త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold-Silver Price Today | త‌గ్గిన‌ట్లే త‌గ్గి.. మ‌ళ్లీ దూసుకెళ్తున్న బంగారం.. ఒకేరోజు రూ.17వేలు పెరిగిన వెండి..

Gold-Silver Price | కొనుగోలుదారుల‌కు బంగారం, వెండి షాక్ ఇస్తున్నాయి. ఇటీవ‌ల త‌గ్గిన‌ట్లే త‌గ్గిన ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. బుధ‌వారం ప‌సిడి ధ‌ర రూ.5,816 పెరిగి తులానికి రూ.1,59,625 ల‌క్ష‌ల‌కు చేరింది. అదే స‌మ‌యంలో వెండి రూ.16,719 పెరిగి కిలోకు రూ.2,84,734కి ఎగిసింది.

P

Business | Published On Feb 4, 2026, 3.35 pm IST

Gold-Silver Price Today | త‌గ్గిన‌ట్లే త‌గ్గి.. మ‌ళ్లీ దూసుకెళ్తున్న బంగారం.. ఒకేరోజు రూ.17వేలు పెరిగిన వెండి..
Advertisement

Gold-Silver Price Today | కొనుగోలుదారుల‌కు బంగారం, వెండి షాక్ ఇస్తున్నాయి. ఇటీవ‌ల త‌గ్గిన‌ట్లే త‌గ్గిన ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. బుధ‌వారం ప‌సిడి ధ‌ర రూ.5,816 పెరిగి తులానికి రూ.1,59,625 ల‌క్ష‌ల‌కు చేరింది. అదే స‌మ‌యంలో వెండి రూ.16,719 పెరిగి కిలోకు రూ.2,84,734కి ఎగిసింది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌, సిల్వ‌ర్ రేటు పెరిగింది. డాల‌ర్ బ‌ల‌హీన‌ప‌డ‌డం లోహాల ధ‌ర‌ల‌కు క‌లిసి వ‌చ్చింది. స్పాట్ గోల్డ్ 2.2 శాతం పెరిగి ఔన్సుకు 5,044.74 డాల‌ర్ల‌కు చేరుకుంది. ఏప్రిల్ డెలివరీ కోసం అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 2.7 శాతం పెరిగి ఔన్సుకు 5,067 డాల‌ర్ల వ‌ద్ద ట్రేడ్ అయ్యింది. వెండి సైతం బ‌ల‌ప‌డింది. స్పాట్ సిల్వ‌ర్ 2.1శాతం పెరిగి ఔన్స్‌కు 86.92కి చేరింది. గత గురువారం గోల్డ్ ఔన్సుకు 121.64 డాల‌ర్ల వ‌ద్ద రికార్డు గరిష్ట స్థాయి నుంచి ప్ర‌స్తుతం 28శాతం త‌క్కువ‌గా ట్రేడ‌వుతోంది.

ఇటీవ‌ల దేశీయ మార్కెట్‌లో బంగారం రూ.1.80ల‌క్ష‌లు దాటింది. బంగారం ధ‌ర‌లు జీవ‌న‌కాల గ‌రిష్టానికి చేరుకోవ‌డంతో లాభాల స్వీక‌ర‌ణ‌కు మొగ్గుచూప‌డంతో ధ‌ర‌లు విప‌రీతంగా త‌గ్గుతూ వ‌చ్చాయి. దాంతో ప‌సిడి కొనుగోలుదారులు ఊర‌ట పొందారు. అయితే, బంగారంపై పెట్టుబ‌డుల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ధ‌ర‌లు హెచ్చుత‌గ్గుల‌కు గుర‌వుతున్న నేప‌థ్యంలో.. నిశితంగా ప‌రిశీలించాల‌ని చెబుతున్నారు. గ‌త‌వారంలో ధ‌ర‌లు భారీ ఎత్తున పెరుగుతూ రాగా.. ఆ త‌ర్వాత ప‌రిణామాల‌తో అదే స్థాయిలో ప‌త‌న‌మైన విష‌జ్ఞాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక త్వ‌ర‌లో పెళ్లిళ్ల సీజ‌న్ ప్రారంభం కానున్న‌ది. ఈ క్ర‌మంలో బంగారం, వెండికి డిమాండ్ పెరిగే అవ‌కాశం ఉంద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

Advertisement
Advertisement