IPL 2026 | ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఫ్రాంచైజీలకు గాయాల బెడద..! ప్రారంభ మ్యాచులకు హేజిల్‌వుడ్ దూరం..!
IPL 2026 | ఐపీఎల్ మార్చి 28న మొదలుకానున్నది. టోర్నీ ప్రారంభానికి ముందు పలు జట్ల ఆటగాళ్లకు గాయాల సమస్య వేధిస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ తొలి మ్యాచ్‌లకు కీలక ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ లేకుండానే బరిలోకి దిగాల్సి రానున్నది.
IPL 2026 | ఐపీఎల్ మార్చి 28న మొదలుకానున్నది. టోర్నీ ప్రారంభానికి ముందు పలు జట్ల ఆటగాళ్లకు గాయాల సమస్య వేధిస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ తొలి మ్యాచ్‌లకు కీలక ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ లేకుండానే బరిలోకి దిగాల్సి రానున్నది. గతంలో హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడిన హేజిల్‌వుడ్.. దాంతో యాషెస్ సిరీస్‌తో పాటు టీ20 వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ హీల్ సమస్య వచ్చింది. ఐపీఎల్ 2026లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాయి.
ఇదే సమయంలో మరో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ కూడా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అయిన కమిన్స్, జూలైలో వచ్చిన స్వల్ప వెన్నునొప్పి గాయం నుంచి కోలుకునేందుకు రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. యాషెస్ సిరీస్‌లో కూడా కేవలం ఒక టెస్ట్ మ్యాచ్‌కే పరిమితమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ జట్టులో కూడా కమిన్స్, హేజిల్‌వుడ్ ఇద్దరికీ చోటు దక్కలేదు.
ఈ ఇద్దరి ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై గత కొన్ని నెలలుగా క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం నిశితంగా పర్యవేక్షిస్తోంది. దీంతో ఐపీఎల్‌లో వీరి అందుబాటు విషయంలో అనిశ్చితి నెలకొంది. అయినప్పటికీ, సీజన్‌లో ఎక్కువ భాగానికి వీరు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐపీఎల్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ వారాంతంలో భారత్‌కు రానున్నారు. కొందరు శనివారం బయలుదేరే అవకాశముంది. ఆగస్టు నుంచి ఆస్ట్రేలియా జట్టుకు బిజీ షెడ్యూల్ ఉండడంతో కమిన్స్, హేజిల్‌వుడ్ పూర్తి ఫిట్‌గా ఉండడం కీలకంగా మారింది. ఈ కాలంలో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా, భారత్, ఇంగ్లండ్‌లో పర్యటించనున్నది. ఈ పర్యటనలో టెస్టులు ఆడనుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






