త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Naman Awards | ఘ‌నంగా బీసీసీఐ న‌మ‌న్ అవార్డుల ప్ర‌దానం.. బిన్నీ, ద్ర‌విడ్‌, మిథాలీ రాజ్‌కు సీకే నాయుడు అవార్డు..!

Naman Awards | భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకమైన నమన్ అవార్డ్స్–2026 కార్యక్రమం ఆదివారం న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌లో విశేష ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఘ‌నంగా స‌త్క‌రించింది.

P

Cricket | Published On Mar 15, 2026, 9.07 pm IST

Naman Awards | ఘ‌నంగా బీసీసీఐ న‌మ‌న్ అవార్డుల ప్ర‌దానం.. బిన్నీ, ద్ర‌విడ్‌, మిథాలీ రాజ్‌కు సీకే నాయుడు అవార్డు..!
Advertisement

Naman Awards | భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకమైన నమన్ అవార్డ్స్–2026 కార్యక్రమం ఆదివారం న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌లో విశేష ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఘ‌నంగా స‌త్క‌రించింది. ఈ ఏడాది కార్యక్రమంలో భారత క్రికెట్‌కు చేసిన విశేష సేవలను గుర్తిస్తూ రొజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్, మిథాలీ రాజ్‌లకు బీసీసీఐ అత్యున్నత పురస్కారం అయిన ‘కర్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ను ప్రదానం చేశారు. 2024–25 సీజన్‌కు గాను ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డును భారత జట్టు ప్రస్తుత టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ అందుకున్నాడు.

మహిళల క్రికెట్ విభాగంలో స్మృతి మంధాన‌ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎంపికై తన కెరీర్‌లో ఐదోసారి ఈ గౌరవాన్ని అందుకుంది. అంతర్జాతీయ పురుషుల క్రికెట్‌లో ఉత్తమ డెబ్యూ అవార్డును హర్షిత్ రాణా గెలుచుకోగా, మహిళల విభాగంలో అదే అవార్డు శ్రీ చరణికి ద‌క్కింది. మహిళల జట్టుకు చెందిన దీప్తి శర్మ 2024–25 సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టినందుకు ప్రత్యేక అవార్డు అందుకున్నారు. దేశీయ లిమిటెడ్ ఓవర్స్ పోటీల్లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఆయుష్ మహాత్రే ‘లాలా అమర్‌నాథ్ అవార్డు’ను సొంతం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఏడాదిలో ఐదు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న జ‌ట్ల‌ను బీసీసీఐ స‌త్క‌రించింది.

అవార్డులు అందుకున్న వారి జాబితా..

Advertisement

తాజావార్తలు

Advertisement