త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suzuki E-Access | ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే 95 కిలోమీట‌ర్ల మైలేజీ.. సుజుకి నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌..

Suzuki E-Access | దేశంలో రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహ‌నాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి పెరుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అనేక కంపెనీలు ఇప్పటికే ప‌లు టూవీల‌ర్ల‌తోపాటు కార్ల‌ను కూడా త‌యారు చేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చాయి. ఎప్ప‌టిక‌ప్పుడు నూత‌న మోడ‌ల్స్‌ను ప్ర‌వేశ‌పెడుతూనే ఉన్నాయి.

S

Automobiles | Published On Jan 10, 2026, 11.41 am IST

Suzuki E-Access | ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే 95 కిలోమీట‌ర్ల మైలేజీ.. సుజుకి నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌..
Advertisement

Suzuki E-Access | దేశంలో రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహ‌నాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి పెరుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అనేక కంపెనీలు ఇప్పటికే ప‌లు టూవీల‌ర్ల‌తోపాటు కార్ల‌ను కూడా త‌యారు చేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చాయి. ఎప్ప‌టిక‌ప్పుడు నూత‌న మోడ‌ల్స్‌ను ప్ర‌వేశ‌పెడుతూనే ఉన్నాయి. అయితే సుజుకి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ల‌ను విడుద‌ల చేయ‌లేదు. కానీ తాజాగా త‌న తొలి ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను మాత్రం భార‌త మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. ఇ-యాక్సెస్ పేరిట సుజుకి కంపెనీ ఈ స‌రికొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను లాంచ్ చేసింది. ఇందులో ప‌లు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. న‌గ‌రాలు లేదా ప‌ట్ట‌ణాల్లో రోజూ టూవీల‌ర్లపై ప్ర‌యాణం చేసేవారికి ఈ స్కూట‌ర్ ఎంతో ఉప‌యోగంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

ఎక్స్ షోరూం ధ‌ర ఎంతంటే..?

సుజుకి ఇ-యాక్సెస్ స్కూట‌ర్‌ను ప‌లు భిన్న ర‌కాల క‌ల‌ర్ ఆప్ష‌న్లలో లాంచ్ చేశారు. ఈ స్కూట‌ర్‌ను పెర‌ల్ జేడ్‌ గ్రీన్, మెటాలిక్ మ్యాట్ ఫైబ్రాయిన్ గ్రే, మెటాలిక్ మ్యాట్ బ్లాక్,మెటాలిక్ మ్యాట్ బోర్డో రెడ్‌, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర‌ల్ గ్రేస్ వైట్ రంగుల్లో ఈ స్కూట‌ర్‌ను లాంచ్ చేశారు. ఈ స్కూట‌ర్‌కు చెందిన ఎక్స్‌-షోరూం ధ‌ర‌ను రూ.1.88 ల‌క్ష‌లుగా నిర్ణ‌యించారు. మార్కెట్‌లో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న చాలా వ‌ర‌కు ప్రీమియం ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు ఈ స్కూట‌ర్ గ‌ట్టి పోటీనిస్తుంద‌ని సుజుకి కంపెనీ చెబుతోంది. బిల్డ్ క్వాలిటీ, బ్యాట‌రీ టెక్నాల‌జీ ప్ర‌ధానాంశాలుగా ఈ స్కూట‌ర్‌ను రూపొందించామ‌ని, క‌నుక క్వాలిటీ విష‌యంలో రాజీ ప‌డే ప్ర‌సక్తే లేద‌ని సుజుకి తెలిపింది.

95 కిలోమీట‌ర్ల మైలేజీ..

కాగా ఇ-యాక్సెస్ స్కూట‌ర్‌ను కొనుగోలు చేసిన అనంత‌రం దానికి అందించే స‌బ్సిడీ పోను రిజిస్ట్రేష‌న్ చార్జిలు, ఇత‌ర ఖర్చులు క‌లిపి స్కూట‌ర్ ధ‌ర మారుతుంది. ఇ-యాక్సెస్ స్కూట‌ర్‌లో లిథియం-అయాన్ బ్యాటరీని ఇచ్చారు. అందువ‌ల్ల ఎక్కువ సేపు బ్యాట‌రీ వ‌స్తుంది. ఒక్క‌సారి దీన్ని ఫుల్ చార్జింగ్ చేస్తే 95 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని కంపెనీ చెబుతోంది. ఈ స్కూట‌ర్‌లో 5.49 హెచ్‌పీ సామ‌ర్థ్యం ఉన్న మోటార్‌ను ఇచ్చారు. ఇది 15ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెగ్యుల‌ర్, ఫాస్ట్ చార్జింగ్ రెండు ఆప్ష‌న్ల‌కు కూడా ఈ స్కూట‌ర్ స‌పోర్ట్ చేస్తుండ‌డం విశేషం. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ఉండే ట్రాఫిక్‌ను అనుగుణంగా స్మూత్ రైడింగ్ ఇచ్చేలా ఈ స్కూట‌ర్ ను రూపొందించామ‌ని కంపెనీ తెలియజేసింది.

సుజుకి ఇ-యాక్సెస్ స్కూట‌ర్‌లో ప‌లు అధునాత సౌక‌ర్యాల‌ను అందిస్తున్నారు. పూర్తి స్థాయిలో డిజిట‌ల్ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌ను ఇచ్చారు. కీలెస్ స్టార్ట్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌కు యాప్ స‌హాయంతో క‌నెక్ట్ చేసుకుని అల‌ర్ట్స్‌ను పొంద‌వ‌చ్చు. కాగా సుజుకి ఇ-యాక్సెస్ స్కూట‌ర్ ప్ర‌స్తుతం అన్ని సుజుకి డీల‌ర్‌షిప్ కార్యాల‌యాల్లో, ఆన్ లైన్‌లో, ఈవీ డీల‌ర్ల వ‌ద్ద అందుబాటులో ఉంది. ఈ స్కూట‌ర్ ఏథ‌ర్ 450 సిరీస్‌, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ, ఓలా ఎస్‌1 ప్రొ స్కూట‌ర్ల‌కు గ‌ట్టి పోటీనిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement