Loan On LIC Policy | ఎల్ఐసీ పాలసీలపై లోన్ తీసుకోవచ్చా..? ఎంత ఇస్తారు..?
Loan On LIC Policy | దేశంలోనే అతి పెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పౌరులకు అనేక రకాల ఇన్సూరెన్స్ పాలసీలను, స్కీములను అందిస్తోంది. వివిధ విభాగాల వారీగా ఆయా పాలసీలు, స్కీములు అందుబాటులో ఉన్నాయి. అనేక రకాల ఇన్సూరెన్స్ పాలసీలు బహుళ ప్రయోజనాలను అందిస్తుంటాయి.
Loan On LIC Policy | దేశంలోనే అతి పెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పౌరులకు అనేక రకాల ఇన్సూరెన్స్ పాలసీలను, స్కీములను అందిస్తోంది. వివిధ విభాగాల వారీగా ఆయా పాలసీలు, స్కీములు అందుబాటులో ఉన్నాయి. అనేక రకాల ఇన్సూరెన్స్ పాలసీలు బహుళ ప్రయోజనాలను అందిస్తుంటాయి. ఒకేసారి ఇన్సూరెన్స్ కవరేజితోపాటు డబ్బును పొదుపు చేసుకునే విధంగా సదుపాయాలను కల్పిస్తున్నాయి. అయితే ఎల్ఐసీ పాలసీలపై లోన్లను తీసుకోవచ్చా, ఏయే పాలసీలకు ఇది వర్తిస్తుంది, చెల్లింపు విధానం వంటి అనేక అంశాలపై పాలసీదారులకు తరచూ సందేహాలు వస్తుంటాయి. ఇందుకు బ్యాంకింగ్ నిపుణులు సమాధానాలు చెబుతున్నారు.
నిబంధనలు ఇవే..
ఎల్ఐసీ పాలసీలపై లోన్లను తీసుకోవచ్చు. కానీ ఇందుకు అనేక నిబంధనలు వర్తిస్తాయి. అన్ని పాలసీలు లోన్లకు అర్హమైనవి కావు. ఎండోమెంట్ పాలసీలపైనే లోన్ సౌకర్యం లభిస్తుంది. పాలసీ ఇన్సూరెన్స్ కవరేజిని అందించడంతోపాటు సేవింగ్స్ ఆప్షన్ ను కూడా కలిగి ఉండాలి. అలాంటి పాలసీలకే లోన్లు ఇస్తారు. అలాగే పాలసీ ప్రీమియంను కనీసం 3 ఏళ్ల పాటు అయినా క్రమం తప్పకుండా చెల్లించాలి. అప్పుడే లోన్ తీసుకునేందుకు వీలవుతుంది. పాలసీకి తగిన సరెండర్ విలువ ఉండాలి. ఇది వినియోగదారులు తీసుకునే పాలసీ రకంపై ఆధార పడి ఉంటుంది. లోన్ తీసుకునే నాటికి ఎన్ని ప్రీమియంలను చెల్లించారు, పాలసీ ఎప్పటి నుంచి అమలులో ఉంది అన్న విషయాలను కూడా పరిశీలించి లోన్ అర్హతను నిర్ణయిస్తారు. సాధారణంగా పాలసీ సరెండర్ విలువలో 85 నుంచి 90 శాతం వరకు లోన్ ఇస్తారు.
సులభంగా చెల్లింపులు..
ఎల్ఐసీ పాలసీపై రుణం తీసుకుంటే చెల్లింపులు కూడా సులభంగానే చేయవచ్చు. లోన్ కాల వ్యవధి ముగియకుండానే ముందస్తు చెల్లింపులు చేసి రుణాన్ని క్లోజ్ చేయవచ్చు. లేదా పాలసీ మెచూరిటీ గడువుకు ముందు కూడా లోన్‌ను క్లోజ్ చేయవచ్చు. ఇది పాలసీదారుడు తీసుకునే రుణం, ఎంచుకునే ఈఎంఐల సంఖ్యపై ఆధార పడి ఉంటుంది. పాలసీదారుడు ఒక వేళ రుణం చెల్లించకపోతే సరెండర్ విలువలో ఆ మొత్తాన్ని రాబడుతారు. తరువాత మిగిలిన మొత్తాన్ని పాలసీదారుడికి అందజేస్తారు. దీంతో పాలసీని క్లోజ్ చేసినట్లు అవుతుంది.
ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో..
ఎల్ఐసీ పాలసీలపై రుణాలను చాలా సులభంగా తీసుకోవచ్చు. పాలసీదారుడు తన వద్ద ఉన్న పాలసీలు రుణానికి అర్హమైనవి అని భావిస్తే ఎల్ఐసీ యాప్ లేదా వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి కావల్సిన పాలసీని ఎంపిక చేసుకుని దానికి రుణం కోసం దరఖాస్తు చేయవచ్చు. అన్ని వివరాలను పరిశీలించాక రుణం మంజూరు చేస్తారు. రుణం నేరుగా పాలసీదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఆన్‌లైన్‌లో వీలవకపోతే ఆఫ్ లైన్‌లో ఎల్ఐసీ బ్రాంచిని సందర్శించి కూడా పాలసీలపై రుణం కోసం దరఖాస్తు చేయవచ్చు. అత్యవసర వైద్య ఖర్చులు, ఇతర అవసరాల కోసం ఈ విధంగా లోన్ తీసుకుని ఉపయోగించుకోవచ్చు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






