Heinrich Klaasen | క్లాసెన్‌కు చెమటలు పట్టించిన హైదరాబాద్ బిర్యానీ.. వీడియో వైరల్..!
Heinrich Klaasen | హైదరాబాద్ అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది బిర్యానీ. ఇక్కడి బిర్యానిని రుచి చూసేందుకు భోజన ప్రియులు తహతహలాడుతుంటారు. ఐపీఎల్‌లోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు హైదరాబాదీ బిర్యానీని ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
Heinrich Klaasen | హైదరాబాద్ అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది బిర్యానీ. ఇక్కడి బిర్యానిని రుచి చూసేందుకు భోజన ప్రియులు తహతహలాడుతుంటారు. ఐపీఎల్‌లోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు హైదరాబాదీ బిర్యానీని ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెస్ బిర్యానీని తినగా ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఇషాన్ కిషన్ మాత్రం స్పైసీ బిర్యానీని ఎంజాయ్ చేస్తూ సులభంగా తింటుండగా.. క్లాసెన్ మాత్రం బిర్యాన ఘాటును తట్టుకోలేక ఇబ్బందిపడ్డాడు. చెమటలు పట్టడంతో తరచూ రుమాల్‌తో తుడుచుకుంటూ కనిపించగా, ఆ పరిస్థితిని చూసి ఇషాన్ నవ్వుకుంటూ సరదాగా స్పందించాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఎస్ఆర్‌హెచ్ తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసింది. ఇందులో క్లాసెన్ హైదరాబాదీ బిర్యానీని ఆస్వాదిస్తూ కనిపించాడు. రెండు ముద్దలు తినగా.. క్లాసెన్ ముఖమంతా ఎరుపురంగులోకి మారిపోయింది. కళ్లలో నుంచి సైతం నీళ్లు రావడం స్పష్టంగా కనిపించింది. అయితే, బిర్యానీలోని మసలాల ఘాటుకు క్లాసెన్ ఇబ్బందిపడ్డాడు. ఇదిలా ఉండగా.. అర్జున్ టెండూల్కర్ హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఇష్టమైన వంటకమని తెలిపాడు. ఇది ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ అని పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో అర్జున్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. మైదానంలో క్లాసెన్ బ్యాట్‌తో అద్భుతంగా రాణిస్తున్నాడు. బిర్యానీ అతనికి చెమటలు పట్టించినా.. తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో 145 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. జట్టులో అతడే అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో మొత్తం రన్స్ పరంగా కూడా అతడు రెండో స్థానంలో ఉన్నాడు. సమర్ రజ్వి 160 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన విషయానికి వస్తే, ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో ఒకదాంట్లో విజయం సాధించి, రెండింట్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
Heinrich Klaasen and Ishan Kishan having Hyderabad Biriyani. 🧡
Too Spicy for Klaasen! 😂
📸 ~ nitiskumarredy (instagram) pic.twitter.com/9QJkoAXRTs
— ORANGE ARMY (@SUNRISERSU) April 6, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






