త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arjun Tendulkar wedding | ఘ‌నంగా అర్జున్ టెండూల్క‌ర్ వివాహం.. హాజ‌రైన సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు

Arjun Tendulkar wedding | క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) వివాహం ఇవాళ ముంబైలో ఘ‌నంగా జ‌రిగింది.

D

Cricket | Published On Mar 5, 2026, 3.22 pm IST

Arjun Tendulkar wedding | ఘ‌నంగా అర్జున్ టెండూల్క‌ర్ వివాహం.. హాజ‌రైన సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు
Advertisement

Arjun Tendulkar wedding | క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) వివాహం ఇవాళ ముంబైలో ఘ‌నంగా జ‌రిగింది. త‌న ప్రియురాలు సానియా చంధోక్‌ (Saaniya Chandhok)ను అర్జున్ మ‌నువాడారు. ముంబైలోని ఓ హోట‌ల్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి సినీ, క్రీడా, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.

https://x.com/MdDanis53596508/status/2029491357681922194

ఈ వేడుక‌ల‌కు అజిత్ అగార్క‌ర్‌, జైషా, ఎంఎస్ ధోనీ, సాక్షి ధోనీ, రాహుల్ ద్ర‌విడ్‌, అనిల్ కుంబ్లే, యువ‌రాజ్ సింగ్‌స‌హా ప‌లువురు క్రికెట‌ర్లు హాజ‌ర‌య్యారు. ఇక సినీ ఇండ‌స్ట్రీ నుంచి అభిషేక్ వ‌చ్చ‌న్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్య రాయ్ బ‌చ్చ‌న్‌, జ‌యా బ‌చ్చ‌న్‌, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ, ఆమిర్ ఖాన్‌, షారుఖ్ ఖాన్‌, ఏపీ మంత్రి నారాలోకేశ్‌, బ్రాహ్మ‌ణి, ప‌లువురు రాజ‌కీయ, సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.

https://x.com/drona_17/status/2029472458752049382

ముంబైకి చెందిన వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలైన సానియా చంధోక్‌ (Saaniya Chandhok)తో అర్జున్‌ ఎంగేజ్మెంట్ గ‌తేడాది ఆగ‌స్టులో జరిగిన విషయం తెలిసిందే. సానియా.. సచిన్ తనయ సారాకు మంచి స్నేహితురాలు కూడా. 2020లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి గ్రాడ్యేయేషన్ పూర్తి చేసిన సానియా సొంతంగా వ్యాపారం ప్రారంభించింది. జంతు ప్రేమికురాలైన తను ముంబైలోనే మిస్టర్ పాస్ పెట్ స్పా, స్టోర్ పేరుతో ఒక బొటిక్ తెరిచింది. సారా ద్వారా అర్జున్‌కు పరిచయం అయిన సానియా అతడిపై మనసు పారేసుకుంది. ఈ పేస్ గన్ సైతం ఆమెను ఇష్టపడ్డాడు. ఇలా కుటుంబ స‌భ్యుల అంగీకారంతో ఇవాళ ఒక్క‌ట‌య్యారు.

https://x.com/deepu_drops/status/2029455805465206889

https://x.com/ANI/status/2029465373230428614

https://x.com/ANI/status/2029468342306902491

https://x.com/Nitika3012/status/2029491720111685933

Also Read..

గ‌ల్ఫ్‌లో అమెరికా ట్యాంక‌ర్‌పై ఇరాన్ దాడి

రాజ్య‌స‌భకు నామినేష‌న్ దాఖ‌లు చేసిన వేం న‌రేంద‌ర్ రెడ్డి, అభిషేక్ మ‌ను సింఘ్వీ

గ్యాస్ సరఫరాపై యుద్ధ ప్రభావం.. భార‌త్‌లో 30 రోజుల‌కు స‌రిప‌డా మాత్ర‌మే ఎల్పీజీ నిల్వ‌లు..!

Advertisement

తాజావార్తలు

Advertisement