్‌కు 200కుపైగా ఎస్ఎంఎస్ అలర్టులు రావడంతో ఆశ్చర్యపోయాడు. ఆ సందేశాల‌నులు పరిశీలించగా తన రెండు బ్యాంక్ ఖాతాల నుంచి అనధికార లావాదేవీలు జరిగినట్టు తేలింది.

S

Crime | Published On Feb 11, 2026, 9.46 am IST

Cyber Crime | ఒకేసారి 200 ఎస్ఎంఎస్‌లు.. బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. అస‌లేం జ‌రిగింది..?
Advertisement

Cyber Crime | బెంగళూరులోని హెచ్ఆర్‌బీఆర్ లేఔట్‌కు చెందిన 56 ఏళ్ల వ్యాపారవేత్తకు ఇటీవల ఊహించని షాక్ ఎదురైంది. ఒక్కసారిగా అత‌ని ఫోన్‌కు 200కుపైగా ఎస్ఎంఎస్ అలర్టులు రావడంతో ఆశ్చర్యపోయాడు. ఆ సందేశాల‌నులు పరిశీలించగా తన రెండు బ్యాంక్ ఖాతాల నుంచి అనధికార లావాదేవీలు జరిగినట్టు తేలింది. వెంటనే బ్యాంకును సంప్రదించగా సైబర్ మోసగాళ్లు ఖాతాలను హ్యాక్ చేసి సుమారు రూ.10 లక్షలు దోచుకున్నట్లు అధికారులు ధ్రువీకరించారు.

కాగా బాధితుడు న‌గ‌రంలోని ఈస్ట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి 4 సాయంత్రం 5 గంటల నుంచి ఫిబ్రవరి 5 మధ్యాహ్నం 1 గంట మధ్య ఈ లావాదేవీలు జరిగాయని తెలిపాడు. ఫోన్‌కు వచ్చిన 200కుపైగా ఎస్ఎంఎస్‌లలో చాలా వరకు ఓటీపీలు, డెబిట్ అలర్టులు ఉన్నాయని చెప్పాడు. ఒక ఖాతా నుంచి రూ.26వేలు విత్ డ్రా అయ్యాయ‌ని, మరొక ఖాతా నుంచి పలు విడతల్లో రూ.9.60 లక్షలకుపైగా విత్ డ్రా చేశార‌ని తెలిపాడు.

అయితే దీనిపై పోలీసు అధికారులు స్పందించారు. ఆ వ్య‌క్తి ఫోన్‌లో ఏవైనా ఏపీకే (APK) ఫైల్స్‌ను క్లిక్ చేసి ఉంటాడ‌ని, అందుక‌నే ఫోన్ హ్యాక్‌కు గురై ఆ సమాచారం మొత్తం హ్యాక‌ర్ల చేతుల్లోకి వెళ్లి ఉంటుంద‌ని, దీంతో అత‌ని ఫోన్ కు వచ్చే మెసేజ్‌ల‌ను కూడా తెలుసుకుని హ్యాక‌ర్లు ఈ చోరీకి పాల్ప‌డి ఉంటార‌ని పోలీసులు అంచ‌నా వేస్తున్నారు. ఫోన్ హ్యాకింగ్‌కు గురైతే అది యూజ‌ర్ కంట్రోల్‌లో ఉండ‌ద‌ని, అందులో ఉండే స‌మాచారం అంతా ఎప్ప‌టిక‌ప్పుడు హ్యాక‌ర్ల‌కు చేరుతుంద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే బాధితుడి ఫోన్‌కు ఓటీపీల‌ను పంపించ‌డం ద్వారా వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుని అత‌ని బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్మును కాజేసి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోన్ వినియోగ‌దారులు ఎల్ల‌ప్పుడూ ఏపీకే ఫైల్స్‌ను క్లిక్ చేయ‌కూడ‌ద‌ని, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అప‌రిచిత వ్య‌క్తులు పంపించే లింకుల‌ను క్లిక్ చేయ‌వ‌ద్ద‌ని పోలీసులు ఈ సంద‌ర్భంగా సూచిస్తున్నారు.

Advertisement
Advertisement