Gold-Silver Rate Today | బంగారం, వెండి ధరలకు రెక్కలు..! ఒకే రోజు సిల్వర్ రూ.33వేలకుపైగా జంప్..!
Gold-Silver Rate Today | బంగారం, వెండి ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, యూఎస్ సుంకాలతో పసిడి, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా జీవనకాల గరిష్టానికి చేరాయి.
Gold-Silver Rate Today | బంగారం, వెండి ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, యూఎస్ సుంకాలతో పసిడి, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా జీవనకాల గరిష్టానికి చేరాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడ్ రిజర్వ్‌కు కొత్త చైర్మన్‌ను నియమించడం, చికాగో ఫెడ్‌కు కొత్త చైర్మన్ నియమించడం, చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ మార్జిన్‌ను పెంచడంతో పాటు పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడంతో ధరలు భారీగా ధరలు పతనమయ్యాయి. అయితే, మదుపరులు మళ్లీ కొనుగోళ్లకు దిగడంతో బంగారం, వెండి ధరలకు రొక్కలొచ్చాయి. మంగళవారం బులియన్ మార్కెట్‌లో గోల్డ్ ధర రూ.8,246 పెరిగింది. అదే సమయంలో వెండి ధర 14.28శాతం పెరిగింది.
అంటే ఒకే రోజు రూ.33,732 పైకి కదలడం విశేషం. దాంతో తులం బంగారం రూ.1,49,939.. కిలో వెండి రూ.2,69,993కి పెరిగిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీకరించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం కామెక్స్ ట్రేడింగ్‌లో బంగారం దాదాపు 3 శాతం పెరిగి ఔన్సుకు 4,789కి చేరాయి. వెండి ధర ఊహించని విధంగా పైకి కదిలింది. దాదాపు 5.81 శాతం పెరిగి ఔన్సుకు 81 డాలర్స్ మార్క్‌ను దాటి ట్రేడవుతోంది. ఇక హైదరాబాద్‌లో ధరల విషయానికి వస్తే 24 క్యారెట్ల పసిడి రూ.1,53,930 పలుకుతున్నది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,41,100 వద్ద ఉండగా.. వెండి కిలో రూ.3లక్షలు పలుకుతున్నది.
ఎన్రిచ్ మనీ సీఈవో పొన్ముడి ఆర్ మాట్లాడుతూ ధరల పెరుగుదల తర్వాత లాభాల స్వీకరణ తర్వాత మార్కెట్ అస్థిరంగా ఉందని తెలిపారు. అయితే, కొనుగోళ్ల మద్దతుతో నిలకడగా ఉన్నాయని తెలిపారు. ధరల తగ్గుదలను కొనుగోలుదారులు అందిపుచ్చుకుంటున్నారన్నారు. స్వల్పకాలికంగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ.. ధరలు ఇంకా
ధరలు రూ.1.70లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




