Offshore Minerals | అండమాన్ దీవుల్లో అరుదైన ఖనిజాలు.. రెండు ప్రాంతాలకు వేలం..
Offshore Minerals | అత్యాధునిక సాంకేతిక పరిశ్రమల్లో కీలక ఖనిజాలకు డిమాండ్ బాగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ముఖ్య నిర్ణయం తీసుకుంది. అండమాన్ నికోబార్ పరిధిలోని గ్రేట్ నికోబార్ దీవికి సమీపంలో ఉన్న సెవెల్ రైజ్-1, వెస్ట్ సెవెల్ రిడ్జ్-1 ప్రాంతాలను ఆయా ఖనిజాల వెలికితీతకు గాను వేలం వేయనుంది.
Offshore Minerals | అత్యాధునిక సాంకేతిక పరిశ్రమల్లో కీలక ఖనిజాలకు డిమాండ్ బాగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ముఖ్య నిర్ణయం తీసుకుంది. అండమాన్ నికోబార్ పరిధిలోని గ్రేట్ నికోబార్ దీవికి సమీపంలో ఉన్న సెవెల్ రైజ్-1, వెస్ట్ సెవెల్ రిడ్జ్-1 ప్రాంతాలను ఆయా ఖనిజాల వెలికితీతకు గాను వేలం వేయనుంది. ఈ రెండు ప్రాంతాల్లోనూ కోబాల్ట్, నికెల్, మాంగనీస్, కాపర్, ఇతర అత్యంత కీలకమైన ఖనిజాలు ఉన్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రెండు ప్రాంతాలు సుమారుగా 1632 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి. వీటిలో బహుళ లోహాల నాడ్యూల్స్, క్రస్ట్‌లు ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. వీటి వల్ల అనేక కీలక రకాల కీలక ఖనిజాలు లభ్యమవుతాయని అంచనా వేశారు. అందులో భాగంగానే ఈ రెండు ప్రాంతాలకు కేంద్రం వేలం నిర్వహిస్తోంది. ఈ మేరకు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి కేశవ్ చంద్ర వర్చువల్ విధానంలో వేలం ప్రక్రియను ప్రారంభించారు.
దేశ ఖనిజ వనరుల స్థావరాల విస్తరణ..
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ వేలం ద్వారా ఆయా ప్రాంతాల్లో ముఖ్యమైన ఖనిజాలను అన్వేషించడంతోపాటు వెలికితీతకు సంబంధించిన పనులను కూడా చేపట్టవచ్చు. అలాగే అభివృద్ధి కూడా చేయవచ్చు. ఇందుకు గాను కంపెనీలకు కాంపోజిట్ లైసెన్స్‌లను మంజూరు చేయనున్నారు. సెవెల్ రైజ్-1 ప్రాంతం సెవెల్ రైజ్‌కు చెందిన దక్షిణ భాగంలో ఉండగా, వెస్ట్ సెవెల్ రిడ్జ్-1 ప్రాంతం గ్రేట్ నికోబార్ దీవికి సమీపంలోని సముద్ర ప్రాంతంలో ఉంది. సంప్రదాయ భూభాగ ఖనిజ నిక్షేపాలకు మించి దేశ ఖనిజ వనరుల స్థావరాన్ని విస్తరించాలన్న ప్రభుత్వ ప్రయత్నంలో భాగంగా సముద్రంలోని ఆయా ప్రాంతాలను దేశ ఖనిజ అన్వేషణ వ్యవస్థలోకి తీసుకురానున్నారు. ఇక అత్యంత ముఖ్యమైన ఖనిజాలను ప్రస్తుతం బ్యాటరీలు, పునరుత్పాదక ఇంధనాలు, ఎలక్ట్రానిక్స్, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. అందువల్ల వాటికి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అలాంటి ఖనిజాలకు విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ఖనిజ భద్రతను బలోపేతం చేస్తుందని, దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచవచ్చని కేంద్రం చెబుతోంది.
ముఖ్యమైన తేదీలు..
సముద్రంలోని ఖనిజ వనరులను దేశ ఖనిజ రంగానికి కొత్త సరిహద్దుగా కేశవ్ చంద్ర అభివర్ణించారు. శాస్త్రీయ పద్ధతిలో చేపట్టే అన్వేషణ దేశీయంగా ఖనిజ లభ్యతను పెంచుతుందని అన్నారు. అయితే సముద్ర వనరుల అభివృద్ధికి శాస్త్రీయ, సాంకేతిక సామర్థ్యాలు అవసరమని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ బాధ్యతాయుతంగా ఈ ప్రక్రియను చేపట్టాలని అన్నారు. వేలంలో పరిశ్రమలు, ఆసక్తి ఉన్న బిడ్డర్లు, సమర్థవంతమైన ఖనిజ అన్వేషణ సంస్థలు చురుగ్గా పాల్గొనాలని కోరారు. బాధ్యతాయుతమైన వనరుల అభివృద్ధికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. కాగా ఈ వేలం ప్రక్రియకు గాను అక్టోబర్ 1న టెండర్ పత్రాల విక్రయం ప్రారంభం కాగా, నవంబర్ 4న ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నారు. నవంబర్ 13న ప్రశ్నలు, సందేహాలను సమర్పించేందుకు చివరి తేదీగా నిర్ణయించారు.
టెండర్ పత్రాలను డిసెంబర్ 21వరకు కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. బిడ్స్‌ను డిసెంబర్ 28న సాయంత్రం 5 గంటల వరకు సమర్పించవచ్చు. ఈ వేలం ప్రక్రియను ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టం, 2002, సవరించిన ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్ ఆక్షన్ నిబంధనలు, 2024 ప్రకారం ఎంఎస్‌టీసీ ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్ ద్వారా నిర్వహించనున్నారు.
తాజావార్తలు
- ●Hanuman Ansh | రెండు కోట్ల బడ్జెట్ - 400 కోట్ల కలెక్షన్స్ - తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ
- ●Mohan Bhagwat | భారత ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచానికి మార్గదర్శకం : మోహన్ భగవత్
- ●Samsung Galaxy Tab S12 | గెలాక్సీ ట్యాబ్ ఎస్12 ప్లస్, ఎస్12 అల్ట్రా లాంచ్.. ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయి..
- ●Yuzvendra Chahal | చాహల్ సంచలనం.. ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన లెగ్ స్పిన్నర్..!
- ●Bhatti Vikramarka | గాంధీ పోరాటాన్ని మరిచి చరిత్రను వక్రీకరిస్తున్నరు
- ●Keerthy Suresh | భర్త కోసం సావిత్రి పోరాటం - కీర్తి సురేష్ కొత్త మూవీ టైటిల్‌పై నెటిజన్ల ట్రోల్స్

Hanuman Ansh | రెండు కోట్ల బడ్జెట్ - 400 కోట్ల కలెక్షన్స్ - తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ

Mohan Bhagwat | భారత ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచానికి మార్గదర్శకం : మోహన్ భగవత్

Samsung Galaxy Tab S12 | గెలాక్సీ ట్యాబ్ ఎస్12 ప్లస్, ఎస్12 అల్ట్రా లాంచ్.. ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయి..

Yuzvendra Chahal | చాహల్ సంచలనం.. ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన లెగ్ స్పిన్నర్..!



