Oil Prices | ట్రంప్ ప్రకటనతో భారీగా దిగివచ్చిన క్రూడాయిల్ ధరలు.. 96 డాలర్లకు పతనమై బ్రెంట్..!
Oil Prices | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న తీవ్ర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య గ్లోబల్ ఇంధన మార్కెట్లు కొంత ఊరట కలిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ప్రణాళికాబద్ధమైన సైనిక దాడులను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ చమురు ధరలు గణనీయంగా పడిపోయాయి.
Oil Prices | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న తీవ్ర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య గ్లోబల్ ఇంధన మార్కెట్లు కొంత ఊరట కలిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ప్రణాళికాబద్ధమైన సైనిక దాడులను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ చమురు ధరలు గణనీయంగా పడిపోయాయి. అమెరికా నిర్ణయం తర్వాత గ్లోబల్ చమురు ధరలు మొత్తం 13 శాతానికిపైగా పతనమయ్యాయి. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు గ్లోబల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ చమురు ధరలు సుమారు 17 డాలర్లు తగ్గి బ్యారెల్‌కు 96 డాలర్ల కనిష్ఠ స్థాయికి చేరాయి. అలాగే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI) సైతం సుమారు 13 డాలర్లు తగ్గి బ్యారెల్‌కు 85.28 డాలర్ల వద్ద నమోదైంది.
ఇటీవల మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి బ్యారెల్‌కు 100 డాలర్లను దాటాయి. ఇరాన్ వాణిజ్య నౌకలపై దాడులు జరపడం, ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధిలో అంతరాయం కలగడం వంటి పరిణామాలు సరఫరాపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, ఇరాన్‌పై సైనిక చర్యలకు విరామం ప్రకటించడంతో గల్ఫ్ ప్రాంతంలో చమురు ఉత్పత్తి, సరఫరాపై ఆందోళనలు తగ్గింది. ఫలితంగా వంద డాలర్లకు పైగా చేరిన ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం బ్రెంట్ 96 డాలర్లు, డబ్ల్యూటీఐ 85.28 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి.
ఈ పరిణామం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా చమురు దిగుమతి చేసుకునే దేశాలకు ఉపశమనంగా మారింది. ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించే దిశగా ఇది సానుకూల సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు కొంత స్థిరపడినప్పటికీ, హార్ముజ్ జలసంధిలో నౌకా రవాణా పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చలు కొనసాగితే పరిస్థితులు మరింత సద్దుమణిగే అవకాశం ఉంది. అదే జరిగితే చమురు ధరలు మరింత స్థిరపడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






