December 2026 Rules | డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఏమేం మారనున్నాయి..?
December 2026 Rules | డిసెంబర్ నెల నుంచి సామాన్యులు, పెట్టుబడిదారులు, పెన్షనర్ల ఆర్థిక వ్యవహారాలపై పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఛార్జీల పెంపు, కమోడిటీ ట్రేడింగ్ మార్జిన్లలో మార్పులు, విదేశీ పెట్టుబడిదారులకు డిజిటల్ కేవైసీ వెసులుబాటు, ఆధార్ ఈ-మెయిల్ అప్‌డేట్ ఉచితం వంటి నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ గడువును కూడా గుర్తుంచుకోవాలి.
December 2026 Rules | డిసెంబర్ నెల నుంచి సామాన్యులు, పెట్టుబడిదారులు, పెన్షనర్ల ఆర్థిక వ్యవహారాలపై పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఛార్జీల పెంపు, కమోడిటీ ట్రేడింగ్ మార్జిన్లలో మార్పులు, విదేశీ పెట్టుబడిదారులకు డిజిటల్ కేవైసీ వెసులుబాటు, ఆధార్ ఈ-మెయిల్ అప్‌డేట్ ఉచితం వంటి నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ గడువును కూడా గుర్తుంచుకోవాలి.
ఎస్‌బీఐ కార్డుదారులకు ఛార్జీలు..
డిసెంబర్ 1 నుంచి ఆర్థిక రంగంలో పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఎస్‌బీఐ కార్డు వినియోగదారులు రూ.30 వేలకుపైగా చేసే వ్యక్తిగత రవాణా లావాదేవీలపై 1 శాతం ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్ 27న కార్డు సంస్థ జారీ చేసిన నోటీసు ప్రకారం ఈ మార్పు అమల్లోకి వస్తుంది. ఇంధన లావాదేవీల విషయంలో ఒక బిల్లింగ్ సైకిల్‌లో ఖర్చు రూ.50 వేలు దాటితే మొత్తం ఇంధన ఖర్చుపై 1 శాతం ఛార్జీతోపాటు వర్తించే పన్నులు విధిస్తారు. ఉదాహరణకు రూ.60 వేల ఇంధన కొనుగోళ్లు చేస్తే అదనంగా రూ.600 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) డిసెంబర్ 1 నుంచి కమోడిటీ డెరివేటివ్స్ ట్రేడింగ్‌కు కొత్త కనీస ఇనిషియల్ మార్జిన్ నిబంధనలను అమలు చేయనుంది.
తక్కువ ఒడిదుడుకులు ఉండే కమోడిటీలకు 6 శాతం, మధ్యస్థ ఒడిదుడుకులు ఉండే కమోడిటీలకు 8 శాతం, అధిక ఒడిదుడుకులు ఉండే కమోడిటీలకు 10 శాతం మార్జిన్ నిర్ణయించింది. రిస్క్‌కు సంబంధించిన కనీస మార్జిన్ వ్యవధి తక్కువ, మధ్యస్థ ఒడిదుడుకుల కమోడిటీలకు రెండు రోజులు, అధిక ఒడిదుడుకుల కమోడిటీలకు మూడు రోజులుగా ఉంటుంది. దీంతో ట్రేడర్లు బ్రోకర్ల వద్ద నిర్వహించాల్సిన నిధులపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
విదేశీయులకు సులభంగా కేవైసీ..
డిసెంబర్ 3 నుంచి అర్హత కలిగిన ఎన్నారైలు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ), ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) నిబంధనలకు అనుగుణంగా ఉన్న దేశాల్లో నివసించే విదేశీయులు సెబీ రిజిస్టర్డ్ సంస్థల ద్వారా రిమోట్ పద్ధతిలో కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఈ వెసులుబాటును సెబీ ఆగస్టు 14న ప్రకటించింది. ఇక ఆధార్ వినియోగదారులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) మరో అవకాశం కల్పించింది. అధికారిక ఆధార్ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ-మెయిల్ అడ్రస్ అప్‌డేట్ చేసుకునేందుకు విధించే రూ.75 రుసుమును డిసెంబర్ 31 వరకు మాఫీ చేసింది. ఈ మినహాయింపు జూలై 1 నుంచి ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది. అయితే ఇతర ఆధార్ వివరాల మార్పులకు ఇది వర్తించదు.
పెన్షనర్లకు గడువు..
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు నవంబర్ 30లోగా వార్షిక లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి. గడువులోగా సమర్పించకపోతే పెన్షన్ చెల్లింపుల్లో ఆలస్యం లేదా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సదుపాయం లేదా ఇతర అనుమతించిన మార్గాల ద్వారా దీనిని సమర్పించవచ్చు. మరోవైపు, ఆన్‌లైన్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దుకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) చేసిన సవరణ కూడా పరిశీలించాల్సిన కీలక మార్పుల్లో ఒకటి. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ సమావేశం డిసెంబర్ 2 నుంచి 4 వరకు జరగనుంది. ఈ సమావేశంలో రెపో రేటుపై తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. ముఖ్యంగా ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లకు అనుసంధానమైన రుణాలు తీసుకున్నవారిపై వడ్డీ రేట్ల నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది.
తాజావార్తలు
- ●M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..
- ●MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు
- ●Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు
- ●Crime News | అండదానం ముసుగులో అక్రమ నెట్వర్క్!
- ●Dy CM Bhatti Vikramarka | తెలంగాణ విద్యుత్ రంగానికి కేంద్రం సహకరించాలి
- ●DGP CV Anand | పెట్రోలింగ్ పెంచండి.. ఆస్తి నేరాలకు చెక్ పెట్టండి

M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..

MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు

Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు

Crime News | అండదానం ముసుగులో అక్రమ నెట్వర్క్!



