Shocking Incident | షాకింగ్.. తల్లి ప్రైవేట్ ఫొటోలను ప్రియుడికి పంపిన కుమార్తె
Shocking Incident | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో షాకింగ్ ఘటన (Shocking Incident) వెలుగు చూసింది. ఓ కుమార్తె రహస్యంగా తన తల్లి ప్రైవేట్ ఫొటోలు తీసి ప్రియుడికి పంపింది ( Daughter Shared Mother Private Photos With Boy Friend).
Shocking Incident | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో షాకింగ్ ఘటన (Shocking Incident) వెలుగు చూసింది. ఓ యువతి తన తల్లి, పిన్ని ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు తీసి ప్రియుడికి పంపింది (Daughter Shared Mother Private Photos With Boy Friend). కూతురి ఫోన్‌లో తన ప్రైవేట్ వీడియోలు చూసిన తల్లి ఒక్కసారిగా షాక్ అయ్యింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బెంగళూరులోని బ్యాటరాయనపురలో నివసించే ఒక యువతి తాను చదువుకునేందుకు ఫోన్ కావాలని తల్లిదండ్రులను కోరింది. చదువు పేరు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తమ బిడ్డకు మొబైల్ ఫోన్ తీసిచ్చారు. దీంతో యువతి సోషల్ మీడియాని వాడటం ప్రారంభించింది. ఈ క్రమంలో ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కొన్ని రోజులు చాటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఫోన్‌లు మాట్లాడుకోవడం ప్రారంభించారు. కొంతకాలానికి వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. యువకుడు ఏం చెబితే అది ఆ యువతి చేసేది. అలా తన తల్లి, పిన్ని ప్రైవేట్ వీడియోలు తీసి అతడికి పంపింది.
అనుమానం వచ్చి ఫోన్ చూడగా..
తల్లి నిద్రిస్తున్న సమయంలో ఆమెకు తెలియకుండా కొన్ని ఫొటోలు తీసింది. ఇక పిన్ని స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు తీసి వాటిని ఆ యువకుడికి పంపింది. ఓ రోజు గదిలోకి వెళ్లిన తల్లి.. తన కూతురు ఎవరితోనో రహస్యంగా ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని గమనించింది. అనుమానం వచ్చి ఫోన్ తీసుకుని చూడగా.. షాకింగ్ విషయం బయటపడింది. ఆ ఫోన్‌లో తన ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు ఉండటాన్ని చూసి షాక్ అయ్యింది. వెంటనే ఈ విషయాన్ని భర్త దృష్టికి తీసుకెళ్లింది. ఇదేంటని ప్రశ్నించగా.. ఆ యువకుడి ఒత్తిడి వల్లే పంపానంటూ తలతిక్క సమాధానం చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు తమ కుమార్తెను మందలించి ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలు డిలీట్ చేశారు.
అయితే, అవి అప్పటికే ఆ యువకుడికి పంపించిన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతితో పాటు ఆమె ప్రియుడి ఫోన్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. కాగా, తల్లి ఫిర్యాదు చేసిన కొన్ని రోజులకే ఆ యువతి ఇంటి నుండి పారిపోయి సదరు యువకుడిని వివాహం చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. యువతి చేసిన పనికి నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aishwarya Lekshmi | మలయాళ బ్యూటీ ఐశ్యర్య లక్ష్మిపై ట్రోల్స్.. ఏం జరిగిందంటే..?
మే 9, 2026

IPL 2026 Playoffs Schedule | ఐపీఎల్ ప్లే ఆఫ్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. అహ్మదాబాద్‌లో 31న ఫైనల్..!
మే 6, 2026

Bengaluru Rain | బెంగళూరులో భారీ వర్షం.. వాన నీటిలో ఆడిన ఆర్సీబీ ప్లేయర్.. వీడియో
ఏప్రిల్ 30, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



