త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BitChat | బ్లూటూత్ మెసేజింగ్ యాప్‌ బిట్‌చాట్‌పై కేంద్రం చర్యలు.. ప్లే స్టోర్ నుంచి అవుట్‌..!

BitChat | బ్లూటూత్‌ ఆధారిత మెసేజింగ్‌ యాప్‌ ‘బిట్‌చాట్‌’పై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకున్నట్లు సమాచారం. భద్రత, శాంతిభద్రతల అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో భారత్‌లో గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి బిట్‌చాట్‌ తొలగించినట్లు తెలుస్తోంది.

P

Business | Published On Oct 6, 2026, 8.23 pm IST

BitChat | బ్లూటూత్ మెసేజింగ్ యాప్‌ బిట్‌చాట్‌పై కేంద్రం చర్యలు.. ప్లే స్టోర్ నుంచి అవుట్‌..!
Advertisement

BitChat | బ్లూటూత్‌ ఆధారిత మెసేజింగ్‌ యాప్‌ ‘బిట్‌చాట్‌’పై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకున్నట్లు సమాచారం. భద్రత, శాంతిభద్రతల అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో భారత్‌లో గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి బిట్‌చాట్‌ తొలగించినట్లు తెలుస్తోంది. దేశంలో శాంతిభద్రతలు, అంతర్గత భద్రతకు ప్రాధాన్యమివ్వడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బిట్‌చాట్‌ వినియోగంపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నాయి.

బిట్‌చాట్‌ అంటే?

సాధారణ మెసేజింగ్‌ యాప్‌లకు భిన్నంగా బిట్‌చాట్‌ పనిచేస్తుంది. వాట్సాప్‌ వంటి సంప్రదాయ మెసేజింగ్‌ యాప్‌లు సందేశాలను పంపేందుకు ఇంటర్నెట్‌పై ఆధారపడతాయి. అయితే బిట్‌చాట్‌ సమీపంలోని పరికరాల మధ్య బ్లూటూత్‌ వంటి వైర్‌లెస్‌ టెక్నాలజీ ద్వారా సందేశాలను పంపేందుకు వీలు కల్పిస్తుంది. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ అందుబాటులో లేని పరిస్థితుల్లో లేదా దానిపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించాల్సిన సందర్భాల్లో ఇలాంటి సాంకేతికత ఉపయోగపడుతుంది. బిట్‌చాట్‌ను శాంతిభద్రతలకు సంబంధించిన సంభావ్య ముప్పుగా గుర్తించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌లపై తక్కువ ఆధారపడే ఇలాంటి యాప్‌ల ద్వారా సంప్రదాయ ఆన్‌లైన్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థలకు భిన్నంగా సందేశాలు పంపే అవకాశం ఉంటుంది. దీంతో సాంకేతికతతో పాటు దాని దుర్వినియోగం, శాంతిభద్రతలపై పడే ప్రభావంపైనా ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం.

ఇంటర్నెట్‌ లేకుండానే మెసేజింగ్‌ ఎలా?

బిట్‌చాట్‌ వంటి యాప్‌ల ప్రత్యేకత సమీపంలోని పరికరాల మధ్య బ్లూటూత్‌ ఆధారిత కమ్యూనికేషన్‌. సాధారణ మెసేజింగ్‌ యాప్‌లకు ఇంటర్నెట్‌ అవసరం కాగా.. బ్లూటూత్‌ ఆధారిత వ్యవస్థలో సమీపంలోని పరికరాల మధ్య నేరుగా సమాచారాన్ని మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదే సాంకేతిక ప్రయోజనం మరోవైపు భద్రత, పర్యవేక్షణ, శాంతిభద్రతలకు సంబంధించిన ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. అయితే, భారత్‌లో యాప్‌ను యాప్‌ స్టోర్ల నుంచి తొలగించడానికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు బహిరంగంగా వెల్లడించలేదు. యాప్‌ అందుబాటుపై పరిస్థితి, ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలపై ప్రస్తుతం స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement