Kia Syros EV | కొత్త కార్ సిరీస్‌ను లాంచ్ చేసిన కియా.. ఒక్క సారి చార్జ్ చేస్తే 526 కిలోమీటర్ల మైలేజ్..
Kia Syros EV | ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం కియా భారత్‌లో తన నూతన ఎలక్ట్రిక్ కార్ సిరీస్‌ను లాంచ్ చేసింది. తన రెండో మేడ్ ఇన్ ఇండియా మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ వాహనంగా కియా సిరోస్ ఈవీని అధికారికంగా భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది.
Automobiles | Published On Jul 24, 2026, 12.09 pm IST
Kia Syros EV | ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం కియా భారత్‌లో తన నూతన ఎలక్ట్రిక్ కార్ సిరీస్‌ను లాంచ్ చేసింది. తన రెండో మేడ్ ఇన్ ఇండియా మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ వాహనంగా కియా సిరోస్ ఈవీని అధికారికంగా భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. ఈవీ-ప్రత్యేక టెక్నాలజీలు, లెవల్-2 ఏడీఏఎస్, కనెక్టెడ్ ఫీచర్లు, బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (బీఏఏఎస్), అషూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్, హై-వోల్టేజ్ బ్యాటరీ వారంటీ తదితర అనేక ఫీచర్లతో ఈ వాహనాన్ని కియా తీసుకొచ్చింది. కియా సిరోస్ ఈవీలో 42 కిలోవాట్ అవర్, 51.4 కిలోవాట్ అవర్ ఎక్స్టెండెడ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. 51.4 కిలోవాట్ అవర్ వేరియంట్ ఏఆర్ఏఐ ధ్రువీకరణ ప్రకారం పూర్తి చార్జ్‌తో 526 కిలోమీటర్ల (ఎంఐడీసీ ఫుల్) వరకు మైలేజ్‌ను ఇస్తుంది. 42 కిలోవాట్ అవర్ వేరియంట్ పూర్తి చార్జ్‌తో 443 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది.
39 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్..
51.4 కిలోవాట్ అవర్ వేరియంట్ 171 పీఎస్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 8.1 సెకన్లలో అందుకుంటుంది. దృఢమైన కె1 ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించిన ఈ ఎస్‌యూవీలో నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (ఎన్ఎంసీ) బ్యాటరీని ఉపయోగించారు. దీనికి ఐపీ67 రేటింగ్, లిక్విడ్-కూల్డ్ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉన్నాయి. కియా సిరోస్ ఈవీ 100 కిలోవాట్ డీసీ ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. దీంతో బ్యాటరీని 10 నుంచి 80 శాతం వరకు కేవలం 39 నిమిషాల్లో చార్జ్ చేయవచ్చు. అలాగే 10.8 కిలోవాట్ ఆన్‌బోర్డ్ ఏసీ చార్జర్, డీసీ చార్జింగ్ సమయంలో బ్యాటరీ ఉష్ణోగ్రతను నియంత్రించే బ్యాటరీ కండిషనింగ్ టెక్నాలజీని కూడా అందించారు.
ప్రత్యేక బ్యాటరీ హీటింగ్ సిస్టమ్..
ఈ వాహనంలో ప్యాడిల్ షిఫ్టర్లు కలిగిన రీజెనరేటివ్ బ్రేకింగ్, ఆటో మోడ్, ఐ-పెడల్ మోడ్, వెహికల్-టు-లోడ్ (ఇంటర్నల్), వర్చువల్ ఇంజిన్ సౌండ్ సిస్టమ్ (వీఈఎస్ఎస్), బ్యాటరీ హీటింగ్ సిస్టమ్, షిఫ్ట్-బై-వైర్ కాలమ్ టెక్నాలజీ వంటి ఈవీ ఫీచర్లు ఉన్నాయి. మై కియా యాప్, కియా ఇండియా వెబ్సైట్ ద్వారా కె-చార్జ్ ఎకోసిస్టమ్ కు కనెక్ట్ అవుతుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ రూట్ ప్లానర్, చార్జింగ్ నియంత్రణలు, వివిధ ఆపరేటర్ల చార్జింగ్ స్టేషన్ల సమాచారం అందుబాటులో ఉంటుంది. కియా సిరోస్ ఈవీకి డిజిటల్ టైగర్ ఫేస్, ఐస్ క్యూబ్ ఎంఎఫ్ఆర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్టాండర్డ్ ఫ్రంట్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, స్టార్ మ్యాప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు, స్టార్ మ్యాప్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ అందించారు. అలాగే ఆటో స్ట్రీమ్‌లైన్ డోర్ హ్యాండిల్స్, 17 ఇంచుల క్రిస్టల్ కట్ డ్యుయల్-టోన్ ఏరో అలాయ్ వీల్స్, 16 ఇంచుల వీల్ ఆప్షన్, బ్లాక్ హై-గ్లోస్ స్కిడ్ ప్లేట్లు, రూఫ్ రైల్స్, సైడ్ గార్నిష్‌లు ఉన్నాయి.

భారీ పనోరమిక్ డిస్ప్లే..
ఇంటీరియర్‌లో 76.2 సెంటీమీటర్ల (30 ఇంచుల) ట్రినిటీ పనోరమిక్ డిస్ప్లే ప్రధాన ఆకర్షణ. ఇందులో 12.3 ఇంచుల హెచ్డీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 ఇంచుల హెచ్డీ టచ్‌స్క్రీన్ నావిగేషన్, 5 ఇంచుల క్లైమేట్ కంట్రోల్ ఇంటర్ఫేస్ ఉన్నాయి. కేబిన్‌లో కియా కనెక్ట్ 2.0 ద్వారా 95కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు, ఓటీఏ సాఫ్ట్వేర్ అప్డేట్లు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, హార్మన్ కార్డన్ 8-స్పీకర్ ప్రీమియం ఆడియో సిస్టమ్, వైర్లెస్ ఫోన్ చార్జర్, డ్యుయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, 64 రంగుల అంబియెంట్ లైటింగ్, స్మార్ట్ డ్యాష్‌క్యామ్, యూఎస్బీ టైప్-సి పోర్టులు, 100 వాట్ల ఫ్రంట్ యూఎస్బీ-సి చార్జర్, ప్రత్యేక కవర్‌తో 16 లీటర్ల ఫ్రంట్ ట్రంక్ ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం ముందు వెంటిలేటెడ్ సీట్లు, వెనుక వెంటిలేటెడ్ సీట్లు, 4-వే పవర్ డ్రైవర్ సీట్, 60:40 స్ప్లిట్, స్లైడ్, రిక్లైన్ ఫంక్షన్‌తో రియర్ సీట్లు, రియర్ డోర్ సన్‌షేడ్ కర్టెన్లు అందించారు.
అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు..
భద్రత పరంగా ఈ ఎస్‌యూవీలో లెవల్-2 ఏడీఏఎస్ తో 16 ఆటోమేటిక్ డ్రైవింగ్ సహాయక ఫీచర్లు ఉన్నాయి. ఫ్రంట్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో, లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, పార్కింగ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, ముందు-వెనుక-సైడ్ పార్కింగ్ సెన్సార్లు, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ యాంకరేజ్, రియర్ ఆక్యుపెంట్ అలర్ట్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి మొత్తం 25 హై-సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కియా బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (బీఏఏఎస్) ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తోంది. ఇందులో ఛాసిస్, బ్యాటరీలకు వేర్వేరుగా ఫైనాన్స్ సదుపాయం ఉంటుంది. ఈ పథకం రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బ్యాటరీ ఈఎంఐ ప్రతి కిలోమీటర్‌కు రూ.3.3గా నిర్ణయించారు.

బ్యాటరీపై వారంటీ..
హై-వోల్టేజ్ బ్యాటరీపై మొదటి యజమానికి 15 సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ల వారంటీ, రెండో యజమానికి 8 సంవత్సరాలు లేదా 1.60 లక్షల కిలోమీటర్లు (ఏది ముందైతే అది) వారంటీ అందిస్తారు. అయితే ట్యాక్సీలు, ఫ్లీట్ వాహనాలకు మొదటి యజమాని వారంటీ వర్తించదు. అలాగే అషూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్ కింద మూడేళ్ల తర్వాత గరిష్ఠంగా 80 శాతం రీసేల్ విలువను హామీ ఇస్తోంది. కొనుగోలుదారులు 3 లేదా 4 సంవత్సరాల యాజమాన్య కాలాన్ని ఎంచుకుని, నిర్ణీత కాలం తర్వాత వాహనాన్ని దగ్గరే పెట్టుకోవడం, తిరిగి ఇవ్వడం లేదా కొత్త వాహనాన్ని తీసుకోవడం వంటి ఆప్షన్లు పొందవచ్చు. ఈ 80 శాతం బైబ్యాక్ ఆఫర్ వాహనం విడుదలైన 60 రోజుల్లోపు కొనుగోలు చేసే వారికి వర్తిస్తుంది. మై కన్వీనియన్స్ ఈ-ప్లస్ పేరుతో నిర్వహణ, ఎక్స్టెండెడ్ వారంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కలిగిన రెండు ప్యాకేజీలను కూడా కియా ప్రవేశపెట్టింది. ఇందులో 4 సంవత్సరాల ప్రీమియం ప్యాకేజీ, 5 సంవత్సరాల లగ్జరీ ప్యాకేజీ అందుబాటులో ఉన్నాయి.
20వేలకు పైగా చార్జింగ్ పాయింట్లు..
చార్జింగ్ సౌకర్యం కోసం కె-చార్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా 23 చార్జ్ పాయింట్ ఆపరేటర్లకు చెందిన 20,300కు పైగా చార్జింగ్ పాయింట్లు మైకియా యాప్, కియా ఇండియా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 129కి పైగా కియా డీలర్‌షిప్‌లలో హై-కెపాసిటీ డీసీ ఫాస్ట్ చార్జర్లు, 275కు పైగా ఈవీ-రెడీ వర్క్‌షాప్‌లు, 400 నగరాల్లో 900కు పైగా కస్టమర్ టచ్పాయింట్లను ఏర్పాటు చేశారు. కియా సిరోస్ ఈవీ మొత్తం ఏడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. గ్లేసియర్ వైట్ పర్ల్, ఫ్రాస్ట్ బ్లూ, గ్రావిటీ గ్రే, ప్యూటర్ ఆలివ్, మాగ్మా రెడ్, ఐవరీ సిల్వర్ మ్యాట్, ఐవరీ సిల్వర్ గ్లోస్, ఆరోరా బ్లాక్ పర్ల్, ఎక్స్‌క్లూజివ్ మ్యాట్ గ్రాఫైట్ రంగుల్లో లభిస్తోంది. ఎక్స్-లైన్ ఈఆర్ వేరియంట్ మాత్రం ఎక్స్‌క్లూజివ్ మ్యాట్ గ్రాఫైట్, ఆరోరా బ్లాక్ పర్ల్ రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంటీరియర్‌లో క్లౌడ్ బ్లూ అండ్ గ్రే, ఒనిక్స్ బ్లాక్ అండ్ ఆఫ్-వైట్, ఒనిక్స్ బ్లాక్ అండ్ హంటర్ గ్రీన్ థీమ్‌లను అందించారు.

ధర వివరాలు..
కియా సిరోస్ ఈవీకి చెందిన ఎక్స్ షోరూం ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 42 కిలోవాట్ అవర్ బ్యాటరీతో హెచ్టీకే వేరియంట్ ధర రూ.13,49,900 ఉండగా, హెచ్టీకే ప్లస్ ధర రూ.14,99,900గా ఉంది. హెచ్‌టీఎక్స్ మోడల్ ధరను రూ.15,99,900గా నిర్ణయించారు. 51.4 కిలోవాట్ అవర్ ఎక్స్టెండెడ్ రేంజ్లో హెచ్టీకే ప్లస్ ఈఆర్ మోడల్ ధర రూ.16,99,900 ఉండగా, హెచ్‌టీఎక్స్ ఈఆర్ మోడల్ రూ.17,99,900, హెచ్‌టీఎక్స్ ప్లస్ ఈఆర్ వేరియెంట్ రూ.19,49,900, ఎక్స్-లైన్ ఈఆర్ మోడల్ రూ.19,99,900కు అందుబాటులో ఉన్నాయి. కియా సిరోస్ ఈవీ కార్లకు గాను ఈ నెల 30 నుంచి దేశవ్యాప్తంగా అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు




