Khushi Mukherjee | సూర్యకుమార్ యాదవ్‌పై వ్యాఖ్యలు.. చిక్కుల్లో పడ్డ నటి ఖుషీ ముఖర్జీ..!
Khushi Mukherjee | నటి ఖుషీ ముఖర్జీ చిక్కుల్లో పడింది. ఇటీవల టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబయికి చెందిన ఓ అభిమాని నటిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశాడు.
Khushi Mukherjee | నటి ఖుషీ ముఖర్జీ చిక్కుల్లో పడింది. ఇటీవల టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబయికి చెందిన ఓ అభిమాని నటిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశాడు. అలాగే, రూ.100కోట్లకు పరువు నష్టం కింద దావా వేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫైజాన్ అన్సారీ అనే వ్యక్తి ఘాజీపూర్ పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇరాజ్ రాజాకు లేఖ రాశారు. ఖుషీ ముఖర్జీని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సూర్యకుమార్‌పై నటి చేసిన ఆరోపణలు అసబద్ధం, నిరాధారమైనవని లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 10న ఆయన పోలీసులకు లేఖ పంపారు. అయితే, పోలీస్ సూపరింటెడెంట్ మాత్రం తనకు అలాంటి లేఖ ఏదీ అందలేదని, నటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు.
వైరల్ అవుతున్న లేఖలో ఖుషీ ముఖర్జీ పేరు కోసం తప్పుడు ప్రచారం చేస్తుందని, గొప్ప భారతీయ క్రికెట్ పేరును దిగజార్చడం సిగ్గుచేటని విమర్శించారు. సూర్యకుమార్ పేరు, ప్రతిష్టను దెబ్బతీసినందుకు రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నాను అంటూ లేఖలో పేరొ్కన్నారు. వెంటనే ఖుషీ ముఖర్జీని అరెస్టు చేసి ఆమెకు కనీసం ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని ఘాజీపూర్ ఎస్పీని కోరుతున్నట్లు పేర్కొన్నాడు. ఈ వార్తలను ఎస్పీ ఖండించారు. తమకు లేఖ ఏదీ రాలేదని, ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేదని ఎస్పీ ఇరాజ్ రాజా తెలిపారు. ఇదిలా ఉండగా.. ఖుర్జీ ముఖర్జీ ఇటీవల తాను ఏ క్రికెటర్‌తో డేటింగ్ చేయాలనుకోవడం లేదని, తన వెనకలా చాలా మంది క్రికెటర్లు వెంటపడ్డారని.. సూర్యకుమార్ తనకు చాలా మెస్సేజ్‌లు పెట్టాడవని పేర్కొంది. కానీ, ఇప్పుడు పెద్దగా మాట్లాడాలనుకోవడం లేదని.. ఎలాంటి సంబంధం కోరుకోవడం లేదని తెలిపింది. త పేరుతో పేరుతో ముడిపడి ఏవైనా లీక్‌లు రావడం నాకు ఇష్టం లేదంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో పలువురు విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






