PB Fintech | పాలసీబజార్ షేర్లలో మళ్లీ ఊగిసలాట.. బ్రోకరేజీల రేటింగ్ ఎటువైపు..?
PB Fintech | పీబీ ఫిన్‌టెక్ లిమిటెడ్ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. గురువారం ఏకంగా 34 శాతం భారీ పతనం నమోదైన తర్వాత శుక్రవారం ఉదయం షేర్లు కొంత కోలుకున్నప్పటికీ, ఆ తర్వాత మళ్లీ ఒత్తిడికి గురయ్యాయి.
PB Fintech | పీబీ ఫిన్‌టెక్ లిమిటెడ్ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. గురువారం ఏకంగా 34 శాతం భారీ పతనం నమోదైన తర్వాత శుక్రవారం ఉదయం షేర్లు కొంత కోలుకున్నప్పటికీ, ఆ తర్వాత మళ్లీ ఒత్తిడికి గురయ్యాయి. బీమా పంపిణీ నిబంధనల్లో సమూల మార్పులను ప్రతిపాదిస్తూ భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) గురువారం ప్రతిపాదనలు వెల్లడించిన నేపథ్యంలో పీబీ ఫిన్‌టెక్‌పై పెట్టుబడిదారుల్లో ఆందోళనలు పెరిగాయి. శుక్రవారం ఉదయం పీబీ ఫిన్‌టెక్ షేరు 3.91 శాతం లాభంతో రూ.1,160 వద్ద ప్రారంభమైంది. అయితే ప్రారంభ లాభాలను నిలబెట్టుకోలేక షేరు తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఉదయం 9.38 గంటల సమయానికి దాదాపు 2 శాతం నష్టంతో ట్రేడైంది.
వ్యాపారంపై ప్రభావం..
ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించిన కొత్త నిబంధనల్లో కంపెనీల నిర్వహణ వ్యయాలపై ఐదేళ్ల దశలవారీ పరిమితిని విధించే ప్రతిపాదన ఉంది. అలాగే తప్పనిసరి వ్యయ ఆడిట్, వ్యయాలపై ప్రజలకు సమాచారం వెల్లడించడం వంటి నిబంధనలను కూడా ప్రతిపాదించింది. అలాగే బీమా పంపిణీదారులకు చెల్లించే కమీషన్లు, ప్రోత్సాహకాలకు స్పష్టమైన పరిమితులు విధించాలని సూచించింది. పంపిణీదారులకు చేసే అన్ని రకాల చెల్లింపులను ఈ ప్రతిపాదిత నిబంధనల పరిధిలోకి తీసుకురావాలని ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదిత మార్పులు పాలసీబజార్ వంటి బీమా పంపిణీ సంస్థల వ్యాపార విధానంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నదానిపై మార్కెట్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ విభాగంలో పాలసీబజార్ వ్యాపార ఆర్థిక పరిస్థితులపై ఈ నిబంధనలు ప్రభావం చూపిస్తాయన్న అంచనాలు వెలువడుతున్నాయి.
అమ్మాలా, హోల్డ్ చేయాలా..
ఐఆర్‌డీఏఐ ప్రతిపాదిత బీమా పంపిణీ సంస్కరణల నేపథ్యంలో పలు బ్రోకరేజీ సంస్థలు పీబీ ఫిన్‌టెక్ షేరుపై తమ టార్గెట్ ధరలను గణనీయంగా తగ్గించాయి. హెచ్‌ఎస్‌బీసీ అత్యధికంగా 45 శాతం మేర టార్గెట్ ధరను తగ్గించింది. గతంలో రూ.2,100గా ఉన్న టార్గెట్ ధరను రూ.1,150కి తగ్గిస్తూ, షేరుపై తన రేటింగ్‌ను బై నుంచి హోల్డ్ కు మార్చింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా న్యూట్రల్ రేటింగ్‌ను కొనసాగిస్తూ టార్గెట్ ధరను 28.4 శాతం తగ్గించింది. గతంలో రూ.1,970గా ఉన్న టార్గెట్ ధరను రూ.1,410కి సవరించింది. మరోవైపు జెఫరీస్ బై రేటింగ్‌ను కొనసాగించినప్పటికీ, టార్గెట్ ధరను 24.9 శాతం తగ్గించింది. రూ.2,050గా ఉన్న టార్గెట్ ధరను రూ.1,540కి సవరించింది. ప్రతిపాదిత నిబంధనలు అమల్లోకి వస్తే పీబీ ఫిన్‌టెక్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషణలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా కమీషన్‌లపై పరిమితులు విధించడం వల్ల బీమా పంపిణీ ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభావం పడడంతో పాటు కంపెనీ ఆదాయ వృద్ధి, మార్జిన్లపై ఒత్తిడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. తుది నియంత్రణ విధానం, దాని అమలు తీరును బట్టి కీలక బీమా విభాగాల్లో కంపెనీ పొందే ఆదాయ వాటా కూడా తగ్గే అవకాశం ఉందని బ్రోకరేజీలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
- ●Muslim Marriages | ముస్లిం వివాహాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. కొత్త చట్టానికి అస్సాం కేబినెట్ ఆమోదం
- ●Transgender | పెండ్లి చేసుకున్న వ్యక్తి వదిలి వెళ్లాడని.. ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య!
- ●Blue Cloud Softech Solutions | ఒక్క రోజులోనే 17 శాతం పెరిగిన పెన్నీ స్టాక్.. ఐబీఎం ఆర్డర్‌తో భారీ లాభాల దిశగా..
- ●Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో భారీగా పెరిగిపోయిన చెత్తాచెదారం.. 5 నెలల్లోనే 50 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు
- ●YouTube | యూట్యూబ్‌లో భారీ మార్పులు.. ఏఐతో వీడియో ఎడిటింగ్, లైవ్ డబ్బింగ్..
- ●Balapur Laddu | రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ.. రూ.39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి

Muslim Marriages | ముస్లిం వివాహాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. కొత్త చట్టానికి అస్సాం కేబినెట్ ఆమోదం

Transgender | పెండ్లి చేసుకున్న వ్యక్తి వదిలి వెళ్లాడని.. ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య!

Blue Cloud Softech Solutions | ఒక్క రోజులోనే 17 శాతం పెరిగిన పెన్నీ స్టాక్.. ఐబీఎం ఆర్డర్‌తో భారీ లాభాల దిశగా..

Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో భారీగా పెరిగిపోయిన చెత్తాచెదారం.. 5 నెలల్లోనే 50 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు






