SBI | ఖాతాదారులకు ఎస్‌బీఐ కీలక అప్‌డేట్.. ఈ నంబర్లు బ్యాంకువే..
SBI | దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఫోన్ ఆధారిత ఆర్థిక మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఖాతాదారుల భద్రత కోసం కీలక సూచనలు చేసింది. బ్యాంకు పేరుతో నకిలీ కాల్స్, మెసేజ్‌ల ద్వారా మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతుండడంతో ఏయే నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను నమ్మవచ్చో ఎస్‌బీఐ స్పష్టత ఇచ్చింది.
SBI | దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఫోన్ ఆధారిత ఆర్థిక మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఖాతాదారుల భద్రత కోసం కీలక సూచనలు చేసింది. బ్యాంకు పేరుతో నకిలీ కాల్స్, మెసేజ్‌ల ద్వారా మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతుండడంతో ఏయే నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను నమ్మవచ్చో ఎస్‌బీఐ స్పష్టత ఇచ్చింది. +91-1600 తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచి వచ్చే కాల్స్ బ్యాంకు అధికారిక సేవా కాల్స్ అని తెలిపింది. ఈ నంబర్ల నుంచి వచ్చే సమాచార కాల్స్, అలర్ట్స్, సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఖాతాదారులు నిశ్చింతగా స్వీకరించవచ్చని బ్యాంకు స్పష్టం చేసింది. +91-1600 నంబర్ సిరీస్‌ను పూర్తిగా కస్టమర్ సర్వీస్, లావాదేవీలకు సంబంధించిన అధికారిక సమాచారానికే వినియోగిస్తున్నట్లు తెలిపింది. సేవల అప్‌డేట్స్, ఖాతా సంబంధిత సమాచారం, బ్యాంకు ప్రారంభించే కమ్యూనికేషన్లు ఈ నంబర్ల నుంచే వస్తాయని పేర్కొంది.
+91-1600 నంబర్ సిరీస్ అంటే..?
మోసగాళ్లు తరచూ బ్యాంకు అధికారులుగా నమ్మిస్తూ కాల్స్, మెసేజ్‌లు చేస్తున్నారని, అయితే బ్యాంకుకు చెందిన అధికారిక ఫోన్ కాల్స్, మెసేజ్‌లు ఏయే నంబర్ల నుంచి వస్తాయో ఖాతాదారులకు స్పష్టతను ఇచ్చేందుకే ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నామని ఎస్‌బీఐ వెల్లడించింది. దీని వల్ల నిజమైన కాల్స్, నకిలీ కాల్స్ మధ్య తేడాలను ఖాతాదారులు గుర్తించేందుకు వీలుంటుందని ఎస్‌బీఐ తెలిపింది. ఖాతాదారుల భద్రతే తమ అత్యున్నత ప్రాధాన్యత అని ఎస్‌బీఐ మరోసారి స్పష్టం చేసింది. +91-1600 సిరీస్ నుంచి వచ్చే కాల్స్ బ్యాంకు అధికారిక కమ్యూనికేషన్‌లో భాగమేనని భరోసా ఇచ్చింది. అదే సమయంలో, ఎలాంటి కాల్ వచ్చినా సున్నితమైన వివరాలను చెప్పే ముందు జాగ్రత్త అవసరమని హెచ్చరించింది.
స్పష్టమైన ధ్రువీకరణ..
దేశవ్యాప్తంగా ఫోన్, మెసేజ్ ఆధారిత మోసాల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. బ్యాంకు అధికారులమని చెప్పుకుని ఓటీపీలు, ఏటీఎం పిన్‌లు, కార్డ్ వివరాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను అడగడం వంటి ఘటనలు సాధారణమవుతున్నాయి. భయాందోళన కలిగించేలా మాట్లాడి బాధితులను మభ్యపెట్టడం మోసగాళ్ల ప్రధాన వ్యూహంగా మారింది. ఈ తరహా మోసాల బారిన పడి ఇప్పటికే ఎంతో మంది ఎన్నో కోట్ల రూపాయలను నష్టపోయారు. ఈ నేపథ్యంలో తమ అధికారిక కాలింగ్, మెసేజింగ్ నంబర్లను వెల్లడించడం ద్వారా ఖాతాదారులకు ఒక స్పష్టమైన ధ్రువీకరణ లభిస్తుందని ఎస్‌బీఐ పేర్కొంది.
సంబంధిత వార్తలు

SBI Recruitment | ఎస్‌బీఐ ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్.. రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
మే 14, 2026

SBI | భారీగా పెరిగిన ఎస్‌బీఐ ఆదాయం.. ఒక్కో షేరుకు రూ.17.35 డివిడెండ్ ప్రకటన..
మే 8, 2026

SBI ETF | ఎస్‌బీఐ నుంచి మరో రెండు కొత్త ఫండ్స్.. కనీస పెట్టుబడి రూ.500, 10 రోజుల వరకు వ్యవధి..
మే 8, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



