Arasavalli | సూర్యనారాయణుడిని తాకని సూర్యకిరణాలు.. అరసవల్లిలో ఆశ్చర్యం
Arasavalli | ఆంధ్రప్రదేశ్‌లోని సుప్రసిద్ధ దేవాలయం అరసవల్లి (Arasavalli) శ్రీ సూర్యనారాయణ స్వామివారి (Suryanarayana Swamy) భక్తులకు మరోసారి నిరాశే ఎదురయింది. ప్రతి సంవత్సరం ఉత్తరాయణం, దక్షిణాయన మార్పు సమయంలో సూర్య భగవానుడి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు స్పర్శించడం (Sun Rays) ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది.
Andhra pradesh | Published On Oct 1, 2026, 10.45 am IST
Arasavalli | త్రినేత్ర న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని సుప్రసిద్ధ దేవాలయం అరసవల్లి (Arasavalli) శ్రీ సూర్యనారాయణ స్వామివారి (Suryanarayana Swamy) భక్తులకు మరోసారి నిరాశే ఎదురయింది. ప్రతి సంవత్సరం ఉత్తరాయణం, దక్షిణాయన మార్పు సమయంలో సూర్య భగవానుడి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు స్పర్శించడం (Sun Rays) ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది. అంటే ఏటా మార్చి 9, 10 తేదీలతో పాటు అక్టోబర్ 1, 2 తేదీలలో కూడా సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోని మూలవిరాట్టును తాకుతాయి.
అయితే మార్చి 9, 10 తేదీల్లో సూర్యుడిని మబ్బులు కమ్మేయడంతో సూర్య కిరణాలు మూలవిరాట్‌ను తాకలేదు. ఇక ఆనవాయితీ ప్రకారం అక్టోబర్ 1న (గురువారం) సూర్యభగవాడిని ఉషోదయం వేళ సూర్యకిరణాలు తాకాల్సి ఉన్నప్పటికీ.. అది జరగలేదు. దీంతో ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన భక్తులు ఆశ్చర్యపోయారు. వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా సూర్యకిరణాలు స్వామి వారిని తాకలేదని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. అయితే, నిరాశ చెందాల్సిన అవసరం లేదని, శుక్రవారం ఉదయం సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్‌ను తాకే అవకాశం ఉందని ప్రధాన అర్చకులు స్పష్టం చేశారు.
సాధారణంగా కొన్ని ఆలయాల్లో అప్పుడప్పుడు సూర్యకిరణాలు గర్భగుడిలోకి ప్రవేశించడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో (Arasavalli Temple) మాత్రం ఇది ప్రతి ఏడాది నిర్ణీత తేదీలలో క్రమం తప్పకుండా జరుగుతుండటం విశేషం. అంతేకాకుండా ఆలయ ప్రధాన ద్వారం నుంచి సుమారు 70 అడుగుల లోపల ఉన్న మూలవిరాట్టును సూర్యకిరణాలు తాకడం మరో ప్రత్యేకత. అలివేటి మండపం, ధ్వజస్తంభం, గర్భగుడి ద్వారాలను దాటి స్వామివారిని తాకే ఈ దృశ్యాన్ని భక్తులు దైవ లీలగా భావిస్తారు. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. కాగా, ఆనవాయితీ ప్రకారం మార్చిలో సూర్య భగవానుడి లేలేత కిరణాలు గర్భగుడిలోకి నేరుగా పడాల్సి ఉన్నప్పటికీ అది జరగకపోవడం, ఇప్పుడు కూడా అలాగే అవుతుండటంతో భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Adani Energy Solutions | అదానీ ఎనర్జీ షేర్ల జోరు.. 5 శాతం జంప్..
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్‌తో ఒత్తిడి..
- ●Amitabh Bachchan | షూటింగ్లో జారిపడ్డ అమితాబ్ బచ్చన్.. మోకాలికి గాయం
- ●Elon Musk | ట్రంప్ ప్రభుత్వంలోకి మస్క్ రీ ఎంట్రీ.. అమెరికా రక్షణ శాఖలో కీలక బాధ్యతలు
- ●Kajal Aggarwal | 30 కోట్లతో తీస్తే కోటి కలెక్షన్లు వచ్చాయి - ఓటీటీలో తెలుగులో రిలీజైన కాజల్ బాలీవుడ్ మూవీ
- ●CPA Study Tour | సీపీఏ స్టడీ టూర్.. బెర్లిన్‌లో మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్‌కు ఘన స్వాగతం

Adani Energy Solutions | అదానీ ఎనర్జీ షేర్ల జోరు.. 5 శాతం జంప్..

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్‌తో ఒత్తిడి..

Amitabh Bachchan | షూటింగ్లో జారిపడ్డ అమితాబ్ బచ్చన్.. మోకాలికి గాయం

Elon Musk | ట్రంప్ ప్రభుత్వంలోకి మస్క్ రీ ఎంట్రీ.. అమెరికా రక్షణ శాఖలో కీలక బాధ్యతలు



