త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | పాక్ ఓట‌మి.. ఆనందంతో డ్యాన్సులు చేసిన‌ బలోచిస్తాన్ యువ‌త‌..

T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2026) భార‌త్ చేతిలో పాకిస్తాన్ (India-Pakistan) ఘోరంగా ఓడిపోయిన విష‌యం తెలిసిందే. పాక్ ఓడిపోవ‌డంతో బ‌లోచిస్తాన్ (Balochistan) యువ‌త సంబ‌రాలు చేసుకుంది.

D

Cricket | Published On Feb 16, 2026, 1.35 pm IST

T20 World Cup 2026 | పాక్ ఓట‌మి.. ఆనందంతో డ్యాన్సులు చేసిన‌ బలోచిస్తాన్ యువ‌త‌..
Advertisement

T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2026) దాయాది పాకిస్తాన్‌తో జరిగిన హైవోల్టేజ్‌ మ్యాచ్‌లో భారత్‌ (India-Pakistan) జయకేతనం ఎగుర వేసింది. దాయాది దేశాన్ని భారత్‌ 61 పరుగుల తేడాతో చిత్తుచేసింది. దీంతో టీమ్ ఇండియాపై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ గెలుపుపై అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. దేశ‌వ్యాప్తంగా సంబ‌రాలు హెరెత్తాయి. యువ‌త‌ నృత్యాలు చేస్తూ, స్వీట్లు పంచుకుంటూ సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు.

ఇక భారత్ గెలుపును మన దేశంతో పాటు ఆప్ఘనిస్థాన్ ప్ర‌జ‌లు కూడా సెల‌బ్రేట్ చేసుకున్నారు. వీధుల్లోకి వ‌చ్చి టీమ్ ఇండియా అంటూ నినాదాలు చేశారు. అలాగే తమకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తున్న పాక్ ఆధీనంలోని బ‌లోచిస్తాన్‌ (Balochistan)లోనూ యువ‌త వేడుక‌లు చేసుకుంది. పాక్ ఓడిపోయింద‌న్న ఆనందంతో రోడ్ల‌పై డ్యాన్సులు చేస్తూ సంద‌డి చేశారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. మ‌రోవైపు ఈ ఓటమిని పాక్ అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. పాకిస్థాన్ ఓట‌మిని త‌ట్టుకోలేక ఓ అభిమాని ఏకంగా టీవీనే ప‌గ‌ల‌గొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

కొలంబో వేదిక‌గా భార‌త్‌-పాక్ మ‌ధ్య ఆదివారం మ్యాచ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 176 ప‌రుగుల ల‌క్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను భారత్ కేవలం 114 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లు సమిష్టిగా అద్భుత ప్రదర్శన చేయడంతో భారత్‌కు 61 పరుగుల భారీ విజయం దక్కింది. ఈ గెలుపుతో ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లలో భారత్-పాకిస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డు 8-1కి చేరింది. ప్రత్యర్థిపై భారత్ ఆధిపత్యం మరింత బలపడింది.

https://x.com/NewsAlgebraIND/status/2023128438971023731

Advertisement

తాజావార్తలు

Advertisement