Guinness World Record Longest Hair | ఉక్రెయిన్ మహిళ రికార్డ్ బ్రేక్.. 9 అడుగుల పొడవాటి జుట్టుతో గిన్నిస్ రికార్డ్ సృష్టించిన భారతీయ మహిళ
ఉత్తరాఖండ్‌కు చెందిన రేణు ధరియాల్ 9 అడుగుల పొడవాటి జుట్టుతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఉక్రెయిన్ మహిళ రికార్డును బ్రేక్ చేసిన ఈమె హెయిర్ కేర్ సీక్రెట్స్ ఇవే!
Viral news | Published On Aug 8, 2026, 5.42 pm IST
సంక్షిప్త సారాంశం
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి చెందిన రేణు ధరియాల్ 271.50 సెంటీమీటర్ల (8 అడుగుల 10 అంగుళాలు) జుట్టుతో గిన్నిస్ రికార్డ్ సాధించారు. గతంలో ఉక్రెయిన్‌కు చెందిన అలియా నసిరోవా (257.33 సెం.మీ) పేరిట ఉన్న రికార్డును ఈమె బ్రేక్ చేశారు. 2015 నుంచి జుట్టు కత్తిరించుకోని రేణు.. రసాయనాలకు బదులు ఇంట్లో తయారుచేసిన నాచురల్ షాంపూలు, నూనెలనే వాడుతున్నారు. కంటెంట్ క్రియేటర్‌గా, యూట్యూబర్‌గా ఉన్న రేణు.. తన బ్యూటీ అండ్ హెయిర్ కేర్ టిప్స్‌ను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
Guinness World Record Longest Hair | త్రినేత్ర.న్యూస్ : ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని హల్ద్వానీకి చెందిన రేణు ధరియాల్ (Renu Dhariyal) అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవాటి జుట్టు ఉన్న మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Records) లోకి ఎక్కారు. ఏళ్ల తరబడి చూపిస్తున్న ఓపిక, హెయిర్ కేర్ పట్ల ఉన్న శ్రద్ధ ఆమెకు ఈ రికార్డును తెచ్చిపెట్టాయి. ఏప్రిల్‌లో ఆమె జుట్టును కొలిచిన గిన్నిస్ ప్రతినిధులు.. తాజాగా అధికారికంగా ఈ రికార్డును ప్రకటించారు.
రికార్డ్ బ్రేక్ చేసిందిలా..
గతంలో ఈ రికార్డ్ ఉక్రెయిన్‌కు (Ukraine) చెందిన అలియా నసిరోవా (257.33 సెం.మీ) పేరిట ఉండేది. కానీ రేణు జుట్టు ఏకంగా 271.50 సెంటీమీటర్లు (8 అడుగుల 10 అంగుళాలు) ఉండటంతో ఆ పాత రికార్డ్ బ్రేక్ అయ్యింది. విశేషం ఏమిటంటే.. చరిత్రలో అత్యంత ఎత్తైన వ్యక్తిగా రికార్డుకెక్కిన రాబర్ట్ వాడ్లో (272 సెం.మీ) ఎత్తుకు కేవలం అర సెంటీమీటర్ మాత్రమే తక్కువగా ఆమె జుట్టు పొడవు ఉంది.
2015 నుంచి హెయిర్ కట్ లేదు
భారతీయ సంప్రదాయంలో పొడవైన కురులకు (Long hair) ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని రేణు తన జుట్టును పెంచడం ప్రారంభించారు. 2015 నుంచి ఆమె హెయిర్ కట్ చేసుకోలేదు. నేల మీద పాకేంత పొడవుగా ఉన్నప్పటికీ.. ఆమె జుట్టు చాలా మందంగా (thick), షైనీగా ఉంటుంది. బయటకు వెళ్లినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ఓ పెద్ద జడ (braid) వేసుకుంటారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసిన ఫోటోల్లో ఆమె జుట్టు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఆమె హెయిర్ కేర్ సీక్రెట్ ఇదే..
ఇంత పొడవాటి జుట్టును కేవలం పెంచితే సరిపోదు, దాన్ని మెయింటైన్ చేయడం అంటే మాటలు కాదు. కెమికల్స్ ఉండే కమర్షియల్ ప్రొడక్ట్స్ కాకుండా.. ఇంట్లోనే తయారు చేసిన హెయిర్ ఆయిల్స్ (Hair oils), నాచురల్ షాంపూలను మాత్రమే రేణు వాడుతున్నారు. గంటల తరబడి ఓపికగా తలస్నానం చేయడం, చిక్కులు తీసుకోవడం ఆమె దినచర్యలో భాగం.
యూట్యూబర్‌గానూ ఫుల్ క్రేజ్..
రేణు ధరియాల్ కేవలం రికార్డ్ హోల్డర్ మాత్రమే కాదు, ఆమె ఓ పాపులర్ కంటెంట్ క్రియేటర్ (Content creator), యూట్యూబర్ (YouTuber) కూడా. తన కురుల రహస్యాలను, బ్యూటీ టిప్స్‌ను ఆన్‌లైన్‌లో ఫాలోవర్స్‌తో పంచుకుంటున్నారు. తద్వారా సహజ సౌందర్యం, భారతీయ సంస్కృతి పట్ల అందరిలో అవగాహన పెంచాలని ఆమె కోరుకుంటున్నారు. తన రికార్డ్ ద్వారా తన సొంత ప్రాంతానికి, దేశానికి గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందని రేణు చెబుతున్నారు.
Renu Dhariyal (India) has the longest hair in the world! 🩷
She has claimed the record for longest hair on a living person (female).
Her stunning raven tresses measure an unbelievable 271.50 cm (8 ft 10 in) long. pic.twitter.com/N8FeWdUGP0
— Guinness World Records (@GWR) August 7, 2026
తాజావార్తలు
- ●Arunachal Pradesh | చైనా దూకుడుకు భారత్ కౌంటర్.. 27 వ్యూహాత్మక ప్రాంతాలకు అధికారిక పేర్లు..
- ●Drugs | హైదరాబాద్‌లో రూ.12.65 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్
- ●Uttam Kumar Reddy | భూసేకరణ, పునరావాసం కోసం రూ.5 వేల కోట్లకు సీఎం హామీ ఇచ్చారు.. ఇక ఏ ప్రాజెక్టూ ఆగొద్దు
- ●Toxic Trailer Launch | బెంగళూరులో ‘టాక్సిక్’ సందడి.. ఎయిర్‌ఫోర్ట్‌లో తళుక్కుమన్న తారలు..!
- ●Deepfakes | అల్గారిథమ్‌ను మార్చండి.. డీప్‌ఫేక్ కంటెంట్‌పై మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు
- ●Hero MotoCorp | హీరో తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌కు లాంచ్ డేట్ ఫిక్స్.. గ్రాండ్ ఎంట్రీ ఎప్పుడంటే..

Arunachal Pradesh | చైనా దూకుడుకు భారత్ కౌంటర్.. 27 వ్యూహాత్మక ప్రాంతాలకు అధికారిక పేర్లు..

Drugs | హైదరాబాద్‌లో రూ.12.65 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్

Uttam Kumar Reddy | భూసేకరణ, పునరావాసం కోసం రూ.5 వేల కోట్లకు సీఎం హామీ ఇచ్చారు.. ఇక ఏ ప్రాజెక్టూ ఆగొద్దు

Toxic Trailer Launch | బెంగళూరులో ‘టాక్సిక్’ సందడి.. ఎయిర్‌ఫోర్ట్‌లో తళుక్కుమన్న తారలు..!



