Devika Bhatt | తెలుగు ఇండస్ట్రీలోకి మరో కన్నడ బ్యూటీ – సీరియల్స్‌తో కెరీర్ మొదలుపెట్టి…
తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా మరో కన్నడ బ్యూటీ అడుగుపెట్టబోతుంది. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రియాలిటీ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 25న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ దేవికా భట్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Entertainment | Published On Oct 19, 2026, 3.09 pm IST
Devika Bhatt | తెలుగు ఇండస్ట్రీలో కన్నడ బ్యూటీల హవా కొనసాగుతోంది. రష్మిక మందన్న, పూజా హెగ్డే, రుక్మిణి వసంత్‌తో పాటు పలువురు కన్నడ సుందరీమణులు టాలీవుడ్ టాప్ హీరోయిన్లుగా చెలామణి అవుతోన్నారు. తాజాగా వీరి బాటలోనే మరో శాండల్‌వుడ్ సుందరి అడుగులు వేయబోతుంది.
రియాలిటీ...
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తోన్న మూవీ రియాలిటీ. మిడిల్ క్లాస్ అనుబంధాలు, ఆప్యాయతలతో రూపొందుతోన్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 25న థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో దేవికా భట్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆలోచన అనే పాత్రలో కనిపించబోతుంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిగా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలో దేవికా భట్ నటిస్తోంది.
సీరియల్స్‌తో...
ఎంబీఏ పూర్తిచేసిన దేవికా భట్ ఓ ఆర్కిటెక్చర్ కంపెనీలో చాలా రోజుల పాటు జాబ్ చేసింది. యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో ఉద్యోగాన్ని వదిలేసిన ఈ కన్నడ భామ రామాచారి సీరియల్‌తో ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకొచ్చింది. ఈసీరియల్‌లో రుక్మిణి అనే పాత్రలో అసమాన నటనతో ఆకట్టుకుంది. సీరియల్ ద్వారా వచ్చిన గుర్తింపుతో కన్నడ సినిమా బృందా విహారిలో ఛాన్స్ దక్కించుకుంది. గణేష్ హీరోగా నటించిన ఈ మూవీకి దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాసరాజు దర్శకత్వం వహించాడు. కన్నడ డెబ్యూ మూవీ రిలీజ్ కాకముందే తాజాగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.
భజగోవిందం...
రియాలిటీ సినిమాకు కథ కూడా కిరణ్ అబ్బవరం అందించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ సినిమా నుంచి భజ గోవిందం అనే పాటను అక్టోబర్ 22న రిలీజ్ చేయబోతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sheela Rajkumar | రణబాలిలో అలివేలు – జైలర్ 2లో పార్వతి – రెండు సినిమాల్లో నటించిన తమిళ నటి ఎవరంటే?
అక్టోబర్ 16, 2026

Kiran Abbavaram | నాకు ఒక్క రూపాయి అప్పు లేదు – కిరణ్ అబ్బవరం “రియాలిటీ” గ్లింప్స్ రిలీజ్
అక్టోబర్ 5, 2026

Tejeswini | తేజస్విని సినీ ఎంట్రీకి రంగం సిద్ధం..! కథను సిద్ధం చేస్తున్న లేడి డైరెక్టర్..!
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●Meta | తప్పుడు కంటెంట్‌పై కొరడా.. మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు
- ●Tiger Shroff Firing | టైగర్ ష్రాఫ్ కారు కాల్పుల కేసులో సంచలన నిజాలు.. నేపాల్‌కు పారిపోవాలని నిందితుల ప్లాన్
- ●Tiger Shroff Attackers Arrested Kota | టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. రాజస్థాన్‌లో దొరికిపోయిన ముగ్గురు షూటర్లు
- ●Riteish Deshmukh | తెలుగు సినిమాలో జెనీలియా భర్త - రామ్ కోసం విలన్‌గా మారిన బాలీవుడ్ హీరో
- ●LK Advani | ఆసుపత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
- ●RS Praveen Kumar | పోలీసుల జోక్యం మీద రాస్తే జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తరా?

Meta | తప్పుడు కంటెంట్‌పై కొరడా.. మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు

Tiger Shroff Firing | టైగర్ ష్రాఫ్ కారు కాల్పుల కేసులో సంచలన నిజాలు.. నేపాల్‌కు పారిపోవాలని నిందితుల ప్లాన్

Tiger Shroff Attackers Arrested Kota | టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. రాజస్థాన్‌లో దొరికిపోయిన ముగ్గురు షూటర్లు

Riteish Deshmukh | తెలుగు సినిమాలో జెనీలియా భర్త - రామ్ కోసం విలన్‌గా మారిన బాలీవుడ్ హీరో



