త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Honey Trap and Cyber Blackmailing | అమ్మాయిలా చాటింగ్ చేస్తాడు.. చెల్లెలితో ఫిర్యాదు చేయిస్తాన‌ని బెదిరిస్తాడు.. ల‌క్ష‌లు కాజేసిన‌ నిందితుడు ఎవ‌రంటే!

Honey Trap and Cyber Blackmailing | హ‌నీ ట్రాప్‌, సైబ‌ర్ బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్న ఘ‌రానా మోస‌గాడిని పోలీసులు వ‌ల ప‌న్ని ప‌ట్టుకున్నారు.

S

Hyderabad | Published On Oct 19, 2026, 6.15 pm IST

Honey Trap and Cyber Blackmailing | అమ్మాయిలా చాటింగ్ చేస్తాడు.. చెల్లెలితో ఫిర్యాదు చేయిస్తాన‌ని బెదిరిస్తాడు.. ల‌క్ష‌లు కాజేసిన‌ నిందితుడు ఎవ‌రంటే!
Advertisement

Honey Trap and Cyber Blackmailing | త్రినేత్ర న్యూస్: హ‌నీ ట్రాప్‌ (Honey Trap), సైబ‌ర్ బ్లాక్‌మెయిలింగ్  (Cyber Blackmailing) చేస్తున్న ఘ‌రానా మోస‌గాడిని పోలీసులు వ‌ల ప‌న్ని ప‌ట్టుకున్నారు. కోల్‌క‌తాకు చెందిన చంద‌న అనే అమ్మాయి ఫొటోల‌ను ఉప‌యోగిస్తూ న‌కిలీ ఇన్‌స్టా (Instagram), ఫేస్‌బుక్ (Facebook) ఐడీలు సృష్టిస్తూ అమ్మాయిల‌ను మోసం చేస్తున్న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా టేకుల‌ప‌ల్లి మండ‌లం ముత్యాలంపాడు ఎక్స్‌రోడ్‌కు చెందిన కొండ‌బ‌త్తుల ప‌వ‌న్ కుమార్‌ (Pawankumar)ను పోలీసులు సోమ‌వారం అరెస్టు చేశారు. ఎంత‌మందిని మోసం చేశాడంటే..

చార్మినార్ జోన్‌ డిప్యూటీ కమిషనర్ ఖేర్ కిరణ్ ప్రభాకర్ వివ‌రాల ప్ర‌కారం.. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాకు చెందిన‌ కె. సదానందం (డ్రైవర్), కె. అరుణ దంప‌తుల కుమారుడు కొండ‌బ‌త్తుల ప‌వ‌న్‌కుమార్ హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధిలోని బాలాజీన‌గ‌ర్‌లో నివాసం ఉంటున్నాడు. హైదరాబాద్ బాలానగర్‌లోని సీఐటీడీ (CITD)లో డిప్లొమా కోర్సును మధ్యలోనే ఆపివేశాడు. కానీ మల్లారెడ్డి కాలేజీలో బి.టెక్ చదువుతున్నట్లు తన తల్లిదండ్రులను నమ్మించాడు. 2023లో బషీర్‌బాగ్‌లోని స్టార్ పవర్జ్ డీజీ లోన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 2 నెలలు, 2024లో నానక్‌రామ్‌గూడలోని కపిల్ చిట్ ఫండ్స్‌లో 3 నెలలు పనిచేశాడు. ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్నాడు.

నిందితుడు పవన్ కుమార్ అమ్మాయిల పేర్లతో నకిలీ ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతాలను సృష్టిస్తాడు. ఈ ఖాతాల ద్వారా వివిధ వ్యక్తులకు ఫ్రెండ్/ఫాలో రిక్వెస్ట్‌లు పంపి, వారితో అమ్మాయిలా చాటింగ్ ప్రారంభించి, క్రమంగా లైంగిక సంభాషణల (Sexual chats) వైపు మళ్లిస్తాడు. ఆ తర్వాత ఇతరుల నగ్న చిత్రాలను పంపి, బాధితుల నుంచి కూడా వారి నగ్న ఫోటోలను సేకరిస్తాడు. ఇలా సేకరించిన నగ్న ఫోటోలు, వీడియోలను తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్లలో, ఇతర సోషల్ మీడియా ఖాతాలలో భద్రపరుస్తాడు.

తరువాత, ఆ "అమ్మాయి" పవన్‌ను తన అన్నయ్యగా బాధితులకు పరిచయం చేస్తుంది. ఆ రకంగా పవన్ రంగంలోకి దిగి కాల్స్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా బాధితులను సంప్రదిస్తాడు. కొందరిని వ్యక్తిగతంగా కూడా కలుస్తాడు. బాధితుల నగ్న ఫోటోలు, వీడియోలను చూపిస్తూ, తన "చెల్లెలి"తో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయిస్తానని భయపెట్టి, బెదిరించి భారీగా డబ్బు వసూలు (Extortion) చేస్తాడు. నిందితుడు తన నకిలీ ఖాతాలలో ఎక్కువగా కోల్‌కతాకు చెందిన "చందన" అనే అమ్మాయి ఫోటోలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించాం. సదరు అమ్మాయిని సంప్రదించి, ఆమె పని ప్రదేశం, కోల్‌కతాలోని స్థానిక పోలీస్ స్టేషన్ ద్వారా ఆమెను అప్రమత్తం చేశాం.

ఎంత‌మందిని ట్రాప్‌ చేశాడంటే..

నిందితుడి వద్ద డిప్లొమా చదివిన ఒక స్నేహితుడు కూడా ఇదే రీతిలో హనీ ట్రాప్‌కు గురికాగా, అతని నుండి రూ. 4 లక్షలు వసూలు చేశాడు. పెట్టుబడులపై అధిక లాభాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రూ. 7 లక్షల వరకు మోసం చేశాడు. బషీర్‌బాగ్‌లోని డీజీ లోన్స్ - స్టార్ పవర్జ్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నప్పుడు, జీతం ముందుగానే (Salary advance) రూ.16,000 తీసుకుని కంపెనీకి చెప్పకుండా మాయమయ్యాడు. మరో ఇద్దరు అపరిచిత వ్యక్తుల నుండి వరుసగా రూ. 6.8 లక్షలు, రూ. 7 లక్షలు వసూలు చేశాడు. నిందితుడి వ‌ద్ద నుంచి హెచ్‌పీ (HP) ల్యాప్‌టాప్, వీఎమ్ పెన్‌డ్రైవ్ (16 GB) స్వాధీనం చేసుకున్నాం. నిందితుడిపై 358/2026, బీఎన్‌ఎస్ (BNS) సెక్షన్లు 308(7), 351(2), ఐటీ యాక్ట్ (IT Act) సెక్షన్లు 66C, 66D, 66E, 67A ల కింద కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసు అధికారులు తెలిపారు..

నకిలీ ఇన్‌స్టా ఐడీలు (13)

1. Priyanka 11243, 2) Aamer 531, 3) K.Chandanasri, 4) K_Chandana_sri_21, 5) Chandana_Princes_2021, 6) Chandana_sri_445, 7) chinnu223558, 8) deekshitha_princes_2021, 9) moon_baby_5973, 10) Kanna_ya1024, 11) Misalgunjan, 12) Kondabathula_Pavan_2324, 13) Kondabathulasadanandam.

నకిలీ ఫేస్‌బుక్ ఐడీలు (14)

1.Chandana Angel, 2) K. Chandana Sri, 3) Chandana Sri, 4) Honey kana potti, 5) Ayisha Potti, 6) Chandana Prince. S, 7) Sri K Chandana, 8) A. Keerthi, 9) Chandana K, 10) Dharawath Swati, 11) Vijay Kumar, 12) K. Pawan Shiva, 13) Bhukya Anil, 14) Divya Sri.
- వాట్సాప్ ఖాతాలు (2): 8106140763 & 9949740085
- ఉపయోగించిన మొబైల్ నంబర్లు (3): 7981142493, 9949740085 మరియు 8106140763

1000 మంది బాధితులు.. ఇత‌ర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా

బెదిరించి రూ. 18,00,000, మోసం చేసి రూ. 7,16,000 సొమ్ము వ‌సూలు చేశాడు. కొత్త‌గూడెంలో త‌న పేరు మీద యూనియ‌న్ బ్యాంక్‌లో ఖాతా తెరిచాడు. హైద‌రాబాద్ ప‌రిధిలోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లో త‌న తండ్రి పేరిట ఉన్న‌ ఫెడరల్ బ్యాంక్ ఖాతా, టేకులపల్లిలో ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాను వాడుతున్నాడు. 1000 మందికి పైగా బాధితులు నిందితుడితో చాటింగ్ చేశారు. 82 మంది బాధితులు నగ్న ఫొటోలు/వీడియోలు పంపారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ నుంచి 24 మంది బాధితులు ఉన్నారు. దుబాయ్, టర్కీ, పాకిస్తాన్, కెనడా నుంచి 9 మంది ఉన్నారు. వీరిలో డాక్టర్లు, వ్యాపారవేత్తలు, లెక్చరర్లు, ప్రైవేట్ ఉద్యోగులు, డెలివరీ బాయ్స్, గిగ్ డ్రైవర్లు ఉన్నారు.

చార్మినార్ జోన్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఎం.డి. మజీద్, సైదాబాద్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ సోమ వెంకట్ రెడ్డిల పర్యవేక్షణలో ద‌ర్యాప్తు జ‌రిగిన‌ట్లు ఖేర్ కిరణ్ ప్రభాకర్ తెలిపారు.

Advertisement
Advertisement