Union Budget 2026 | పొగ రాయుళ్లకు షాక్..! మోత మోగనున్న ఈ వస్తువుల ధరలు..!
Union Budget 2026 | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ తర్వాత పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి.
Union Budget 2026 | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ తర్వాత పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి.
- బడ్జెట్ తర్వాత లగ్జరీ వస్తువుల ధరల పెరగనున్నాయి. గడియారాలు, దిగుమతి చేసుకున్న ఆల్కహాల్ వంటి కొన్ని విలాసవంతమైన వస్తువులు మరింత ప్రియం కానున్నాయి.
- ప్రత్యేకంగా తయారుచేసిన కాఫీ సంబంధిత వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. కాఫీ రోస్టింగ్, బ్రూయింగ్, వెండింగ్ మెషీన్లపై ప్రభుత్వం మినహాయింపులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో వాటి ధరలు పెరిగే అవకాశాలున్నాయి.
- ఎరువుల తయారీలో ఉపయోగించే అమ్మోనియం ఫాస్ఫేట్, అమ్మోనియం నైట్రో-ఫాస్ఫేట్ దిగుమతిపై మినహాయింపులను ప్రభుత్వం తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో పలు ఎరువుల ధరీలు పెరిగే అవకాశం ఉంది.
- ఫ్యూచర్స్, ఆప్షన్స్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT)ని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇది డెరివేటివ్స్ ట్రేడింగ్ ఖరీదుగా మారనున్నది. ఫ్యూచర్స్‌పై ఎస్ఎస్‌టీని 0.02 శాతం నుంచి 0.05 శాతానికి, ఆప్షన్స్‌పై ఎస్‌టీటీని 0.1 శాతం నుంచి 0.15 శాతానికి పెంచినట్లు విత్తమంత్రి ప్రకటించారు.
- ఆదాయపు పన్ను వివరాలను సరిగా చూపించకపోతే జరిమానా విధించనున్నారు. పన్ను మొత్తంలో వందశాతానికి సమానంగా జరిమానా విధించనున్నారు. అలాగే బహిర్గతం చేయని ఆస్తులపై జరిమానా విధించనున్నారు.
- పాన్ మసాల, సిగరేట్లు, బీడీలు, జర్దా సహా పలు వస్తువుల ధరల పెరగనున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పన్ను విధానం కారణంగా ధరలు భారీగా పెరగనున్నాయి. కొత్త విధానంలో ఇప్పటికే పొగాకు ఉత్పత్తులపై ఉన్న జీఎస్టీతో పాటు, అదనపు ఎక్సైజ్ సుంకం, ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్ వర్తిస్తాయి. గతంలో ఉత్పత్తులపై 28శాతం జీఎస్టీ, పరిహార సెస్ విధించేవారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






