Insurance Commissions | బీమా కమీషన్లు తగ్గితే లాభం ఎవరికి? కస్టమర్లకా.. కంపెనీలకా?
Insurance Commissions | బీమా పంపిణీదారులకు చెల్లించే కమీషన్లలో ప్రతిపాదిత మార్పులు ఇప్పుడు మరో కీలక ప్రశ్నను తెరపైకి తెచ్చాయి. కమీషన్లు తగ్గితే చివరకు ఆ ప్రయోజనం ఎవరికి దక్కుతుంది? కస్టమర్లకా, బీమా కంపెనీలకా, లేక మొత్తం పంపిణీ వ్యవస్థకా అనే చర్చ మొదలైంది. అయితే ఈ మార్పులు ప్రస్తుతం సంప్రదింపుల దశలోనే ఉన్నాయి.
Insurance Commissions | బీమా పంపిణీదారులకు చెల్లించే కమీషన్లలో ప్రతిపాదిత మార్పులు ఇప్పుడు మరో కీలక ప్రశ్నను తెరపైకి తెచ్చాయి. కమీషన్లు తగ్గితే చివరకు ఆ ప్రయోజనం ఎవరికి దక్కుతుంది? కస్టమర్లకా, బీమా కంపెనీలకా, లేక మొత్తం పంపిణీ వ్యవస్థకా అనే చర్చ మొదలైంది. అయితే ఈ మార్పులు ప్రస్తుతం సంప్రదింపుల దశలోనే ఉన్నాయి. ప్రతిపాదనలపై చర్చించిన నిపుణులు.. ప్రస్తుతం బీమా పంపిణీ కోసం వెచ్చిస్తున్న మొత్తానికి, పాలసీదారులకు లభిస్తున్న పాలసీ అనుకూలత, సేవలు, క్లెయిమ్ సహాయం మధ్య వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. ఆర్థిక విద్యావేత్త, రచయిత మోనికా హాలన్ మాట్లాడుతూ.. అసలు దృష్టి పంపిణీదారులు తాము విక్రయించే ఉత్పత్తులకు ఎంత బాధ్యత తీసుకుంటున్నారనే అంశంపై ఉండాలని అన్నారు. పంపిణీదారు, ఏజెంట్ లేదా బ్యాంకు ఒక బీమా ఉత్పత్తిని విక్రయించే గొలుసులో అత్యంత కీలకమైన భాగంగా ఉన్నప్పుడు.. ఆ ఉత్పత్తి కస్టమర్‌కు అనుకూలమా కాదా అనేది నిర్ధారించడం, సేవలు అందించడం, క్లెయిమ్ సమయంలో సహాయం చేయడం వంటి బాధ్యతలను కూడా తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
కమీషన్‌కు, ప్రయోజనాలకు భారీ వ్యత్యాసం..
ఈ విధానం అమల్లోకి వస్తే బీమా అనేది ప్రస్తుతం ఉన్నట్టుగా కస్టమర్లపై రుద్దే ఉత్పత్తిగా కాకుండా.. తమ అవసరాలకు అనుగుణంగా వినియోగదారులే ఎంపిక చేసుకునే ఉత్పత్తిగా మారే అవకాశం ఉంటుందని హాలన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పంపిణీదారులకు చెల్లిస్తున్న కమీషన్‌కు, కస్టమర్‌కు అందుతున్న ప్రయోజనాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఆమె పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమను ఇందుకు ఉదాహరణగా హాలన్ ప్రస్తావించారు. ముందస్తు కమీషన్లను తొలగించి, ట్రయిల్ ఆధారిత పరిహార విధానానికి మారిన తర్వాత కూడా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ వృద్ధి కొనసాగిందని ఆమె అన్నారు. కమీషన్ నిర్మాణంలో మార్పులు వచ్చినంత మాత్రాన పరిశ్రమ వృద్ధి దెబ్బతినాల్సిన అవసరం లేదని, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంపై బీమా రంగం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పాలసీలను నిలిపివేస్తే నష్టం..
ఫిన్‌గ్రోత్ మీడియా వ్యవస్థాపకుడు, మిస్‌సోల్డ్ డైరెక్టర్ సీఏ కనన్ బహల్ కూడా కమీషన్ విధానం పంపిణీదారులకు కల్పించే ప్రోత్సాహకాలతో నేరుగా సంబంధం ఉందని అన్నారు. బీమా పాలసీల కొనసాగింపు అంశాన్ని ప్రస్తావిస్తూ.. టాప్-10 జీవిత బీమా సంస్థల సగటు 61 నెలల పాలసీ కొనసాగింపు నిష్పత్తి సుమారు 50 శాతంగా ఉందని బహల్ తెలిపారు. కస్టమర్లు పాలసీలను ప్రారంభ సంవత్సరాల్లోనే మధ్యలో నిలిపివేస్తే నష్టపోయే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. ముఖ్యంగా పాలసీ ప్రారంభ సంవత్సరాల్లో సరెండర్ విలువలు గణనీయంగా తక్కువగా ఉండే సందర్భాల్లో ఈ నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని అన్నారు. అధిక కమీషన్లు ఉండడం వల్ల కస్టమర్ ప్రయోజనాలను పరిశీలించడం కంటే ఎక్కువ పాలసీలు విక్రయించడానికే పంపిణీదారుల ప్రోత్సాహకం ఉండేదని బహల్ వ్యాఖ్యానించారు.
సంస్థలపై ప్రభావం ఉంటుందా..
అయితే కమీషన్లు తగ్గితే బీమా ఏజెంట్లు, ఇప్పటికే ఉన్న కమీషన్ విధానంపై ఆధారపడి వ్యాపారాలను నిర్మించుకున్న సంస్థలపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నది మరో కీలక ప్రశ్నగా ఉంది. అందువల్ల చర్చ కేవలం కమీషన్లు తగ్గుతాయా లేదా అన్నదానికే పరిమితం కాకుండా.. కమీషన్లలో తగ్గింపు ద్వారా ఏర్పడే ఆదా చివరకు ఎటు వెళ్తుంది అన్నదానిపై కూడా ఉండాల్సి ఉంది. పంపిణీదారుల బాధ్యత పెరిగి, కమీషన్లలో ఏర్పడే ఆదా కస్టమర్లకు మెరుగైన పాలసీ ప్రయోజనాలు, సేవలు, క్లెయిమ్ సహాయంగా మారితే మొత్తం బీమా మార్కెట్‌కే ప్రయోజనం కలుగుతుందని మోనికా హాలన్ అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
- ●Supreme Court | సుప్రీంకోర్టులో హిందీని అధికారిక భాషగా చేయండి
- ●Tata Aeris | టాటా కొత్త సెడాన్ ఏరిస్.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు..
- ●Chamala | జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే సీఈసీ పదవి నుంచి తొలగించాలి
- ●Kohinoor Gated Community | కోహినూర్ గేటెడ్ కమ్యూనిటీలో రికార్డు ధర పలికిన వినాయక లడ్డూ.. ఎంతంటే..
- ●kaaka | జోరు మీదున్న కాకా - డబ్బింగ్ పనులు మొదలు - ఐదు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్
- ●TG Weather | తెలంగాణలో రెండురోజులు భారీ వర్షాలు.. హెచ్చరించిన ఐఎండీ

Supreme Court | సుప్రీంకోర్టులో హిందీని అధికారిక భాషగా చేయండి

Tata Aeris | టాటా కొత్త సెడాన్ ఏరిస్.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు..

Chamala | జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే సీఈసీ పదవి నుంచి తొలగించాలి

Kohinoor Gated Community | కోహినూర్ గేటెడ్ కమ్యూనిటీలో రికార్డు ధర పలికిన వినాయక లడ్డూ.. ఎంతంటే..





