Bank Holidays December 2026 | డిసెంబర్‌లో 17 రోజులు బ్యాంకులకు సెలవులు.. పూర్తి జాబితా ఇదే..
Bank Holidays December 2026 | డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. క్రిస్మస్, ప్రాంతీయ పండుగలు, ఇతర ప్రత్యేక దినాలతోపాటు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కలిపి మొత్తం 17 తేదీల్లో ఏదో ఒక ప్రాంతంలో బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ 17 రోజులు బ్యాంకులు మూసి ఉండవు. రాష్ట్రాన్ని బట్టి సెలవుల సంఖ్య మారుతుంది.
Bank Holidays December 2026 | డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. క్రిస్మస్, ప్రాంతీయ పండుగలు, ఇతర ప్రత్యేక దినాలతోపాటు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కలిపి మొత్తం 17 తేదీల్లో ఏదో ఒక ప్రాంతంలో బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ 17 రోజులు బ్యాంకులు మూసి ఉండవు. రాష్ట్రాన్ని బట్టి సెలవుల సంఖ్య మారుతుంది.
ఏయే రాష్ట్రాల్లో సెలవులు ఎలా ఉన్నాయి..?
డిసెంబర్ నెలలో బ్యాంకు పనులు ఉన్నవారు ముందుగానే ప్రణాళిక చేసుకోవడం మంచిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెలవుల వివరాల ప్రకారం, డిసెంబర్ 1న అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లో స్థానిక దినోత్సవాల సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. డిసెంబర్ 3న గోవాలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో సిక్కింలో లోసూంగ్, నామ్‌సూంగ్ పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. డిసెంబర్ 12 రెండో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి. అదే రోజు మేఘాలయలో పా టోగన్ నెంగ్మిన్జా సంగ్మా వర్ధంతి కూడా ఉంది. డిసెంబర్ 18న మేఘాలయలో యూ సోసో థామ్ వర్ధంతి, డిసెంబర్ 19న గోవా విమోచన దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
క్రిస్మస్ సందర్భంగా సెలవులు ఇవే..
డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇక అదే రోజు స్టాక్ మార్కెట్లకు సైతం సెలవు ఉంటుంది. డిసెంబర్ 26 నాలుగో శనివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. కొన్ని రాష్ట్రాల్లో క్రిస్మస్‌కు సంబంధించిన ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. డిసెంబర్ 30న మేఘాలయలో యూ కియాంగ్ నంగ్బా వర్ధంతి, డిసెంబర్ 31న మిజోరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. వీటితో పాటు డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో ఆదివారం కావడంతో అన్ని రాష్ట్రాల్లో బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సెలవులు ఉన్నాయి..?
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అదేవిధంగా డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో ఆదివారాలు, డిసెంబర్ 12న రెండో శనివారం, డిసెంబర్ 26న నాలుగో శనివారం కావడంతో బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి. అంటే ఈ రెండు రాష్ట్రాల్లో సాధారణంగా మొత్తం ఏడు రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే స్థానిక పరిస్థితులు, ప్రత్యేక ప్రభుత్వ ప్రకటనల ఆధారంగా అదనపు సెలవులు ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకు శాఖలకు వెళ్లి చెక్కుల క్లియరెన్స్, నగదు లావాదేవీలు, ఇతర ముఖ్యమైన పనులు చేసుకోవాలనుకునేవారు ముందుగానే ప్రణాళిక చేసుకోవాలి. సెలవు రోజుల్లోనూ ఏటీఎంలు, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
- ●DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..
- ●Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!
- ●M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..
- ●MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు
- ●Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు
- ●Crime News | అండదానం ముసుగులో అక్రమ నెట్వర్క్!

DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..

Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!

M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..

MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు




