త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UPI MDR | యూపీఐ ఎండీఆర్ అమ‌లుకు బ్రేక్‌..? జ‌న‌వ‌రికి వాయిదా ప‌డే ఛాన్స్‌..!

UPI MDR | యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్టోబర్ 15 నుంచి అమలు చేయాలని నిర్ణయించగా.. ఈ గడువును జనవరి 1 వరకు పొడిగించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు జాతీయ మీడియా తెలిపింది.

P

Business | Published On Oct 8, 2026, 9.31 pm IST

UPI MDR | యూపీఐ ఎండీఆర్ అమ‌లుకు బ్రేక్‌..? జ‌న‌వ‌రికి వాయిదా ప‌డే ఛాన్స్‌..!
Advertisement

UPI MDR | యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్టోబర్ 15 నుంచి అమలు చేయాలని నిర్ణయించగా.. ఈ గడువును జనవరి 1 వరకు పొడిగించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. త్వ‌ర‌లోనే ఈ అంశంపై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు తుది నిర్ణయం వెలువడలేదు.

ఎండీఆర్ అంటే?

డిజిటల్ పేమెంట్లను స్వీకరించే వ్యాపారుల నుంచి పేమెంట్ ప్రాసెసింగ్ కోసం వసూలు చేసే రుసుమునే మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అంటారు. యూపీఐపై ఎండీఆర్ అమలు పేమెంట్ కంపెనీలు, ఫిన్‌టెక్ సంస్థల వ్యాపారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు యూపీఐ ఎండీఆర్‌పై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించే ప్రతిపాదనను కూడా జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించింది. 18 శాతం జీఎస్టీపై పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. కొత్త యూపీఐ ఎండీఆర్ విధానంలో రూ.2వేల‌కు మించిన కొన్ని పర్సన్-టు-మర్చంట్ (P2M) లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ విధించే ప్రతిపాదన ఉంది. అయితే, దేశంలోని దాదాపు 96 శాతం P2M యూపీఐ లావాదేవీలపై దీని ప్రభావం ఉండదని ప్రభుత్వం చెబుతోంది.

పేటీఎంకు దెబ్బ

ఎండీఆర్ అమలు గడువు పొడిగించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఫిన్‌టెక్ కంపెనీల షేర్లు గురువారం ఒత్తిడికి గుర‌య్యాయి. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేరు బీఎస్‌ఈలో ఒక దశలో 10 శాతం వరకు పడిపోయి రూ.1,560.60కి చేరింది. ఆ త‌ర్వాత కొంత కోలుకుని రూ.1,640 వద్ద ముగిసింది. గత ముగింపుతో పోలిస్తే 5.42 శాతం నష్టపోయింది.

Advertisement
Advertisement