త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kajal Aggarwal | 30 కోట్ల‌తో తీస్తే కోటి క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి – ఓటీటీలో తెలుగులో రిలీజైన కాజ‌ల్ బాలీవుడ్ మూవీ

కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ మూవీ ది ఇండియా స్టోరీ థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచింది. 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ కేవ‌లం కోటి మాత్ర‌మే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ది ఇండియా స్టోరీ మూవీ ఓటీటీలో తెలుగులో రిలీజైంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగు వెర్ష‌న్ స్ట్రీమింగ్ అవుతోంది.

N

Entertainment | Published On Oct 1, 2026, 11.34 am IST

Kajal Aggarwal | 30 కోట్ల‌తో తీస్తే కోటి క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి – ఓటీటీలో తెలుగులో రిలీజైన కాజ‌ల్ బాలీవుడ్ మూవీ
Advertisement

Kajal Aggarwal | కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించిన‌ ది ఇండియా స్టోరీ ఈ ఏడాది బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్స్‌లో ఒక‌టిగా నిలిచింది. 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో కేవ‌లం కోటి క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టింది. కాజ‌ల్ కెరీర్‌లోనే అతి త‌క్కువ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాగా చెత్త రికార్డును క్రియేట్ చేసింది.

జియో హాట్‌స్టార్‌...

తాజాగా ఈ బాలీవుడ్ మూవీ తెలుగులో రిలీజైంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు త‌మిళ వెర్ష‌న్లు స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది.
థియేట‌ర్ల‌లో కూడా ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, త‌మిళంలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. డ‌బ్బింగ్ ప‌నుల ఆల‌స్యం కావ‌డంతో హిందీలో విడుద‌ల చేసిన కొద్ది రోజుల గ్యాప్‌ త‌ర్వాత ద‌క్షిణాది భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని అనుకున్నారు. కానీ బాలీవుడ్‌లో ది ఇండియా స్టోరీ డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డంతో తెలుగు, త‌మిళ వెర్ష‌న్ల‌ను నేరుగా ఓటీటీలో విడుద‌ల చేశారు.

కాజ‌ల్ అగ‌ర్వాల్‌...

ది ఇండియా స్టోరీ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో పాటు శ్రేయాస్ త‌ల్ఫ‌డే కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. చేత‌న్ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ లాయ‌ర్‌గా ఓ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించింది. పంటపొలాల్లో విచ్చ‌ల‌విడిగా వాడే క్రిమిసంహార‌క మందులు, ఆహార క‌ల్తీ వ‌ల్ల త‌లెత్తుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌పై సందేశంతో ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించారు. కాన్సెప్ట్ బాగున్నా నేటిత‌రం ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యేలా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ‌టంతో ది ఇండియా స్టోరీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

బాల‌కృష్ణ దాదా...

ప్ర‌స్తుతం తెలుగులో బాల‌కృష్ణ దాదాలో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా డిసెంబ‌ర్ 24న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. భ‌గ‌వంత్ కేస‌రి త‌ర్వాత బాల‌కృష్ణ‌, కాజ‌ల్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈ సినిమాకు గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

 

Advertisement
Advertisement