త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold ETFs | గోల్డ్ ఈటీఎఫ్‌ల‌లో ప్ర‌జ‌లు భారీగా పెట్టుబ‌డులు.. అన్ని దేశాల మార్కెట్ల‌లోనూ నిధుల వ‌ర‌ద‌..

Gold ETFs | భారత్‌లో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (Gold ETFs)పై పెట్టుబడిదారుల ఆసక్తి 2026 జనవరిలో గణనీయంగా పెరిగింది. వ‌ర‌ల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జనవరిలో భారత గోల్డ్ ఈటీఎఫ్‌లకు నికరంగా 2.49 బిలియన్ డాల‌ర్ల ఇన్‌ఫ్లోస్ వ‌చ్చాయి. ఇది డిసెంబర్‌లోని 1.25 బిలియన్ డాల‌ర్ల‌తో పోలిస్తే 98 శాతం పెరుగుదలగా న‌మోదు కావ‌డం విశేషం.

S

Business | Published On Feb 9, 2026, 8.47 am IST

Gold ETFs | గోల్డ్ ఈటీఎఫ్‌ల‌లో ప్ర‌జ‌లు భారీగా పెట్టుబ‌డులు.. అన్ని దేశాల మార్కెట్ల‌లోనూ నిధుల వ‌ర‌ద‌..
Advertisement

Gold ETFs | భారత్‌లో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (Gold ETFs)పై పెట్టుబడిదారుల ఆసక్తి 2026 జనవరిలో గణనీయంగా పెరిగింది. వ‌ర‌ల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జనవరిలో భారత గోల్డ్ ఈటీఎఫ్‌లకు నికరంగా 2.49 బిలియన్ డాల‌ర్ల ఇన్‌ఫ్లోస్ వ‌చ్చాయి. ఇది డిసెంబర్‌లోని 1.25 బిలియన్ డాల‌ర్ల‌తో పోలిస్తే 98 శాతం పెరుగుదలగా న‌మోదు కావ‌డం విశేషం. ఈ రంగానికి ఇది వరుసగా ఎనిమిదో నెల ఇన్‌ఫ్లోస్ కావడం గ‌మ‌నార్హం. 2025 సంవత్సరంలో మార్చి, మే నెలలను మినహాయిస్తే మిగతా అన్ని నెలల్లో గోల్డ్ ఈటీఎఫ్‌లకు నికర పెట్టుబడులు వచ్చాయి.

262 శాతం వృద్ధితో భార‌త్‌..

మొత్తం 2025లో భారత్‌కు వచ్చిన ఇన్‌ఫ్లోస్ 4.68 బిలియన్ డాలర్లు కాగా ఇది 2024లో వ‌చ్చిన‌ 1.29 బిలియన్ డాల‌ర్ల ఇన్‌ఫ్లోస్‌తో పోలిస్తే 262 శాతం పెరిగింది. అంత‌కు ముందు సంవత్సరాల‌ను పరిశీలిస్తే, 2023లో సుమారుగా 310 మిలియన్ డాలర్లు, 2022లో కేవలం 33 మిలియన్ డాలర్లు మాత్రమే గోల్డ్ ఈటీఎఫ్‌లకు పెట్టుబ‌డులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా భౌతిక బంగారంతో మద్దతు ఉన్న గోల్డ్ ఈటీఎఫ్‌లకు సంవత్సర ప్రారంభంలోనే పెట్టుబడిదారులు భారీగా నిధులు కేటాయించారు. జనవరిలో గ్లోబల్ గోల్డ్ ఈటీఎఫ్‌లకు 19 బిలియన్ డాల‌ర్ల ఇన్‌ఫ్లోస్ వ‌చ్చాయి. ఇది చరిత్రలోనే అత్యధిక నెలవారీ ఇన్‌టేక్‌గా రికార్డైంది. అదే సమయంలో బంగారం ధరలు నెలలోనే సుమారు 14 శాతం పెరగడంతో, గ్లోబల్ గోల్డ్ ఈటీఎఫ్‌లలోని మొత్తం ఆస్తుల విలువ 669 బిలియన్ డాల‌ర్ల‌కు చేరింది. ఇది ఒక్క నెలలోనే 20 శాతం పెరుగుదలగా నిలిచింది.

అన్ని మార్కెట్ల‌లోనూ ప్ర‌భావం..

అలాగే ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఈటీఎఫ్‌ల వద్ద ఉన్న బంగారం నిల్వలు 120 టన్నులు పెరిగి, మొత్తం 4,145 టన్నులకు చేరి ఆల్‌టైమ్ హై నమోదు చేశాయి. జనవరిలో ఆసియా గోల్డ్ ఈటీఎఫ్‌లకు 10 బిలియన్ డాల‌ర్ల ఇన్‌ఫ్లోస్ వచ్చాయి. ఇది 2025 సగటు నెలవారీ ఇన్‌ఫ్లోస్‌ను మించి, ఈ ప్రాంతానికి ఇప్పటివరకు నమోదైన అత్యధిక నెలవారీ ఇన్‌ఫ్లోగా నిలిచింది. ఆసియా మార్కెట్లకు ఇది వరుసగా ఐదో నెల పాజిటివ్ ఫ్లోస్ కావ‌డం విశేషం. జనవరిలో అన్ని ప్రాంతాల్లోనూ అత్య‌ధిక‌ ఇన్‌ఫ్లోస్ నమోదయ్యాయి. గ్లోబల్ డిమాండ్‌ను ప్రధానంగా అమెరికా, ఆసియా ముందుకు నడిపించాయి. అమెరికాలో రెండవ అత్యధిక నెలవారీ ఇన్‌ఫ్లో నమోదు కాగా, ఆసియా అత్యధిక స్థాయిని తాకింది. యూరప్‌లో కూడా భౌగోళిక రాజకీయాలు, వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడులు పెరిగాయి. ఇతర ప్రాంతాల్లోనూ వరుసగా రెండో నెల పాజిటివ్ మోమెంటమ్ కొనసాగింది.

ధ‌ర‌లు తగ్గిన‌ప్పుడ‌ల్లా పెట్టుబ‌డి..

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం, జనవరి చివర్లో బంగారం ధరల్లో కొంత తగ్గుదల కనిపించినా, యూరప్‌ను మినహాయించి మిగతా అన్ని ప్రాంతాల్లో జనవరి 30, ఫిబ్రవరి 2 తేదీల్లోనూ నికర ఇన్‌ఫ్లోస్ కొనసాగాయి. ధరలు త‌గ్గిన సమయంలో పెట్టుబడిదారులు మరింతగా గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెంచినట్లు నివేదిక వెల్లడించింది. జనవరి చివర్లో ధరలు ఒక్కసారిగా తగ్గడానికి ప్రధాన కారణంగా, ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌గా కెవిన్ వార్ష్ నామినేషన్ వార్తలు నిలిచాయి. జనవరి అంతా ధరలు బలంగా పెరగడంతో, ఈ తరహా కరెక్షన్ సహజమని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ, నెల చివరి ట్రేడింగ్ రోజున కూడా గోల్డ్ ఈటీఎఫ్‌లకు పాజిటివ్ ఫ్లోస్ కొనసాగాయి.

గోల్డ్ ఈటీఎఫ్‌ల‌కు పెరిగిన డిమాండ్‌..

జనవరిలో ఇన్‌ఫ్లోస్‌కు బంగారం ధరల ర్యాలీతో పాటు డాలర్‌కు సంబంధించిన అనిశ్చితి, ఇరాన్, గ్రీన్‌ల్యాండ్, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది. ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, భవిష్యత్ పాలసీలపై జాగ్రత్తగా వ్యవహరించనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇదే సమయంలో కేంద్ర బ్యాంక్ స్వతంత్రతపై చర్చలు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిరుచులకు అనుగుణంగా కెవిన్ వార్ష్ వ్యవహరిస్తారా? అన్న సందేహాలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాయి. ఈ పరిణామాలన్నీ కలిసి భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలతో పాటు, గోల్డ్ ఈటీఎఫ్‌లపై డిమాండ్‌ను పెంచాయ‌ని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్పష్టం చేసింది.

Advertisement
Advertisement