EPFO | ఈపీఎఫ్ ఖాతాల్లో నగదు జమ.. 8.25 శాతం వడ్డీ.. ఇలా చెక్ చేసుకోండి..
EPFO | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈపీఎఫ్ వడ్డీ మొత్తాన్ని ఖాతాదారుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. గత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 8.25 శాతం వడ్డీ రేటును ఆమోదించడంతో, ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఈ వడ్డీ ఎప్పుడు జమ అవుతుందా అని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.
EPFO | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈపీఎఫ్ వడ్డీ మొత్తాన్ని ఖాతాదారుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. గత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 8.25 శాతం వడ్డీ రేటును ఆమోదించడంతో, ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఈ వడ్డీ ఎప్పుడు జమ అవుతుందా అని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రక్రియ ప్రారంభమైంది. ఈపీఎఫ్ సభ్యుల్లో చాలా మందికి వడ్డీ జమ అయినట్లు ఎస్‌ఎంఎస్‌లు అందుతున్నాయి. ఆ సందేశాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ మొత్తం వారి ఈపీఎఫ్ ఖాతాకు బదిలీ చేసినట్లు పేర్కొంటున్నారు. అయితే ఎస్‌ఎంఎస్ వచ్చిన వెంటనే ఈపీఎఫ్ ఖాతాలో కొత్త బ్యాలెన్స్ కనిపించదు. ప్రస్తుతం కోట్లాది మంది సభ్యుల ఖాతాలను ఈపీఎఫ్‌వో అప్‌డేట్ చేస్తుండటంతో, వడ్డీ ఎంట్రీ కనిపించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
రూ.1.44 లక్షల కోట్ల వార్షిక వడ్డీ..
ఈసారి సుమారు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాలకు రూ.1.44 లక్షల కోట్ల వార్షిక వడ్డీని ఈపీఎఫ్‌వో బదిలీ చేయాల్సి ఉంది. గతేడాదితో పోలిస్తే ఈసారి వడ్డీ జమ ప్రక్రియ వేగంగా పూర్తవుతోంది. దీనికి ప్రధాన కారణం ఈపీఎఫ్‌వో ప్రవేశపెట్టిన కొత్త సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సిస్టమ్ (సైట్స్) ప్లాట్‌ఫామ్. ఈ వ్యవస్థతో వడ్డీ జమ ప్రక్రియ మరింత ఆటోమేటెడ్‌గా మారింది. సభ్యులు తమ ఈపీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ అయిందో లేదో తెలుసుకోవడానికి ఈపీఎఫ్‌వో మెంబర్ పాస్‌బుక్ పోర్టల్‌లో లాగిన్ కావాలి. ఇందుకోసం యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్ అవసరం. లాగిన్ అయిన తర్వాత వ్యూ పాస్‌బుక్ ఆప్షన్ ను ఎంచుకుంటే, ఈపీఎఫ్ బ్యాలెన్స్‌తోపాటు వడ్డీ జమ అయిన ఎంట్రీ కూడా కనిపిస్తుంది.
దశలవారీగా అప్‌డేట్..
ఒకవేళ ఖాతాలో వెంటనే వడ్డీ ఎంట్రీ కనిపించకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్‌వో సభ్యుల ఖాతాలను దశలవారీగా అప్‌డేట్ చేస్తోంది. అందువల్ల అన్ని ఖాతాల్లో వడ్డీ వివరాలు కనిపించడానికి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈపీఎఫ్ సభ్యులు ఉమాంగ్ యాప్ ద్వారా కూడా తమ బ్యాలెన్స్‌ను పరిశీలించవచ్చు. అయితే ప్రస్తుతం నిర్వహణ పనుల కారణంగా ఉమాంగ్ యాప్‌లో ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఫీచర్ తాత్కాలికంగా అందుబాటులో లేదు. కాగా ఈపీఎఫ్‌వో తన సభ్యులకు సంబంధించిన సేవలన్నింటినీ పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. అలాగే ఉపసంహరణ నిబంధనల్లో కూడా మార్పులు చేసింది. 2026 ఈపీఎఫ్ స్కీమ్ ప్రకారం సభ్యులు తమ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం బ్యాలెన్స్‌లో గరిష్టంగా 75 శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు

EPF | క్లెయిమ్ చేయని ఎల్ఐసీ, ఈపీఎఫ్ మొత్తాలు.. ఎల్ఐసీ వద్ద రూ.16వేల కోట్లు.. కేంద్రం కీలక ప్రకటన..
జులై 21, 2026

EPFO | కొత్త ఈపీఎఫ్‌వో వ్యవస్థలో వచ్చిన 13 మార్పులు ఇవే.. ఏమేం సదుపాయాలు అందుబాటులో ఉన్నాయంటే..?
జులై 13, 2026

EPFO | ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి..
జులై 11, 2026
తాజావార్తలు
- ●Ponnam PRabhakar | రోజుకు 12 వేల వాటర్ ట్యాంకర్ల డిమాండ్.. ఇదీ హైదరాబాద్ పరిస్థితి
- ●Dharmendra Pradhan Resignation | "ఇది దేశ యువత విజయం.. అహంకారంపై సాధించిన గెలుపు": ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్
- ●Dasoju Sravan Kumar | జ్ఞాన సమాజం రోడ్డెక్కితే.. ఎంతటి అహంకారమైనా మోకరిల్లాల్సిందే
- ●CJP Protest | ఫేక్ అకౌంట్లతో జంతర్‌మంతర్ నిరసనపై తప్పుడు ప్రచారం.. పాక్‌కూ లింకులు: ఢిల్లీ పోలీసులు
- ●iQOO Z11 Lite | ఐక్యూ జడ్11 లైట్ 5జి వచ్చేసింది.. 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో..
- ●Harish Rao | యువతకు ఇది ఒక గొప్ప విజయం.. నిజంగానే దేశంలో మార్పు : హరీశ్‌రావు

Ponnam PRabhakar | రోజుకు 12 వేల వాటర్ ట్యాంకర్ల డిమాండ్.. ఇదీ హైదరాబాద్ పరిస్థితి

Dharmendra Pradhan Resignation | "ఇది దేశ యువత విజయం.. అహంకారంపై సాధించిన గెలుపు": ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్

Dasoju Sravan Kumar | జ్ఞాన సమాజం రోడ్డెక్కితే.. ఎంతటి అహంకారమైనా మోకరిల్లాల్సిందే

CJP Protest | ఫేక్ అకౌంట్లతో జంతర్‌మంతర్ నిరసనపై తప్పుడు ప్రచారం.. పాక్‌కూ లింకులు: ఢిల్లీ పోలీసులు



