Navy Officer Kills Lover | విశాఖలో దారుణం: ప్రియురాలిని చంపి, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన నేవీ ఉద్యోగి
విశాఖపట్నంలో ఢిల్లీ 'శ్రద్ధా వాకర్' తరహా దారుణం వెలుగుచూసింది. నేవీ ఉద్యోగి తన ప్రియురాలిని దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచాడు. ఆ తర్వాత స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
Visakhapatnam | Published On Mar 30, 2026, 4.58 pm IST
Navy Officer Kills Lover | త్రినేత్ర.న్యూస్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ 'శ్రద్ధా వాకర్' హత్య ఉదంతాన్ని గుర్తుచేసే అత్యంత దారుణమైన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ఓ నేవీ ఉద్యోగి తన ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
డేటింగ్ యాప్‌లో పరిచయం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియన్ నేవల్ షిప్ (INS) డేగాలో పనిచేస్తున్న చింతడ రవీంద్ర (30)కు, పోలిపల్లి మౌనిక (31) అనే యువతితో 2021లో 'మింగిల్' (Mingle) అనే డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. తరచుగా విశాఖలోని పార్కులు, థియేటర్లలో కలుసుకునే వీరు.. క్రమంగా ప్రేమలో పడ్డారు. అయితే, రవీంద్ర 2024లో వేరొక యువతిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా మౌనికతో అతడి సంబంధం కొనసాగింది.
మరణ శాసనంగా మారిన ఆహ్వానం
కొద్ది రోజుల క్రితం రవీంద్ర భార్య విజయనగరంలోని తన పుట్టింటికి వెళ్లింది. ఇదే సరైన సమయంగా భావించిన రవీంద్ర.. ఆదివారం మధ్యాహ్నం మౌనికను విశాఖలోని తన ఇంటికి పిలిపించాడు. అయితే, సాయంత్రం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన రవీంద్ర.. మౌనికకు ఊపిరి ఆడకుండా చేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు.
ఆన్‌లైన్‌లో కత్తి తెప్పించి.. ముక్కలుగా నరికి
హత్య అనంతరం ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ద్వారా రవీంద్ర ఒక కత్తిని ఆర్డర్ చేశాడు. ఆ కత్తితో మౌనిక మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. మొండెం నుంచి తల, కాళ్లు, చేతులను వేరు చేశాడు. కాళ్లు, తుంటి భాగాన్ని ఓ ట్రాలీ బ్యాగ్‌లో కుక్కి.. మొండాన్ని మాత్రం ఫ్రిజ్‌లో దాచాడు. తల, చేతులను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు
ఈ దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడు రవీంద్ర నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మౌనిక తన వద్ద నుంచి రూ.3.5 లక్షలు తీసుకుందని, తమ సంబంధం గురించి తన భార్యకు చెబుతానని తరచూ బ్లాక్‌మెయిల్ చేసేదని పోలీసుల విచారణలో వెల్లడించాడు. డబ్బుల వ్యవహారం, బ్లాక్‌మెయిల్ కారణంగానే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఆమె వేధింపులు భరించలేకే పథకం ప్రకారం హత్య చేశానని నిందితుడు అంగీకరించాడు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్రిజ్‌లో, ఇంట్లో ఉన్న మృతదేహం భాగాలను స్వాధీనం చేసుకున్నారు. మౌనిక తల కోసం గాలిస్తున్నారు. మిగిలిన శరీర భాగాలను గుర్తించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
శ్రద్ధా వాకర్ కేసును తలపిస్తున్న ఘటన
ఈ దారుణం మే 18, 2022న జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసును గుర్తుచేస్తోంది. ఢిల్లీలో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ అమీన్ పూనావాలా.. శ్రద్ధాను గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచాడు. దొరికిపోకుండా ఉండేందుకు ఆ ముక్కలను నెల రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో విసిరేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విశాఖ ఘటన కూడా సరిగ్గా అదే తరహాలో జరగడం గమనార్హం.
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



