Crude Oil | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు.. భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు..!
Crude Oil | పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలపై పడుతున్నాయి. గత పక్షం రోజుల్లో క్రూడాయిల్ ధరలు 40శాతానికిపైగా పెరగాయి. ఈ క్రమంలో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Crude Oil | పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలపై పడుతున్నాయి. గత పక్షం రోజుల్లో క్రూడాయిల్ ధరలు 40శాతానికిపైగా పెరగాయి. ఈ క్రమంలో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆసియా దేశాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్-యూఎస్ దాడులకు ముందు ఫిబ్రవరి 27న అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ క్రూడాయిల్ ధర సుమారు 73 డాలర్లుగా ఉంది. అయితే, శనివారం నాటికి ధర 103 డాలర్లకు చేరింది. అంటే కేవలం 15 రోజుల్లోనే బ్యారెల్‌కు 30 డాలర్లకుపైగా పెరిగింది. దాదాపుగా 41.1శాతం పెరుగుదల నమోదైంది.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు ఇరాన్ సైనిక స్థావరాలు, కీలక నేతలు లక్ష్యంగా చేసుకొని విస్తృత దాడులు చేపట్టాయి. ఈ పరిణామాలతో ప్రపంచ ఇంధన సరఫరాలపై మార్కెట్లలో ఆందోళనలు మరింత పెరిగాయి. పశ్చిమ ఆసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే అంతర్జాతీయ మార్కెట్లపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే వారం మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశముందని ఎన్‌రిచ్ మనీ సంస్థ సీఈవో పొన్ముడి ఆర్ పేర్కొన్నారు. ఈ వివాదానికి సంబంధించిన పరిణామాలపై పెట్టుబడిదారులు దగ్గరగా పరిశీలిస్తారన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు మరింత తీవ్రతరమయ్యే దిశగా వెళ్తాయా? లేదంటే పరిష్కారం దిశగా అడుగులు వేస్తారా? అనే అంశం వచ్చేవారం మార్కెట్ దిశను నిర్ణయిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ ఘర్షణ ప్రభావం కేవలం ముడి చమురు ధరలకే పరిమితం కాదని, గ్లోబల్ బాండ్ ఈల్డ్స్, కరెన్సీ మార్కెట్స్, పెట్టుబడిదారుల రిస్క్ తీసుకునే ట్రెండ్స్‌పై కూడా ప్రభావం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచంలో అత్యంత కీలక ఇంధన సరఫరా మార్గాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన హార్ముజ్ జలసంధిపై మార్కెట్ దృష్టి కేంద్రీకృతమైంది. ఈ మార్గం ద్వారా చమురు, గ్యాస్ రవాణాకు ఎక్కువకాలం అంతరాయం కలిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా తగ్గే ప్రమాదం ఉంనది నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంగా ఆసియా దేశాల్లో ద్రవ్యోల్బణ అంచనాలు పెరిగే అవకాశముండగా, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






