Qatar | ఎల్ఎన్జీ ఒప్పందాలపై ఖతార్ ఫోర్స్ మజ్యూర్..! దీని అర్థం ఏంటో తెలుసా..?
Qatar | ఖతార్ ఎనర్జీ ఎల్ఎన్జీ సరఫరా ఒప్పందాలపై “ఫోర్స్ మజ్యూర్” ప్రకటించింది. నియంత్రించలేని, అనూహ్య పరిస్థితుల కారణంగా ఒప్పంద బాధ్యతలను తాత్కాలికంగా నిర్వర్తించలేమని తెలిపింది.
Qatar | ఖతార్ ఎనర్జీ ఎల్ఎన్జీ సరఫరా ఒప్పందాలపై “ఫోర్స్ మజ్యూర్” ప్రకటించింది. నియంత్రించలేని, అనూహ్య పరిస్థితుల కారణంగా ఒప్పంద బాధ్యతలను తాత్కాలికంగా నిర్వర్తించలేమని తెలిపింది. మార్చి 18, 19 తేదీలలో జరిగిన క్షిపణి దాడుల్లో ఖతార్‌లోని ప్రముఖ గ్యాస్ ఉత్పత్తి కేంద్రం రస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ తీవ్రంగా దెబ్బన్న విషయం తెలిసిందే. రెండు దాడుల్లో ఎల్ఎన్‌జీ ట్రైన్లు, గ్యాస్ టు లిక్విడ్స్ (GTL) యూనిట్లకు భారీ నష్టం జరిగింది. ఈ కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
ఈ పరిణామంతో ఇటలీ, బెల్జియం, దక్షిణ కొరియా, చైనా దేశాలకు గ్యాస్ సరఫరాపై ప్రభావం పడనుంది. ఇప్పటి వరకు ఆ దేశాలు ఖతార్ నుంచి గ్యాస్‌ను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాయి. తాజాగా ఆయా దేశాలు ప్రత్యామ్నాయ వనరులను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంపెనీ ప్రస్తుతం నష్టాన్ని పూర్తిగా అంచనా వేస్తోందని, మరమ్మతులకు ఎంత సమయం పడుతుందో ఇంకా స్పష్టత రాలేదని తెలిపింది. ఈ ఘటనతో ప్రపంచ ఇంధన మార్కెట్‌లో అనిశ్చితి పెరిగింది. ఇప్పటికే సరఫరా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పరిణామం మార్కెట్‌పై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
అనూహ్య పరిస్థితుల్లో ఒప్పంద బాధ్యతల నుంచి తాత్కాలిక ఉపశమనం కల్పించే కీలక న్యాయపరమైన నిబంధనగా “ఫోర్స్ మజ్యూర్” (Force Majeure) ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఫ్రెంచ్ భాష నుంచి వచ్చిన ఈ పదానికి నియంత్రణకు అతీతమైన పరిస్థితి అనే అర్థం వస్తుంది. వ్యాపార ఒప్పందాలు, ముఖ్యంగా ఇంధనం, నిర్మాణం, అంతర్జాతీయ వాణిజ్యం వంటి రంగాల్లో దీన్ని విస్తృతంగా వినియోగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఖతార్ ఎనర్జీ ఎల్ఎన్జీ సరఫరా ఒప్పందాలపై ఫోర్స్ మజ్యూర్ ప్రకటించడంపై ఖతార్ ఎనర్జీ తన ఎల్‌ఎన్‌జీ సరఫరా ఒప్పందాలపై ఫోర్స్ మజ్యూర్ ప్రకటించడం ఈ నిబంధనపై మరింత దృష్టిని ఆకర్షించింది.
ఫోర్స్ మజ్యూర్ అనేది ఒప్పందంలో ముందుగానే చేర్చే ఒక ప్రత్యేక క్లాజ్. సహజ విపత్తులు, యుద్ధాలు, అల్లర్లు, మహమ్మారులు, ప్రభుత్వ ఆంక్షలు వంటి అనూహ్య సంఘటనలు జరిగితే ఒప్పంద బాధ్యతలను తాత్కాలికంగా నిలిపివేయడానికి, మినహాయించేందుకు ఈ క్లాజ్ సహాయపడుతుంది. ఒక సంస్థ ఫోర్స్ మజ్యూర్‌ను ప్రకటించాలంటే.. ఆ సంఘటన తమ నియంత్రణకు బయట జరిగిందని నిరూపించాల్సి ఉంటుంది. ఒప్పందం నెరవేర్చడం అసాధ్యమైందని చూపించడంతో పాటు సంబంధిత పక్షాలకు ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఇది పూర్తిగా బాధ్యతల నుంచి విముక్తి ఒప్పందం కాదని, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఒప్పందాన్ని కొనసాగించాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






