త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold-Silver Price Today | డాల‌ర్ ఒత్తిడి..! మ‌ళ్లీ త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు..!

Gold-Silver Price Today | వ‌రుస‌గా రెండురోజుల పాటు లాభ‌ప‌డిన బంగారం, వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా దిగివ‌చ్చాయి. మంగ‌ళ‌వారం బంగారం రూ.1,300, వెండి రూ.5800 ప‌త‌న‌మైంది. ట్రేడింగ్ ప్రారంభంలో గోల్డ్ రూ.960 తగ్గి 10 తులానికి రూ.1.57 లక్షలకు చేరింది.

P

Business | Published On Feb 10, 2026, 4.54 pm IST

Gold-Silver Price Today | డాల‌ర్ ఒత్తిడి..! మ‌ళ్లీ త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు..!
Advertisement

Gold-Silver Price Today | వ‌రుస‌గా రెండురోజుల పాటు లాభ‌ప‌డిన బంగారం, వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా దిగివ‌చ్చాయి. మంగ‌ళ‌వారం బంగారం రూ.1,300, వెండి రూ.5800 ప‌త‌న‌మైంది. ట్రేడింగ్ ప్రారంభంలో గోల్డ్ రూ.960 తగ్గి 10 తులానికి రూ.1.57 లక్షలకు చేరింది. ఇక వెండి రూ.2,640 తగ్గి కిలోకు రూ.2.61ల‌క్ష‌ల‌కు చేరింది. అమెరికా డాల‌ర్ వారం క‌నిష్టం నుంచి కోలుకుంది. డాల‌ర్ బ‌ల‌ప‌డ‌డంతో లోహాలు ఒత్తిడికి ఎదుర్కొన్నాయి. వ‌డ్డీ రేట్ల‌పై పెట్టుబ‌డిదారులు దృష్టి సారిస్తున్నారు. ఈ వారంలో కీల‌క‌మైన యూఎస్ ఉపాధి, ద్ర‌వ్యోల్బ‌ణం డేటా విడుద‌ల కానుంది.

ఈ డేటా కోసం పెట్టుబ‌డిదారులు ఎదురుచూస్తున్నారు. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు ఒక‌శాతం త‌గ్గి 5,016.56 డాల‌ర్ల‌కు చేరింది. ఇంత‌కు ముందు డాల‌ర్ బ‌ల‌హీన‌ప‌డ‌డం గ‌త సెష‌న్‌లో 2శాతం పెరిగింది. జ‌న‌వ‌రి 29న రికార్డుస్థాయిలో ప‌సిడి ఔన్స్‌కు 5,594.82 డాల‌ర్ల‌కు చేరింది. ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు 0.8శాతం తగ్గి 5,041.60కి చేరుకుంది. వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 2.5శాతం తగ్గి 81.31 డాల‌కు చేరింది. అయితే, గ‌త సెషన్‌లో దాదాపు 7శాతం పెరిగిన విష‌యం తెలిసిందే. జ‌న‌వ‌రి 29న వెండి ఆల్‌టైమ్ గ‌రిష్ఠ స్థాయి 121.64 డాల‌ర్ల‌కు చేరింది.

బంగారం, వెండి ధ‌ర‌లు త‌గ్గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం యూఎస్ డాల‌ర్ పెర‌గ‌డ‌మే కార‌ణ‌మ‌ని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. అలాగే, గోల్డ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంద‌ని పేర్కొన్నారు. డాల‌ర్ బ‌ల‌ప‌డ‌డం కార‌ణంగా దేశీయ బులియ‌న్ మార్కెట్‌పై ప్ర‌భావం ప‌డింద‌ని పేర్కొంటున్నారు. ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే.. డాలర్ ఇండెక్స్ 0.09 శాతం పెరిగి 96.90కి చేరింది. ఇది ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలపై ఒత్తిడిని పెంచింది. ఇటీవ‌ల ధ‌ర‌లు రికార్డు స్థాయిలో పెరిగిన నేప‌థ్యంలో మార్కెట్లు ఇంకా అస్థిరంగానే ఉన్నాయ‌ని.. లాభాల స్వీక‌ర‌ణ‌తో మ‌ళ్లీ అస్థిర‌త‌కు దారి తీసే అవ‌కాశాలున్నాయ‌ని పేర్కొన్నారు.

Advertisement
Advertisement