Budget 2026 | బడ్జెట్‌లో ఎక్కువగా వినే ఈ పదాల గురించి తెలుసా..?
Budget 2026 | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. బడ్జెట్ ప్రసంగంలో ఫిస్కల్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, బడ్జెట్ ఎస్టిమెషన్ తదితర పదాలు వినే ఉంటారు.
Budget 2026 | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. బడ్జెట్ ప్రసంగంలో ఫిస్కల్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, బడ్జెట్ ఎస్టిమెషన్ తదితర పదాలు వినే ఉంటారు. అయితే, అసలు పదాల అర్థం ఏంటీ? ప్రాధాన్యం ఏంటో చాలా మందికి అర్థం కాదు. అందుకే బడ్జెట్‌కు సంబంధించిన ముఖ్యమైన పదాలను సులభమైన, స్పష్టమైన భాషలో తెలుసుకోవడం అవసరం. ఈ నేపథ్యంలో ముఖ్యమైన బడ్జెట్‌లో తరుచుగా వినిపించే పదాల గురించి తెలుసుకుందాం..!
బడ్జెట్ అంటే ఏమిటి?
బడ్జెట్ ప్రభుత్వం ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం, చేయబోయే ఖర్చుల అంచనాలను వెల్లడించే అధికారిక ప్రకటన.
ఫిస్కల్ డెఫిసిట్ (Fiscal Deficit)
ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం, ప్రభుత్వం చేసే మొత్తం ఖర్చుల మధ్య ఉన్న తేడాను ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. ప్రభుత్వం తన ఖర్చులను తీర్చడానికి ఎంత మొత్తంలో అప్పు చేయాల్సి వస్తుందో ఇది సూచిస్తుంది. అప్పులు మొత్తం ఆదాయంలో లెక్కించరు. అందువల్ల ప్రభుత్వ ఆదాయం, వ్యయాల మధ్య ఉన్న ఈ తేడాను బడ్జెట్ లోటు, ఫిస్కల్ డెఫిసిట్ అని పిలుస్తారు.
కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (Current Account Deficit)
ఒక దేశం చేసే దిగుమతులు, ఎగుమతుల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏర్పడుతుంది. ఎగుమతుల ద్వారా దేశానికి ఆదాయం వస్తుంది. దిగుమతులు చేసుకున్న సందర్భంలో దేశం విదేశీ కరెన్సీలోనే చెల్లింపులు చేయాల్సి వస్తుంది. దేశానికి జరిగే చెల్లింపులు, ఖర్చు చేసే మొత్తాల మధ్య ఉన్న తేడానే కరెంట్ అకౌంట్ డెఫిసిట్‌గా పేర్కొంటారు. ఎగుమతులు ఎక్కువగా ఉంటు విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. దిగుమతులపై ఆధారపడితే విదేశీ మారక నిల్వలు తగ్గుతాయి.
ప్రభుత్వ ఆదాయం, ఎక్స్‌పెండేచర్ (Government Revenue and Expenditure)
ప్రభుత్వానికి వివిధ వనరుల నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఆదాయం అంటారు. ప్రభుత్వం వివిధ అవసరాల కోసం చేసే ఖర్చులన్నింటినీ ప్రభుత్వ వ్యయం అంటారు. ఈ ఆదాయం, వ్యయాలు ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ఆర్థిక స్థితిని ప్రతిబింబిస్తాయి.
బడ్జెట్ అంచనాలు (Budget Estimation)
బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో ఆర్థిక మంత్రి పన్నులు, ఇతర వనరుల ద్వారా ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉందో వెల్లడిస్తారు. అలాగే పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టులపై ఎంత ఖర్చు చేయబోతున్నారో వివరాలలను సభ ముందుంచుతారు. ఈ అంచనాలనే బడ్జెట్ ఎస్టిమేషన్ అని పిలుస్తారు.
ఫైనాన్స్ బిల్ (Finance Bill)
కొత్త పన్నులు విధించడం, ఇప్పటికే ఉన్న పన్నుల్లో మార్పులు చేయడం వంటి ప్రతిపాదనలను ప్రభుత్వం ఫైనాన్స్ బిల్ ద్వారా తీసుకువస్తుంది. పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తాయి.
రెవెన్యూ సర్‌ప్లస్ (Revenue Surplus)
ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ ఆదాయం, రెవెన్యూ ఖర్చుల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ తేడాను రెవెన్యూ సర్‌ప్లస్ అని అంటారు.
అప్రోప్రియేషన్ బిల్ (Appropriation Bill)
ప్రభుత్వం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు పార్లమెంట్ అనుమతి కోరుతుంది. ఈ అనుమతి కోసం తీసుకువచ్చే బిల్లునే అప్రోప్రియేషన్ బిల్ అంటారు. ఈ బిల్ ద్వారా ఆర్థిక మంత్రి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులు ఉపసంహరించుకునేందుకు సభ అనుమతి కోరుతారు.
క్యాపిటల్ బడ్జెటింగ్ (Capital Budgeting)
ప్రభుత్వానికి వచ్చే మూలధన ఆదాయం, ప్రభుత్వం చేసే మూలధన వ్యయాలకు సంబంధించిన పూర్తి వివరాలు క్యాపిటల్ బడ్జెట్‌లో ఉంటాయి. అప్పుల ద్వారా సమీకరించిన నిధులు, బాండ్ల విక్రయం, రాష్ట్రాల నుంచి వచ్చే వసూళ్లు తదితర మూలధన వనరులన్నీ ఇందులో పొందుపరుస్తారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






