త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Budget 2026 | బడ్జెట్ 2026: యువశక్తి, మూడు కర్తవ్యాల స్ఫూర్తితో.. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ 'యువశక్తి' చోదక శక్తిగా రూపొందిందని, దేశాభివృద్ధికి 3 ప్రధాన కర్తవ్యాలను (Kartavyas) లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు. బడ్జెట్ ముఖ్యాంశాలు ఇవే.

J

Business | Published On Feb 1, 2026, 11.20 am IST

Union Budget 2026 | బడ్జెట్ 2026: యువశక్తి, మూడు కర్తవ్యాల స్ఫూర్తితో.. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం
Advertisement

Union Budget 2026 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రధానంగా 'యువశక్తి' (Yuva Shakti) చోదక శక్తిగా రూపొందించబడిందని ఆమె తెలిపారు. దేశంలో నిర్మాణాత్మక సంస్కరణలను (Structural Reforms) వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 3 కీలక 'కర్తవ్యాలను' (3 Kartavyas) నిర్దేశించుకుందని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు.

నిర్మాణాత్మక సంస్కరణల కోసం 3 కర్తవ్యాలు

వృద్ధిని వేగవంతం చేయడం, నిలబెట్టడం: ఆర్థికాభివృద్ధి వేగాన్ని పెంచడంతో పాటు, ఆ వృద్ధిని దీర్ఘకాలం పాటు కొనసాగించడం.

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం: కుటుంబాలు, పౌరుల ఆశయాలను నెరవేరుస్తూ, వారిని దేశాభివృద్ధిలో బలమైన భాగస్వాములుగా తీర్చిదిద్దడం.

సబ్ కా సాత్, సబ్ కా వికాస్: ప్రతి కుటుంబం, ప్రతి వర్గం, ప్రతి ప్రాంతానికి వనరులు, సౌకర్యాలు అందేలా చూడటం.

బడ్జెట్ 2026 ప్రసంగం - ముఖ్యాంశాలు

నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా ఆమె భారత ఆర్థిక శక్తి గురించి మట్లాడారు.

ఆర్థిక స్థిరత్వం: భారతదేశ ఆర్థిక ప్రయాణం స్థిరమైన వృద్ధి (Stability Growth), మితమైన ద్రవ్యోల్బణంతో (Moderate Inflation) సాగుతోంది.

మాటలు కాదు, చేతలే ముఖ్యం: ప్రభుత్వం కేవలం వాగ్దానాలకే పరిమితం కాకుండా, సంస్కరణలు, ఆచరణాత్మక నిర్ణయాల వైపు మొగ్గు చూపింది.

ఆత్మవిశ్వాసంతో ముందడుగు: భారత్ ఇకపై కూడా బలమైన ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది.

స్థూల ఆర్థిక స్థిరత్వం: ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు దేశంలో బలమైన స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని (Macroeconomic Stability) ఏర్పరిచాయి.

ప్రపంచ మార్కెట్లతో అనుసంధానం: భారతదేశం ప్రపంచ మార్కెట్లతో లోతుగా మమేకమై ఉండాలని, ఆ దిశగా చర్యలు కొనసాగుతాయని మంత్రి పేర్కొన్నారు.

Advertisement
Advertisement